AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Stress: మొటిమలకు, ఒత్తిడికి మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారంటే

ఒత్తిడికి గురైన సమయంలో జీవన విధానంలో మార్ప వస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేరు, నిద్ర సరిగ్గా ఉండదు, దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. దీని కారణంగా, చర్మంపై మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా భుజాలతో పాటు, నడుముపై కూడా మొటిమలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు...

Stress: మొటిమలకు, ఒత్తిడికి మధ్య సంబంధం ఏంటి.? నిపుణులు ఏమంటున్నారంటే
Stress
Narender Vaitla
|

Updated on: Apr 29, 2024 | 8:45 PM

Share

మారుతోన్న కాలంతో పాటు జీవన విధానంలో మార్పులు వస్తున్నాయి. ఒత్తిడితో కూడున్న జీవన విధానంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. విపరీతైమన ఒత్తిడితో శారీరక సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఒత్తిడితో మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని మనకు తెలిసిందే. అయితే ఒత్తిడి వల్ల ముఖంపై మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఒత్తిడికి గురైన సమయంలో జీవన విధానంలో మార్ప వస్తుంది. ఆహారం సరిగా తీసుకోలేరు, నిద్ర సరిగ్గా ఉండదు, దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. దీని కారణంగా, చర్మంపై మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీవ్రమైన ఒత్తిడి కారణంగా భుజాలతో పాటు, నడుముపై కూడా మొటిమలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు. ఒత్తిడి కారణంగా ముఖం మీద దురద, మచ్చలకు దారి తీస్తుందని అంటున్నారు.

మనిషి ఒత్తిడికి గురైన సమయంలో ఆండ్రోజెన్, కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదలవుతాయి. ఇది ముఖం జిడ్డుగా మారడానికి కారణమవుతుంది. దీంతో మొటిమలు పెరుగుతాయి. ఇక ఒత్తిడి కారణంగా చెమటలు కూడా ఎక్కువగా వస్తాయి. అయితే అప్పటికే స్కిన్‌ ఆయిల్‌గా మారడంతో చెమట బయటకు వెళ్లదు. దీంతో మొటిమలు ఎక్కువవుతాయి. ఈ సమస్య నుంచి బయటపడాలంటే ముందుగా ఒత్తిడిని దూరం చేసుకోవాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలి.

అలాగే ప్రతీరోజూ కచ్చితంగా కాసేపైనా వాకింగ్, వ్యాయామం వంటివి చేయాలి. తీసుకునే ఆహారంలో కూరగాయలు ఉండేలా చూసుకోవాలని చెసుకోవాలి. రోజులో కనీసం రెండు మూడు సార్లు చల్లటి నీటితో మీ ముఖాన్ని కడుక్కోవాలి. అలాగే శరీరానికి సరిపడ నీటిని కచ్చితంగా తీసుకోవాలి. శరీరం హైడ్రేట్‌గా ఉంటే మొటిమలు దరిచేరవు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
కాశ్మీర్‎లా మారిన ఊటీ..టూర్‎కి రైట్ టైం.. మిస్ కావద్దు..
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
స్మార్ట్‌ఫోన్ కొనడం ఇక కష్టమే.. భారీగా పెరగనున్న ధరలు..!
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
ఒక్కో మ్యాచ్‌కు రూ. 2.15 కోట్లు.. పంత్ టీం చేసిన బ్లండర్ మిస్టేక్
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
భారత నావికాదళంలోకి.. MH-60R ‘రోమియో’ హెలికాప్టర్ .. ఇక చైనాకు దడే
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
ఏకంగా ఇంట్లోనే దుకాణం పెట్టేశారుగా.. తెలంగాణలో లింకు
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
క్రేజీ హీరోయిన్ సింధూ తులాని ఇప్పుడు ఎలా ఉందో చూశారా.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
మగువలు కంటికి కాటుక ఎందుకు.? దీని వెనుక రహస్యం ఏంటి.?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
24 క్యారెట్లు vs 22 క్యారెట్లు.. ఈ రెండింటి మధ్య తేడాలేంటి..?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
అనామకుడిపై కోట్ల వర్షం.. ఆర్సీబీ బ్రహ్మాస్త్రం స్పెషలేంటంటే?
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ఊరెల్లే వారికి గుడ్‌న్యూస్..ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు