Baby Born with Tail: బ్రహ్మంగారు చెప్పి వింతలు సాక్షాత్కారం.. చైనాలో 4 అంగుళాల తోకతో పుట్టిన శిశువు..
కొన్ని సార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్‌జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు.
ప్రపంచంలో రకరకాల వింతలు విశేషాలు జరుగుతూనే ఉన్నాయి. ఇలాంటి కొన్ని సంఘటనలు మళ్లీ జరగవచ్చా అని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. కొన్ని సార్లు జరిగే వింత సంఘటనలు చూస్తే బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నిజ రూపంలో కనుల ముందుకు వస్తున్నాయి అని వ్యాఖ్యానిస్తున్నారు. మన పొరుగు దేశం చైనాలో నాలుగు అంగుళాల తోకతో ఓ పాప పుట్టిందనే వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ ఘటన వైద్య ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
నివేదికల ప్రకారం చైనాలోని హాంగ్‌జౌ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో జన్మించిన శిశువు వెనుక భాగంలో తోక ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇది అసాధారణ పరిణామమని, వెన్నెముకకు సంబంధించిన రుగ్మతల వల్లే ఇలాంటి సమస్య వచ్చినట్లు వైద్యులు తెలిపారు. హాస్పిటల్‌లోని పీడియాట్రిక్ న్యూరోసర్జరీ విభాగంలో డాక్టర్ లీ, నవజాత శిశువు వెనుక భాగంలో తోకను కనుగొని.. దాని గురించి వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
వైరల్ వీడియోను ఇక్కడ చూడండి:
శిశువు శరీరంలో తోక ఎందుకు పెరిగిందంటే
శిశువు వెన్నుపాము సరిగా అభివృద్ధి చెందనప్పుడు పుట్టుకతో రకరకాల లోపాలు వస్తాయని డాక్టర్ డా. లీ అన్నారు. వెన్నుపాము దాని చుట్టూ ఉన్న కణజాలాలాలు అసాధారణంగా జతపడి తోక అభివృద్ధికి దారితీసే పరిస్థితి ఏర్పడి ఉంటుందని తెలిపారు. అయితే సాధారణంగా ఇలాంటి పరిస్థితి ఎవరి లోనూ కనిపించదని చెప్పారు. అయితే ఇలాంటి సమస్యలు వస్తే నరాల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు తెలిపారు.
గతంలో కూడా తోకతో జన్మించిన శిశువుల ఉదంతాలు
తోకతో పుట్టిన బిడ్డ ఉదంతం వెలుగులోకి రావడం ఇదే తొలిసారి కాదు. నివేదికల ప్రకారం, 2017 వరకు 195 కేసులు నమోదయ్యాయి. 2021లో బ్రెజిల్‌లో, 2022లో మెక్సికోలో తోకతో పుట్టిన ఆడ శిశువు కేసు కూడా నివేదించబడ్డాయి. ఇప్పుడు చైనాలో కూడా అలాంటి ఆశ్చర్యకరమైన కేసు నమోదైంది. ఇది వైద్య ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
మరిన్ని వైరల్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..