Viral Video: విమానంలో ఘర్షణ.. అటెండెంట్ దవడ పళ్లు రాలగొట్టిన ప్రయాణికురాలు.. షాకింగ్ వీడియో..
Viral Video: అమెరికాకు చెందిన విమానంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఫ్లైట్ అటెండెంట్‌పై ఓ ప్రయాణికురాలు పిడిగుద్దులు...
Viral Video: అమెరికాకు చెందిన విమానంలో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. ఫ్లైట్ అటెండెంట్‌పై ఓ ప్రయాణికురాలు పిడిగుద్దులు గుద్ది దవడ పళ్లు రాలగొట్టింది. ఆమె కొట్టిన దెబ్బలకు అటెండెంట్ మొహం మొత్తం రక్త సిక్తం అయ్యింది. ఈ షాకింగ్ ఘర్షణకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. అమెరికాకు చెందిన విమానం సాక్రమెంటో నుంచి శాన్‌డియాగో బయలుదేరింది. ఈ విమానం శాన్‌డియాగో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపానికి రాగానే.. సీట్ బెల్టు పెట్టుకోవాల్సిందిగా ఫ్లైట్ అటెండెంట్ ప్రయాణికులందరినీ కోరింది. ఈ క్రమంలో ఓ ప్రయాణికురాలితో మాట్లాడుతుండగా.. పక్కనే మరో ప్రయాణికురాలు అటెండెంట్‌పై ఊహించని రీతిలో అకస్మాత్తుగా దాడి చేసింది. పిడిగుద్దులు గుద్దింది. ఈ దాడిలో ఫ్లైట్ అటెండెంట్ తీవ్రంగా గాయపడింది. రెండు దంతాలు విరిగిపోయినట్లు తెలిసింది.
అయితే, ఈ ఘర్షణను గమనించిన మరో ప్రయాణీకుడు ఫైట్ అటెండర్‌పై దాడిని అడ్డుకున్నాడు. దాడి చేసిన మహిళపై అరిచాడు. ‘‘కూర్చోండి. ఫ్లైట్ అటెండెంట్‌ను కొట్టే హక్కు మీకు లేదు.’’ అంటూ ఆమెకు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అలా ఎలా కొడతారంటూ ప్రశ్నించాడు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. వాస్తవానికి ఫ్లైట్ అటెండెంట్ బెల్ట్ పెట్టుకోవాలని ప్రయాణికులందరికీ సూచించింది. ఆ క్రమంలో సీటు మధ్యలో ఉన్న ప్రయాణికురాలితో మాట్లాడుతూ.. పక్కనే ప్రయాణికురాలిపై వాలింది. ఇదే విషయమై సదరు ప్రయాణికురాలు ఫ్లైట్ అటెండెంట్‌కు వార్నింగ్ ఇచ్చింది. మీద వాలొద్దంటూ మూడు సార్లు చెప్పింది. అయినా వినకపోవడంతో ఆగ్రహించిన మహిళా ప్రయాణికురాలు.. ఆమెపై దాడికి పాల్పడింది.
ఇదిలాఉంటే.. ఈ ఘర్షణను తీవ్రంగా పరిగణించిన విమానయాన సంస్థ.. విచారణకు ఆదేశించింది. ఒకవేళ ప్రయాణికురాలిదే తప్పని తేలితే మాత్రం మొదటి నేరం కింద ఆమె పేరును 5 సంవత్సరాల పాటు నో ఫ్లై జాబితాలో చేరుస్తారు.
Viral Video:
Video obtained by CBS News shows the moment a Southwest Airlines flight attendant was punched by a passenger after asking her to keep her seat belt fastened during a flight from Sacramento to San Diego Sunday. https://t.co/gQusevodYC pic.twitter.com/oOYvPdwCFj
— CBS News (@CBSNews) May 27, 2021
Also read: