Farmer Success Story: వినూత్న పద్దతిలో వ్యవసాయం.. చెరువే పొలంగా చేసి లాభాలు ఆర్జిస్తున్న యువ రైతు..

జై జవాన్ జై కిసాన్ అన్నది మన నినాదం.. అన్న దాతని దేశానికి వెన్నెముక అని పిలుస్తాం. రైతే రాజు అని నినాదం చేస్తాం. తాజాగా ఒక యువకుడు నేలపై కాకుండా చెరుపు మీద కూరగాయలను పండిస్తూ వినూత్న పద్దతిలో వ్యవసాయం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ యువకుడు చేసే వ్యవసాయం ఇతర రైతులకు, శాస్త్రవేత్తలకు ఒక ప్రయోగాత్మక ప్రయోగశాలగా మారింది. ఆ యువ రైతు గురించి ఈ రోజు తెలుసుకుందాం..

Farmer Success Story: వినూత్న పద్దతిలో వ్యవసాయం.. చెరువే పొలంగా చేసి లాభాలు ఆర్జిస్తున్న యువ రైతు..
Odisha Farmer Success Story

Updated on: Aug 22, 2025 | 2:26 PM

రైతు వేళ్లు మట్టిలోకి వెళితేనే మన వేళ్లు నోట్లోకి వేల్తాయనే సంగతి అందికీ తెలిసిందే. అందికీ అన్నం పెట్టె అన్నదాత పట్టెడన్నం తినలేక వ్యవసాయం దండగ అనే స్టేజ్ కి చేరుకుంటున్నారు. అయినా కాడిని మాత్రం విడిచి పెట్టకుండా వ్యవసాయం పట్ల తమకున్న మక్కువుని చెప్పకనే చెబుతూ ఉంటారు. అయితే కొంతమంది డిఫరెంట్ పద్దతిలో ఆలోచించి వ్యవసాయం దండగ కాదు పండగ అని నిరూపిస్తున్నారు. అలా ఒడిశాకు చెందిన హీరోద్ పటేల్ అనే యువకుడు అందరికంటే వినూత్న పద్దతిలో వ్యవసాయం చేస్తూ లాభాలను అర్జిస్తున్నాడు. ఇతను వ్యవసాయం చేసే పద్దతి అతని తోటి రైతులకు, వ్యవసాయ శాస్త్రవేత్తలకు ఒక ప్రయోగాత్మక ప్రయోగశాలగా మారింది. ఒడిశాకు చెందిన ఈ యువ రైతు కూరగాయలు నేలపై కాకుండా చెరువుపై పండించడం.. లాభాలను ఆర్జించడం వలన అతని వినూత్న విధానంపై అందరికీ ఆసక్తి కలిగిస్తుంది.

సుందర్‌గఢ్ జిల్లాలోని రతన్‌పూర్ గ్రామానికి చెందిన హిరోద్ పటేల్ పొలాలను చూడటానికి ప్రతిరోజూ దూర ప్రాంతాల నుంచి రైతులు తరలివస్తారు. 32 ఏళ్ల ఈ యువ రైతు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ విధానాన్ని అవలంబించాడు. దీని ద్వారా షెడ్లలో క్లైంబర్లను పెంచడం, వ్యవసాయ చెరువులలో చేపల పెంపకాన్ని ఏకకాలంలో చేయడం ప్రారంభించాడు. దాదాపు ఎనిమిది సంవత్సరాల క్రితం.. హిరోద్ తన తండ్రి శివ శంకర్ తో పాటు వ్యవసాయం చేయడం మొదలు పెట్టాడు. అప్పుడు అతని తండ్రి సాంప్రదాయకంగా వరి సాగు చేస్తున్నాడు. ఇతర భారతీయ రైతుల మాదిరిగానే.. వారు కూడా కొద్దిపాటి రాబడి కోసం తరచుగా పగలు, రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా కష్టపడేవారు. ఇదంటూ చూసిన హీరోద్ వ్యవసాయాన్ని విభిన్నంగా చేయాలనీ భావించాడు.

వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చడానికి హీరోద్ ఒక వినూత్న విధానాన్ని అనుసరించాడు. వ్యవసాయ ఆదాయాన్ని పెంచుకోడంతో పాటు స్థలాన్ని ఆదా చేస్తూ వ్యవసాయం చేయాలని భావించాడు. తన 10 ఎకరాల పొలంలో వ్యవసాయ శాఖ వాటర్‌షెడ్ అభివృద్ధి ప్రాజెక్టు మద్దతుతో నేల సంరక్షణ యూనిట్ సహాయంతో నాలుగు వేర్వేరు చెరువులను తవ్వాడు. చేపల పెంపకం ప్రారంభించాడు.

ఇవి కూడా చదవండి

స్థలాన్ని ఉపయోగించుకోవాలని భావించి చెరువు చుట్టూ ఉన్న గట్ల మీద అరటి, జామ, కొబ్బరి వంటి పెద్ద చెట్లను నాటాడు. అదే సమయంలో అతను చెరువుపై తీగలతో ఒక ట్రేల్లిస్ వ్యవస్థను నిర్మించి.. చెరువు గట్టు అంచుల వెంబడి సొరకాయ మొక్కలను నాటాడు. వాటికి నీరు పెట్టవలసిన అవసరం లేదు. ఈ పాదులను నేలమీద పాకకుండా.. తీగల సాయంతో చెరువుపై పెరిగేలా చేశాడు. దీంతో తెగుళ్ల బారిన పడలేదు. సూర్యరశ్మి తగలడం, గాలి కదలిక, పందిరి అంతటా సులభంగా పిచికారీ చేయడం సులభం.. అంతేకాదు ఈ ట్రేల్లిస్ వ్యవస్థవలన కాయలను కోయడం సులభం. వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ అయిన హీరోద్ కూరగాయలు కోయడానికి.. ఒక పడవను కూడా నిర్మించుకున్నాడు.

ఈ సృజనాత్మక పద్ధతితో గత సెప్టెంబర్‌లో హిరోద్ 1,800 సొరకాయలను పండించాడు. దీని ద్వారా అదనంగా 35,000 ఆదాయం వచ్చింది. కాకరకాయ, బీరకాయ వంటి కూరగాయల సాగుతో పాటు, హిరోద్ చేపల పెంపకం ద్వారా తన ఆదాయాన్ని పెమ్చుకునాడు. తనకి ఉన్న భూమిలో కోళ్ల పెంపకం, ఉద్యానవనం వంటి ఇతర వ్యవసాయ కార్యకలాపాలు చేస్తున్నాడు. ఇప్పుడు వ్యవసాయ ద్వారా హిరోద్ పటేల్ ఏడాదికి 8 నుంచి 10 లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు. ఇతని సక్సెస్ సమీపంలోని రైతులకు ఆసక్తిని పెంచింది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..