Nutmeg: జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!

|

May 24, 2024 | 5:51 PM

మనం ఉపయోగించే పలావ్ దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను సరిగ్గా వాడాలే కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. జాజికాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యల్ని తగ్గించడానికి జాజికాయను ఉపయోగిస్తూ ఉంటారు. జాజి కాయ ఉపయోగించడం వల్ల బిర్యానీకే రుచి వస్తుంది. జాజికాయకు చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి. జాజికాయను అనేక వ్యాధుల చికిత్సలో వాడుతూ ఉంటారు. జాజికాయలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్,,

Nutmeg: జాజికాయను ఇలా తీసుకుంటే.. మీ జీవితమే మారిపోతుంది!
Nutmeg
Follow us on

మనం ఉపయోగించే పలావ్ దినుసుల్లో జాజికాయ కూడా ఒకటి. జాజికాయను సరిగ్గా వాడాలే కానీ అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. జాజికాయలో అనేక పోషకాలు ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా పలు రకాల సమస్యల్ని తగ్గించడానికి జాజికాయను ఉపయోగిస్తూ ఉంటారు. జాజి కాయ ఉపయోగించడం వల్ల బిర్యానీకే రుచి వస్తుంది. జాజికాయకు చాలా రకాల పేర్లు కూడా ఉన్నాయి. జాజికాయను అనేక వ్యాధుల చికిత్సలో వాడుతూ ఉంటారు. జాజికాయలో ఫైబర్, క్యాల్షియం, ఐరన్, మాంగనీస్, పొటాషియం, థియామిన్, విటమిన్ బి6 వంటివి లభిస్తాయి. శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. జాజికాయను తీసుకుంటే ఆరోగ్యానికి ఎలాంటి మేలు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకోండి.

చర్మ సమస్యలు మాయం:

జాజికాయతో చర్మ సమస్యల్ని కూడా దూరం చేసుకోవచ్చు. జాజికాయని పొడిలా తయారు చేసుకుని.. అందులో కొద్దిగా తేనె, నీళ్లు మిక్స్ చేసి.. ముఖానికి స్క్రైబ్ చేయడం వల్ల.. స్కిన్ కాంతి వంతంగా తయారవుతుంది. ఇలా తరచూ చేస్తూ మంచి ఫలితం ఉంటుంది. పాలల్లో కలుపుకుని తాగడం వల్ల చర్మం కాంతి కూడా పెరుగుతుంది.

నోటి దుర్వాసన మాయం:

జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల నోటి దుర్వాసన మాయం అవుతుంది. జాజికాయ పొడితో పళ్లు తోముకోవడం వల్ల పళ్లపై నలుపును, గారను తొలగించి మెరిచేలా చేస్తుంది. అంతే కాకుండా నోటి దుర్వాసన కూడా పోతుంది.

ఇవి కూడా చదవండి

డయాబెటీస్ దూరం:

జాజికాయను తరచూ తీసుకోవడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఎన్‌పీబీఐ నివేదిక ప్రకారం.. జాజికాయను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవల్స్ అనేవి తగ్గుతాయి. అయితే ఇది తీసుకునే ముందు వైద్యుల్ని సంప్రదించాలి.

కొలెస్ట్రాల్ కరుగుతుంది:

జాజికాయను తీసుకోవడం వల్ల అధిక కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్‌లను తగ్గించే సామర్థ్యం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ తగ్గడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. అలాగే వెయిట్ లాస్ కూడా అవుతారు.

కీళ్ల నొప్పులు మాయం:

అర్థరైటిస్, కీళ్ల నొప్పులు ఉన్నవారు జాజికాయ పొడిని తీసుకోవడం వల్ల ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే జాజికాయలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. ఇవి శరీరంలోని వాపులను తొలగిస్తుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..