Parijat Flower: సంజీవనిలా పని చేసే పారిజాత చెట్టు.. ఊహించని లాభాలు..

|

Sep 08, 2024 | 12:52 PM

పారిజాత చెట్టు, పువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పువ్వుల నుంచి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. పూజలకు ముఖ్యంగా ఈ పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ చెట్టు, పువ్వులతో కేవలం పూజలే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణుడు సత్య భామ కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. పారిజాత చెట్టు..

Parijat Flower: సంజీవనిలా పని చేసే పారిజాత చెట్టు.. ఊహించని లాభాలు..
Parijat Flower
Follow us on

పారిజాత చెట్టు, పువ్వుల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఈ చెట్టు గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ పువ్వుల నుంచి మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. పూజలకు ముఖ్యంగా ఈ పువ్వులను ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఈ చెట్టు, పువ్వులతో కేవలం పూజలే కాకుండా.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. శ్రీ కృష్ణుడు సత్య భామ కోసం పారిజాత వృక్షాన్ని దివి నుంచి భూమికి తీసుకొచ్చాడని పురాణాలు చెబుతూ ఉంటాయి. పారిజాత చెట్టు పువ్వు, ఆకులు, గింజలు వైద్య పరంగా కూడా ఉపయోగించవచ్చు. ఆయుర్వేదంలో ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించేందుకు ఔషధంగా ఉపయోగిస్తారు. పారిజాత పుష్పం.. ఆకులు.. చెట్టు బెరడుతో ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి ఈ పారిజాత పువ్వులతో ఎలాంటి అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఒత్తిడిని తగ్గిస్తుంది:

పారిజాత పువ్వులతో ఒత్తిడి, ఆందోళనను తగ్గించుకోవచ్చు. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయ పడే అరోమా థెరపీ, ఆయుర్వేదంలో ఈ పువ్వులను సహజ నివారణగా పరిగణిస్తున్నారు. కాబట్టి ఈ పూలతో ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.

చుండ్రు తగ్గుతుంది:

చాలా మంది చుండ్రు సమస్యతో బాధ పడుతూ ఉంటారు. ఇలాంటి వారు పారిజాత పువ్వులతో తగ్గించుకోవచ్చు. పారిజాత చెట్టు గింజలను పేస్టులా చేసి తలకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గి.. జుట్టు సాఫ్ట్‌గా సిల్కీగా తయారవుతుంది.

ఇవి కూడా చదవండి

గొంతు నొప్పి తగ్గుతుంది:

గొంతు సంబంధిత సమస్యలను నయం చేయడంలో కూడా పారిజాత చెట్టు ఆకులు ఎంతో చక్కగా సహాయ పడతాయి. చెట్టు ఆకులను ఉడకబెట్టి కషాయాల రూపంలో తాగడం వల్ల గొంతు నొప్పి మాత్రమే కాకుండా.. ఇతర శారీరక నొప్పులు కూడా తగ్గుతాయి. కీళ్ల వాపులు, ఆర్థరైటిస్ నొప్పులు కూడా తగ్గుతాయి.

రోగ నిరోధక శక్తిని పెంచుతుంది:

ఈ చెట్టు ఆకులు లేదా పువ్వులతో టీ తయారు చేసుకుని తాగడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది బాగా పెరుగుతుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది.

సీజనల్ వ్యాధులకు చెక్:

వాతావరణంలో మార్పుల కారణంగా సీజనల్ వ్యాధులు జ్వరం, దగ్గు, జలుబు వంటివి ఎటాక్ చేస్తూ ఉంటాయి. ఇలాంటి వ్యాధులు రాకుండా.. ఇమ్యూనిటీ బలంగా ఉండాలంటే.. ఈ చెట్టు, ఆకులు పువ్వులతో టీ, కషాయం చేసి తాగితే మంచి ఫలితాలు ఉంటాయి. ఈ కషాయంలో తేనె కలుపుకుని తాగితే శ్వాస కోశ సమస్యలు, ఊపిరి తిత్తుల్లో పేరుకు పోయిన కఫం కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..