చాప కింద నీరులా కబలిస్తున్న సైలెంట్ కిల్లర్.. మీ గుండె జాగ్రత్త బాస్!
ఈ భూమిపై ఒత్తిడి లేని వారు ఉండటం సాధ్యమే? అనేంతగా ఇదీ మన జీవితాలను ఆక్రమించింది. ఆర్థిక సమస్యలు, ఆఫీసు పని, కుటుంబ బాధ్యతలు వంటి వివిధ కారణాలు లోపలి నుంచి మనల్ని కుంగదీస్తూ ఉంటాయి. కానీ మీకు తెలుసా... మీరు అనుభవించే ఈ ఒత్తిడి మీకు తెలిసినా.. తెలియకపోయినా.. అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది..

నేటి కాలంలో స్ట్రెస్ జీవితంలో ఒక భాగమైపోయింది. ఎంతగా అంటే.. ఈ భూమిపై ఒత్తిడి లేని వారు ఉండటం సాధ్యమే? అనేంతగా ఇదీ మన జీవితాలను ఆక్రమించింది. ఆర్థిక సమస్యలు, ఆఫీసు పని, కుటుంబ బాధ్యతలు వంటి వివిధ కారణాలు లోపలి నుంచి మనల్ని కుంగదీస్తూ ఉంటాయి. కానీ మీకు తెలుసా… మీరు అనుభవించే ఈ ఒత్తిడి మీకు తెలిసినా.. తెలియకపోయినా.. అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది. అవును.. అతిగా ఆలోచించడం వల్ల జుట్టు రాలడం నుంచి గుండె జబ్బుల వరకు అనేక సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఒత్తిడికి నిరంతరం గురికావడం వల్ల మన శరీరంలో ‘కార్టిసాల్’ వంటి ఒత్తిడి హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. ఇవి విషం కంటే ప్రమాదకరమైనవి. గుండె, మెదడు, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగించే ఒత్తిడి వల్ల శరీరానికి ఏమి జరుగుతుందో? దానిని నివారించడానికి ఏమి చేయాలో? ఇక్కడ తెలుసుకుందాం..
హార్మోన్ల అసమతుల్యత
ఒత్తిడి పెరిగినప్పుడు, కార్టిసాల్, అడ్రినలిన్ అనే హార్మోన్లు అధికంగా విడుదలవుతాయి. ఇది రక్తపోటు (BP)ని పెంచుతుంది. గుండెపై ఒత్తిడిని కలిగిస్తుంది.
జీర్ణ సమస్యలు
ఒత్తిడి వల్ల అసిడిటీ, మలబద్ధకం, జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. కొంతమందికి ఆకలి తగ్గుతుంది. మరికొందరు అతిగా తిని బరువు పెరుగుతారు.
రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది
నిరంతర ఒత్తిడి శరీర రోగనిరోధక శక్తిని తగ్గిస్తుంది. ఫలితంగా జలుబు, ఫ్లూ, ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తాయి.
పురుషులు, స్త్రీలకు ఆరోగ్య సమస్యలు
స్త్రీలకు పీరియడ్స్ సమస్యలు ఎదురవుతాయి. పురుషులు హార్మోన్ల అసమతుల్యతను అనుభవించవచ్చు. ఇది వంధ్యత్వానికి కూడా దారితీస్తుంది.
మెదడుపై ప్రభావం
జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత లేకపోవడం, నిర్ణయాలు తీసుకోలేకపోవడం వంటివి సంభవించవచ్చు.
ఒత్తిడిని నివారించడానికి చిట్కాలు?
- ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం లేదా యోగా చేయాలి.
- ప్రతిరోజూ 7-8 గంటలు మంచి నిద్ర పోవాలి.
- సానుకూల మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. అవసరమైతే చికిత్స కూడా తీసుకోవాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




