Star Anise: ఇది కేవ‌లం మ‌సాలా దినుసు అనుకుంటే పొర‌ప‌డిన‌ట్లే.. అద్బుత ప్రయోజనాలు తెలిస్తే…

స్టార్ అనైజ్ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య నుంచి కాపాడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులోని పాలి ఫైనల్స్, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుంది.

Star Anise: ఇది కేవ‌లం మ‌సాలా దినుసు అనుకుంటే పొర‌ప‌డిన‌ట్లే.. అద్బుత ప్రయోజనాలు తెలిస్తే...
Star Anise

Updated on: May 13, 2025 | 9:10 PM

స్టార్ అనైజ్..ఇది చూసేందుకు కూడా నక్షత్రం ఆకారంలోనే ఉంటుంది. అందుకే దీన్ని స్టార్‌ పువ్వు అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఇది చైనా, వియాత్నం దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. కానీ, ఇది మన సుగంధ ద్రవ్యలాలలో అతి ముఖ్యమైనది. స్టార్ అనైజ్ మన దేశంలో కూడా వివిధ వంటకాల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. దీంతో హెర్బల్ టీ కూడా తయారు చేస్తారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు నిండివున్నాయి. ముఖ్యంగా స్టార్‌ అనైజ్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పాలీఫెనల్స్‌ ఉండటం వల్ల పుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం…

స్టార్ అనైజ్ వివిధ వంటల్లో వాడుతుంటారు. ముఖ్యంగా నాన్ వెజ్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఆ వంటకు మంచి రుచి, సువాసనను అందిస్తుంది. స్టార్‌ అనైజ్‌లో ఔషధ గుణాలు పుష్కలం. ఇది కడుపులో అజీర్తి, గ్యాస్ తొలగిస్తుంది. స్టార్‌ అనైజ్‌లో కార్మినేటివ్ లక్షణాలు కడుపులో ఆరోగ్యకరమైన బ్యాక్టిరియా పెరుగుదలకు తోడ్పడుతుంది. స్టార్ పువ్వు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల పుష్కల పోషకాలు ఉంటాయి. శరీరానికి మేలు చేస్తాయి.  స్టార్ అనైజ్‌ లో యాంటీ వైరల్ గుణాలు ఉంటాయి. స్టార్‌ అనైజ్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు జీర్ణ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

ఇది యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కూడా కలిగి ఉంటుంది. హానికర కిరణాల నుంచి మనల్ని కాపాడుతుంది. ఇందులో ఉండే విటమిన్ ఇ ఇన్ఫెక్షన్‌లను దూరం చేస్తుంది.  రక్తంలో చక్కెర స్థాయిలను హఠాత్తుగా పెరగనివ్వకుండా కాపాడుతుంది. షుగర్‌ బాధితుల్లో మెటబాలిజం రేటు పెంచుతుంది. స్టార్ అనైజ్ మన డైట్‌లో చేర్చుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేషన్‌ సమస్య నుంచి కాపాడతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ముఖ్యంగా యాంటీ క్యాన్సర్ గుణాలు కలిగి ఉంటాయి. ఇందులోని పాలి ఫైనల్స్, యాంటీ క్యాన్సర్ లక్షణాలను కలిగి ఉంటుంది. క్యాన్సర్ కణాలు పెరగకుండా నివారిస్తుంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..