ఈ రోజుల్లో చాలా మంది నడుము నొప్పి, వెన్నునొప్పితో బాధపడుతున్నట్లు ఎక్కువ మంది చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం స్లిప్ డిస్క్ కావచ్చు. ఇది వెన్నెముకకు సంబంధించిన సమస్య, దీనిలో మన ఎముకల మధ్య ఉండే మృదువైన కుషన్ లాంటి డిస్క్ జారిపోతుంది. ఇది నరాల మీద ఒత్తిడిని కలిగిస్తుంది. తీవ్రమైన నొప్పిని కలిగిస్తుంది. సకాలంలో చికిత్స తీసుకోవాలి.. స్లిప్ డిస్క్ సమస్య నివారణకు జాగ్రత్త తీసుకోకపోతే, అది నడకలో కూడా సమస్యలను కలిగిస్తుంది.
ఈ సమస్యకు అతి పెద్ద కారణం కూర్చోవడం, వంగడం లేదా బరువైన వస్తువులను తప్పు పద్ధతిలో ఎత్తడం. అయితే కొన్నిసార్లు ఈ సమస్య వయస్సు పెరగడం, ఊబకాయం, తగినంత వ్యాయామం లేకపోవడం లేదా ఏదైనా గాయం కారణంగా సంభవించవచ్చు. గంటల తరబడి ఒకే స్థితిలో కూర్చుని పనిచేసే వారికి కూడా ఈ ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.
ఎవరికైనా స్లిప్ డిస్క్ సమస్య వస్తే వారికి నడుము లేదా మెడలో తీవ్రమైన నొప్పి, కాళ్ళు లేదా చేతుల్లో జలదరింపు, బలహీనత , వంగడంలో లేదా కూర్చోవడంలో సమస్యలు మొదలవుతాయి. కొంతమందికి నడవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)