Curry Leaves Juice: కరివేపాకు జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..

|

Jul 25, 2024 | 7:17 PM

కూరల్లో కరివేపాకు వేయడం కామన్. పోపు వంటలు, చట్నీల్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. కరివేపాకును వేయడం వల్ల ఎంతో మంచి రుచి, వాసన వస్తాయి. కేవలం రుచి, వాసనే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా. కొత్తిమీర, పుదీనా ఉన్నా లేకపోయినా కరివేపాకులను మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తాం. కరివేపాకులో ఎన్ని పోషకాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరివేపాకుతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని..

Curry Leaves Juice: కరివేపాకు జ్యూస్ తాగితే వచ్చే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు..
Curry Leaves Juice
Follow us on

కూరల్లో కరివేపాకు వేయడం కామన్. పోపు వంటలు, చట్నీల్లో అయితే ఖచ్చితంగా ఉండాల్సిందే. కరివేపాకును వేయడం వల్ల ఎంతో మంచి రుచి, వాసన వస్తాయి. కేవలం రుచి, వాసనే కాకుండా ఎంతో ఆరోగ్యం కూడా. కొత్తిమీర, పుదీనా ఉన్నా లేకపోయినా కరివేపాకులను మాత్రం ఖచ్చితంగా ఉపయోగిస్తాం. కరివేపాకులో ఎన్ని పోషకాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కరివేపాకుతో ఆరోగ్యమే కాకుండా అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ్యంగా జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో ఎంతో చక్కగా ఉపయోగ పడుతుంది కరివేపాకు. శరీరంలో రక్తాన్ని పెంచడంలో కూడా పెంచుతుంది. తినడం ఇష్టం లేని వాళ్లు జ్యూస్ చేసుకుని కూడా తాగవచ్చు. ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగితే చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మరి ఈ జ్యూస్ తాగడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

డయాబెటీస్ కంట్రోల్:

కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల డయాబెటీస్ కంట్రోల్ అవుతుంది. ఇందులో హైపోగ్లైసెమిక్ లక్షణాలు ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవల్స్‌ను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి షుగర్ కంట్రోల్ అవ్వాలి అనుకునేవారు ఉదయం ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగడం చాలా మంచిది.

హిమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి:

ఇప్పుడున్న సమయంలో చాలా మంది రక్త హీనత సమస్యతో బాధ పడుతున్నారు. ఇలాంటి వాళ్లు కరివేపాకు రసం తాగితే.. హిమోగ్లోబిన్ లెవల్స్ అనేవి పెరుగుతాయి. ముఖ్యంగా ఆడవాళ్లు తాగడం మరింత మంచిది. శరీరంలో రక్తం లోపాన్ని తగ్గిస్తుంది. అలసట, బలహీనత కూడా తగ్గుతుంది.

ఇవి కూడా చదవండి

కంటి శుక్లం నివారణ:

కరివేపాకులో విటమిన్ ఏ అనేది ఉంటుంది. ఇది కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. కంటి చూపును కూడా మెరుగు పరుస్తుంది. ప్రతి రోజూ కరివేపాకు జ్యూస్‌ తాగడం వల్ల కంటి శుక్లం వచ్చే ప్రమాదం కూడా తగ్గుతుంది.

బరువు అదుపులో ఉంటుంది:

కరివేపాకు జ్యూస్ తాగడం వల్ల బరువు కూడా అదుపులో ఉంటుంది. రెగ్యు‌లర్‌గా మీరు కరివేపాకు జ్యూస్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎందుకంటే ఇందులో మంచి ఫైబర్ ఉంటుంది. బాడీ డీటాక్స్ కూడా అవుతుంది. బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..