Heart Attack: గుండెపోటు వచ్చే ముందు చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తాయంట.. అస్సలు లైట్ తీసుకోవద్దు..
గుండెపోటు రాకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ మార్పులపై నిశితంగా దృష్టి పెట్టడం ద్వారా, మీరు సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి ప్రాణాంతక పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు.. అయితే.. ఆ లక్షణాలు ఏంటి..? నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

ఇటీవల పెద్దవారితోపాటు యువతలోనూ గుండెపోటు సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదం పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఈ సమస్య ఎప్పుడు వస్తుందో ఎవరూ ముందుగానే అంచనా వేయలేరు. కానీ గుండెపోటు రాకముందే మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ మార్పులపై నిశితంగా దృష్టి పెట్టడం ద్వారా, మీరు సరైన సమయంలో వైద్యుడిని సంప్రదించి ప్రాణాంతక పరిస్థితుల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చంటున్నారు వైద్య నిపుణులు..
గుండెపోటును వైద్యపరంగా మయోకార్డియల్ ఇన్ఫార్క్షన్ అంటారు. ఈ సమస్య వస్తే, అది గుండెకు రక్త సరఫరా అకస్మాత్తుగా ఆగిపోయే తీవ్రమైన అత్యవసర పరిస్థితి. అంతే కాదు, పరిశోధన ప్రకారం, ప్రతి 40 సెకన్లకు ఒక వ్యక్తి గుండెపోటుకు గురవుతున్నారని అంచనా.. ఇప్పుడు ఈ సమస్య చిన్నవారిలో అంటే.. యువతలో కూడా పెరుగుతుండటం.. ఆందోళన కలిగిస్తోంది.. తక్కువ వయసులో చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు కోల్పోతుండటంతో చాలా కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోతున్నాయి..
వాస్తవానికి.. గుండెపోట్లు చాలావరకు నిశ్శబ్దంగా జరుగుతాయి. అందుకే.. దీనిని సైలెంట్ కిల్లర్ అంటారు.. కానీ కొన్ని సందర్భాల్లో, అవి చర్మంపై మార్పుల ద్వారా మనకు హెచ్చరిక సంకేతాలను ఇస్తాయి. సరిగ్గా గమనించినట్లయితే, గుండె సంబంధిత ప్రమాదాలను ముందుగానే గుర్తించవచ్చు.
అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ నివేదిక ప్రకారం, గుండె జబ్బుల సంకేతాలు చర్మంపై వివిధ రకాలుగా కనిపిస్తాయి. రక్తంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల చిన్న బొబ్బలు లాగా కనిపించే దద్దుర్లు వస్తాయి. గోళ్ల కింద ఎర్రటి మచ్చలు కనిపిస్తే, అది గుండె ఇన్ఫెక్షన్‌కు సంకేతం కావచ్చు. కళ్ళ దగ్గర బూడిద రంగు మచ్చలు ఉంటే గుండె సమస్య ఉండవచ్చని పేర్కొంటున్నారు.
ఆ నివేదిక ప్రకారం, 2003లో గుండెపోటు నుండి బయటపడిన 515 మంది మహిళలపై జరిపిన అధ్యయనంలో, చాలా మందికి ఒక నెల ముందుగానే హెచ్చరిక సంకేతాలు కనిపించాయి. ఆ మహిళల్లో, 71% మందికి తీవ్రమైన అలసట, 47.8% మందికి నిద్రలేమి, 42.1% మందికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నాయి.
గుండెపోటు సమయంలో.. తీవ్రమైన ఛాతీ నొప్పి, అధిక చెమట, శ్వాస ఆడకపోవడం సాధారణంగా కనిపిస్తాయి.. అంతేకాకుండా, నొప్పి ఛాతీ నుండి చేయి, భుజం, దవడ వరకు వ్యాపిస్తుంది. మహిళల్లో, ఈ లక్షణాలు కడుపులో అసౌకర్యం, వెన్నునొప్పితో కూడా కలిసి ఉంటాయి. అందువల్ల, గుండెపోటు నిశ్శబ్దంగా వచ్చినప్పటికీ, శరీరం చూపించే చిన్న సంకేతాలకు శ్రద్ధ చూపడం వల్ల ప్రాణాలను కాపాడవచ్చని నిపుణులు అంటున్నారు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




