Turmeric Basil Tea : ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రతియేటా ఎందరో కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు. భారత్‌లో ప్రతి ఏటా కొత్తగా రెండున్నర లక్షల మంది వరకు కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అలాగే ప్రతి ఏటా మూడున్నరకోట్ల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తోంది. ‘ది లాన్సెట్ గ్లోబల్ హెల్త్’ నివేదిక ప్రకారం.. మన దేశ జనాభాలో 10 శాతం మంది దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారని ఈ నివేదిక సారాంశం. వీటన్నింటికి కారణం మనం కిడ్నీలు ఆరోగ్యంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద తీసుకోకపోవడమే. అందుకే కిడ్నీ సమస్యలున్నవారు రెగ్యులర్‌గా తులసి, పసుపుతో తయారు చేసిన టీ తాగితే చక్కటి ఉపశమనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ టీని రెగ్యులర్ గా తాగడం వల్ల అనేక రకాల వ్యాధుల నుంచి మీ శరీరానికి విముక్తి లభిస్తుంది.
తులసి, పసుపుతో తయారు చేసిన టీ మన శరీరం నుంచి విషపదార్థాలను తొలగించడానికి పనిచేస్తుంది. తద్వారా కిడ్నీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటికి వెళ్లే అవకాశం ఉంటుంది. పూర్తిగా శుభ్రం అవుతాయి. జలుబు, దగ్గు, కఫం సమస్యలతో బాధపడేవారికి పసుపు, తులసి టీ చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా చలికాలంలో గొంతులో మంటను కూడా దూరం చేస్తుంది. ఆస్తమా ఉన్నవాళ్లు ఈ టీ తీసుకోవడం వల్ల శ్వాసనాళాలు పూర్తిగా తెరవబడుతాయి. దీని వల్ల శ్వాస తీసుకోవడం తేలికగా అవుతుంది. మీరు ఒత్తిడి సమస్యలతో బాధపడుతున్నట్లైతే ఈ టీని రోజూ త్రాగండి. ఈ డ్రింక్ తాగడం వల్ల మెదడులోని నరాలను ప్రశాంతపరుస్తుంది. మెదడుకి వేగంగా రక్తం ప్రవహించేలా చేస్తుంది. ఇది మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.