కోటీశ్వరుల సక్సెస్ సీక్రెట్స్ ఇవే.. మీరూ జీవితంలో గెలవాలంటే ఫాలో అయిపోండి బ్రో..!
మధ్యతరగతి జీవితం జీవించలేకపోతున్నారా.. ఎంత కష్టపడ్డా మీదగ్గర డబ్బెందుకు నిలవదో తెలియక సతమతమవుతున్నారా.. అయితే, ఈ విషయాలు మీకోసమే. ప్రస్తుతం సమాజంలో బిలియనీర్లుగా పేరున్న వారంతా కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు కలిగి ఉంటారు. అవే వారి సక్సెస్ సీక్రెట్స్ అని నిరంతరం చెప్తుంటారు. మీలో కూడా ఈ అలవాట్లు ఉన్నాయా ఓసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి..

సమాజంలో డబ్బు, కీర్తి, సంపదలతో తులతూగుతున్న వారిని మీరెప్పుడైనా గమనించారా?.. ఒక సాధారణ వ్యక్తి నుంచి వారిని మనం ప్రత్యేకంగా ఎందుకు చూస్తున్నాం. వారికి డబ్బు ఉందని మాత్రమే అయ్యుండకపోవచ్చు. వారి సక్సెస్ స్టోరీస్. సక్సెస్ ను అందుకోవడానికి వారు జీవితంలో భాగం చేసుకున్న అలవాట్లు ప్రతిఒక్కరినీ ఆకర్షిస్తుంటాయి. అదృష్టం, అవకాశాలు వారిని సంపన్నులుగా మార్చడంలో కీలక పాత్ర పోషించి ఉండొచ్చు. కానీ వారి దినచర్యను ఓసారి గమనించండి. ఏం జరిగినా వారు వారి డైలీ రొటీన్ ను కొనసాగిస్తూనే ఉంటారు. వాయిదా వేయడం వారికి అలవాటు ఉండదు. రోజూవారి పనుల విషయంలో స్ట్రాంగ్ మెంటాలిటీ కలిగి ఉండటం వల్లే వారు విజయాలను అందిపుచ్చుకుంటారు. వారి సక్సెస్ మంత్ర ఏంటో మీరూ చూసేయండి..
త్వరగా నిద్రలేవడం..
చాలా మంది బిలియనీర్లు తమ దినచర్యను సూర్యోదయానికి ముందే మొదలుపెడతామని చెప్తుంటారు. ఇది వారికి ప్రణాళికలను సరైన సమయంలో అమలు చేయడానికి, ఫోకస్ పెంచుకోవడానికి ఉపయోగపడుతుందంటారు. ఈ అలవాటు వల్లే వారు కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు వెనకడుగు వేయరు. మిగిలిన వారిని కూడా ఉదయాన్నే నిద్రలేవడం అలవాటు చేసుకోవాలని వారు సూచిస్తుంటారు.
ఆరోగ్యం.. ఫిట్ నెస్..
ఆరోగ్యకరమైన శరీరంలో ఆరోగ్యకరమైన మనసు ఉంటుందని ఓ పాత సామెత ఉంది. అందుకే బిలియనీర్లు ఎప్పుడూ డబ్బు సంపాదన మీదే కాకుండా వ్యాయామం అనేది వారి దినచర్యలో ముఖ్య భాగంగా ఉంచుకుంటారు. అది కాసేపు వాకింగ్ అయినా, లేదా వెయిట్ లెఫ్టింగ్ ఇలా రకరకాల వ్యాయామాలు వ్యక్తి దీర్ఘకాలిక పనితీరు మీద నేరుగా ప్రభావం చూపుతాయని వారు బలంగా నమ్ముతారు. లేదంటే చిన్న పాటి ఓటములకే కుంగుబాటు, డిప్రెషన్ కు గురై సక్సెస్ రాకముందే ఫెయిల్యూర్ గా మిగులుతారు.
ఏకాగ్రత సడలించకపోవడం..
