ప్రపంచంలో అనేక రకాల పాములున్నాయి. విష సర్పాలు, విషం లేని పాములు ఇలా రకరకాల పాములున్నాయి. పాము కంటికి కనిపిస్తే చాలు అది ఏ రకమైన పాము అయినా సరే భయంతో పరుగులు పెడతారు. అంతేకాదు వీలయితే ఆ ప్రాంతానికి ఎప్పుడూ వెళ్లరు. పాములు బొరియల్లో, దట్టమైన అడవులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో, గుబురుగా పెరిగిన చెట్లలో నివసిస్తాయి. అంతేకాదు పొలాలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో ఉన్న నివసించే ఇంటిలో కూడా పాములు కనిపిస్తాయి. పాములకు ఆహారం ఎలుకలు, కప్పలు వంటి జీవులు. తమకు హాని చేస్తారు అని భావిస్తే మనుషులను కాటు వేసి తమని తాము కాపాడుకుంటాయి. వాస్తవానికి పాములు దరి చేరకుండా చేసే చెట్లు కొన్ని ఉన్నట్లే.. ఇంట్లో ఉండే కొన్ని చెట్లు పాములను ఆకర్షిస్తాయి. కనుక పాములు తిరిగే ప్రాంతాల్లో ఇళ్లల్లో కొన్ని రకాల చెట్లను పెంచవద్దు. అవి ఏ చెట్లో ఈ రోజు తెలుసుకుందాం..
మల్లి మొక్కలు: వేసవి వస్తే చాలు పరిమళాలను పంచె మల్లె చెట్టును పాములు ఆకర్షిస్తాయట. మల్లె పువ్వులు మంచి సువాసన కొద్ధి దూరం వరకూ వ్యాపిస్తుంది. బొండు మల్లె, సన్న మల్లె, వంటి తీగలు మొక్కలు పందిరిలా అల్లుకుంటాయి. వీటి వాసన పాములను ఆకర్షించడంతో చుట్టు పక్కల చేరుకుంటాయట.
చమేలీ: పరిమళాలు పంచె చమేలీ మొక్కలు కూడా పాములను ఆకర్షిస్తాయట. కనుక గుబురుగా పెరిగే ఈ మొక్కలను పాములు ఆవాసాలుగా మార్చుకుంటాయట.
మొగలి పొదలు: పాములకు మొగలి పువ్వు సువాసన అంటే చాలా ఇష్టం. మొగలి పొదలు పాముల నివాసంగా మార్చుకుంటాయని.. దీనికి కారణం మొగలి పువ్వు నుంచి వచ్చే సువాసన అని అంటారు.
పారిజాతం చెట్లు: అతి తక్కువ ప్రాంతాల్లో కనిపించే దేవతా చెట్టు పారిజాతం. ఈ పువ్వు కూడా మంచి సువాసనని ఇస్తుంది. ఈ చెట్టు కూడా పాములను ఆకర్షిస్తుందట.
గుబురు మొక్కలు: కొన్ని రకాల మొక్కలు గుబురుగా పొదల్లా పెరుగుతాయి. వెలుగు నేలకు సోకకుండా దట్టంగా పెరిగే ఈ మొక్కలు పాములకు ఆవాసాలుగా మార్చుకుంటాయి. ఇవి పాములకు వెచ్చగా ఉంటాయి. కనుక గుబురు మొక్కలను ఇంట్లో పెంచుకునే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..