Summer Gardening Tips: వేసవిసెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? విహారయాత్రకు వెళ్లే ముందు మొక్కలను ఇలా సంరక్షించండి

|

Apr 22, 2024 | 7:36 PM

చాలా మంది సెలవుల్లో బయటకు వెళ్లినప్పుడు వారు తమ మొక్కల గురించి పగలు, రాత్రి ఆందోళన చెందుతారు. అటువంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేక చిట్కాల సహాయంతో ఇంట్లో మీరు లేకపోయినా కూడా మొక్కలు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. ఈ చిట్కాల సహాయంతో మీ మొక్కలు వేడి వేసవిలో కూడా ఆకుపచ్చగా కనిపిస్తాయి.

Summer Gardening Tips: వేసవిసెలవుల్లో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? విహారయాత్రకు వెళ్లే ముందు మొక్కలను ఇలా సంరక్షించండి
Summer Gardening Tips
Follow us on

వేసవి సెలవులు వస్తే చాలు వెంటనే.. చాలా మంది ప్రజలు ఖచ్చితంగా ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. నచ్చిన ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్లి.. తమ ఫ్యామిలీతో సంతోషంగా గడపడమే కాదు..  స్వయంగా మండే వేడి నుండి ఉపశమనం పొందుతారు. అయితే ఇలా ట్రిప్ కి వెళ్లిన సమయంలో ఇంట్లో ఉంచిన మొక్కల పరిస్థితి అధ్వాన్నంగా మారుతుంది. వేసవిలో ప్రతి రోజు మొక్కలకు నీరు పెట్టాలసిందే.. నీరు ఒక్క రోజు మొక్కలకు అందకపోయినా వాటి పరిస్థితి మరింత దిగజారిపోతుంది. కనుక మొక్కలను వాటిని సంరక్షించకుండా విహారయాత్రకు వెళ్ళడానికి కొందరు ఇబ్బంది పడతారు.

చాలా మంది సెలవుల్లో బయటకు వెళ్లినప్పుడు వారు తమ మొక్కల గురించి పగలు, రాత్రి ఆందోళన చెందుతారు. అటువంటి పరిస్థితిలో కొన్ని ప్రత్యేక చిట్కాల సహాయంతో ఇంట్లో మీరు లేకపోయినా కూడా మొక్కలు జాగ్రత్తగా చూసుకోగలుగుతారు. ఈ చిట్కాల సహాయంతో మీ మొక్కలు వేడి వేసవిలో కూడా ఆకుపచ్చగా కనిపిస్తాయి.

కొబ్బరి పీచుని ఉపయోగించండి

మొక్కలకు నీళ్ళు పోయకుండా నేలను తేమను ఉంచడానికి.. మొక్కల వేర్లకు ఎండు కొబ్బరి పొట్టుని, పీచుని జోడించండి. కొబ్బరి పీచుని ఎండబెట్టి వాటిని పొట్టుగా మార్చిన తర్వాత.. దానిని మొక్కల వేర్ల కుదుళ్లలో  వేసి బాగా కలపాలి. తగినంత నీరు చిలకరించాలి. ఇలా చేయడం వల్ల మొక్కలు ఎక్కువ కాలం తేమగా, చల్లగా ఉంటాయి.

ఇవి కూడా చదవండి

నీటి కోసం ఏర్పాట్లు చేయండి

మొక్కలకు నీరు పెట్టడం చాలా ముఖ్యం. కనుక కొన్ని రోజుల పాటు ఇంటి నుంచి ఎక్కడికైనా బయలుదేరినప్పుడు మొక్కల ట్రేలను పూర్తిగా నీటితో నింపండి. దీనితో పాటు.. ఆటోమేటిక్ వాటర్ పంపింగ్ మెషీన్ ను కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దీంతో మొక్కలను ఎక్కువ కాలం తాజాగా ఉంచగలుగుతారు.

సూర్యకాంతికి దూరంగా

కొన్ని రోజులు విహారయాత్ర కోసం ఇంటి నుంచి బయటకు వెళుతున్నట్లయితే.. బాల్కనీలో లేదా టెర్రస్ పై  మొక్కలను ఉంచవద్దు. బదులుగా మొక్కలను చల్లని ప్రదేశంలో ఉంచండి. బాత్రూంలో మొక్కలను ఉంచవచ్చు. ఎందుకంటే బాత్రూమ్ ఇంట్లో ఇతర ప్రదేశాల కంటే చల్లగా ఉంటుంది.

ఎరువులు ఉపయోగించండి

ఎక్కువ రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్తున్నట్లయితే.. నెమ్మదిగా విడుదల నీటిని రిలీజ్ చేసే లేదా నెలకు తేమగా ఉంచే ఎరువులు వాడండి. దీంతో మొక్కలకు పోషణ అందడంతో పాటు వాటి ఎదుగుదల కూడా బాగుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..