డిజిటల్ ప్రపంచంలో మన అటెన్షన్ ను లాక్కోవడానికి నిరంతరం ఏదో ఒక విషయం, సాధనం తయారుగా ఉంటూనే ఉంటుంది. డబ్బు సంపాదించేవారు మాత్రం ఈ క్షణకాలపు ఆనందాలను శత్రువులుగా చూస్తారు. పెద్ద ఫలితాలను ఇచ్చే పనులమీదనే వారు పూర్తి ఫోకస్ ను నిలుపుతారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉంటారు. నిరంతరం మెదడులో ఒక లక్ష్యాన్ని నిర్ధేశించుకుని దాని కోసం పనిచేస్తుంటారు.
ఫెయిల్యూర్స్ కు సిద్ధంగా ఉంటారు..
వైఫల్యాలు ఎన్ని ఎదురైనా డబ్బు సంపాదించే మనస్తత్వం ఉన్నవారు వెనకడుగు వేయరు. నిరాశ చెందరు. బదులుగా దాని నుంచి నేర్చుకున్న విషయాలను పాఠాలుగా స్వీకరిస్తారు. డ్యామేజ్ ను ముందుగానే అంచనా వేసి నష్టాల రిస్క్ ను తగ్గించుకుంటారు. రిస్క్ లేని పనిపై వారు పెద్దగా ఇంట్రస్ట్ చూపించరు.
క్రమశిక్షణ అవసరం..
విజయం రాత్రికి రాత్రే వరించదు. విజయాన్ని పొందాలంటే ముందు మనం స్థిరంగా ఉండాలి. అనుకున్న లక్ష్యాలపై పట్టువిడవకుండా ముందుకు సాగాలి. అందులో కూడా మన క్రమశిక్షణ, నిబద్ధత కీలక పాత్ర పోషిస్తాయి. వ్యాపారంలో అయినా, పెట్టుబడుల్లో అయినా లేదా పర్సనల్ డెవలప్ మెంట్ అయినా సరే లాంట్ టర్మ్ లో ఇచ్చే ఫలితాలను దినచర్యలకు వారు కట్టుబడి ఉంటారు.
బలమైన నెట్ వర్క్..
బిలయనీర్లు చాలా తెలివిగా తమ చుట్టూ ఒక సర్కిల్ ను ఏర్పరుచుకుంటారు. తమను ఎప్పుడూ ఛాలెంజ్ చేసే వ్యక్తుల మధ్య గడిపేందుకు ఇష్టపడతారు. నెట్ వర్క్ ను డెవలప్ చేసుకోవడంపై ఎక్కువ ఫోకస్ పెడతారు. ఇతరుల కొత్త కొత్త ఆలోచనలను, సహకారాలను అందిపుచ్చుకోవడానికి ఇదొక గొప్ప స్ట్రాటెజీగా ఉపయోగపడుతుంది.
ఫెయిల్యూర్స్ కు బయపడరు..
కోటీశ్వరుల మనస్తత్వం కొన్ని విషయాల్లో రాటుదేలిపోయి ఉంటుంది. వారు ఓటములకు జడవరు. వాటన్నింటిని విజయానికి సోపానాలుగా మలుచుకుని ముందుకు సాగుతారు. వారు చేస్తున్న తప్పులను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటారు. గెలుపోటములను ఒకేలా తీసుకునే వారి సామర్థ్యమే వారిని సంపన్నుల జాబితాలో నిలిపుతుంటుంది.
వారు నిత్య విద్యార్థులు..
బిలియనీర్ అనే ముద్ర పడిన తర్వాత ప్రతి రోజూ అదొక రేసులో పరిగెట్టినట్టే ఉంటుంది. మీరు గమనిస్తే వీరు నిత్యం ఏతో ఒకటి నేర్చుకుంటూనే ఉంటారు. నేరచుకోవడం ఆపేసిన రోజు విజయం మీ జీవితాల నుంచి కనుమరుగవుతుంది. బిలియనీర్లకు చదివే అలవాటు, అది కుదరకపోతే కనీసం పాడ్ కాస్ట్ ల ద్వారా ఎప్పటికప్పుడు కొత్త విషయాలను తెలుసుకుంటారు. వారి సమయాన్ని మంచి మార్గదర్శకత్వం కోసం కేటాయిస్తుంటారు.




