
నువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. నువ్వులు తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వు తింటే ముఖ్యంగా రక్త హీనత సమస్య నుంచి బయట పడొచ్చు. అలాగే నువ్వుల నుండి తీసిన ఆయిల్ వాడటం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నువ్వుల నూనెను ఆరోగ్యానికే కాకుండా అందాన్ని పెంచుకోవడంలో కూడా ఉపయోగించుకోవచ్చు. నువ్వుల నూనె జుట్టుకు రాసుకుంటే జుట్ట సమస్యలు తగ్గుతాయి. వంటల్లో ఉపయోగిండం ఆరోగ్యం మెరుగు పడుతుంది. పూర్వం ఎక్కువగా నువ్వుల నూనె ఉపయోగించేవారు. ఆయుర్వేదంలో కూడా పలు రకాల మందులు తయారు చేయడానికి దీన్ని యూజ్ చేసేశారు. నూవ్వుల నూనెతో ఒక్కటేంటి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇందులో విటమిన్లు బి, ఇ, ప్రోటీన్స్, కార్బొహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఫాస్పరస్, మెగ్నీషియం, క్యాల్షియం కూడా లభిస్తాయి. ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి.
నువ్వుల నూనెను పూర్వం ఎక్కువగా ఒంటికి రాసుకునేవారు. నువ్వుల నూనెతో శరీరాన్ని మర్దనా చేసి.. అభ్యంగన స్నానం చేసేవారు. నువ్వుల నూనె రాసుకోవడం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మెరిసేది. మొటిమలు, ముడతలు వంటివి రాకుండా ఉంటాయి. అంతే కాకుండా యూవీ కిరాణాలు, కాలుష్యం, ట్యాక్సిన్స్ నుంచి చర్మ కణాలను రక్షించడంలో ఈ ఆయిల్ చక్కగా పని చేస్తుంది. అయితే వేసవి కాలంలో ఈ నూనెను రాసుకోకూడదు. ఇందులో వేడి చేసే గుణం ఉండటం వల్ల వర్షాకాలం, చలికాలంలో రాసుకోవచ్చు.
జుట్టుకు కూడా నువ్వుల నూనెను రాసుకోవడం వల్ల బలంగా, దృఢంగా తయారవుతుంది. ఈ నూనెతో తలపై మర్దనా చేస్తే.. స్కాల్ఫ్‌పై రక్త ప్రసరణ బాగా జరిగి.. జుట్టు పెరుగుతుంది.
నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు, అర్థరైటిస్, వాపు నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే ఈ నూనెను గాయమైన, కాలిన ప్రదేశంలో రాస్తే.. గాయాలు త్వరగా మానుతాయి.
నిద్ర లేమి సమస్యతో బాధ పడేవారు నువ్వుల నూనెతో నుదిటిపై మర్దనా చేసుకోవడం వల్ల చక్కటి నిద్ర పడుతుంది. కాబట్టి నిద్ర లేని వారికి ఈ టిప్ బాగా సహాయ పడుతుంది.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..