AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jackfruit: కమ్మని పనస తొనలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!

చూడగానే తినాలనిపించే పనస పండు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు. పనస పండులో విటమిన్లు ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా

Jackfruit: కమ్మని పనస తొనలు ఆరోగ్యానికి మంచివే.. కానీ వీరికి మాత్రం విషంతో సమానం!
Jackfruit
Srilakshmi C
|

Updated on: Mar 18, 2025 | 1:45 PM

Share

బంగారు రంగులో నోరూరించే కమ్మని రుచులు పనస తొనల సొంతం. వేసవిలో ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. చూడగానే తినాలనిపించే పనస పండు రుచికరంగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ దీన్ని తినడానికి ఇష్టపడతారు. పనస పండులో విటమిన్లు ఎ, సి, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి పోషకాలను అందించడమే కాకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కానీ అందరూ పనస తొనలు తినకూడదు. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీన్ని అస్సలు తినకూడదని నిపుణులు అంటున్నారు. ఎవరు వీటికి దూరంగా ఉండాలో ఇక్కడ తెలుసుకుందాం..

కిడ్నీ సమస్యలు

పనస పండులో పొటాషియం అధికంగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు ఉన్నవారికి ఇది మంచిది కాదు. పొటాషియం అధికంగా ఉండటం వల్ల, మూత్రపిండాల పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు దీనిని తినకపోవడమే మంచిది.

అలెర్జీ సమస్య

కొంతమందికి పనస తిన్న వెంటనే చర్మంపై దద్దుర్లు, దురద, శ్వాస తీసుకోవడంలో సమస్యలు తలెత్తుతాయి. అలాంటి వ్యక్తులు దీనిని తినకూడదు.

ఇవి కూడా చదవండి

మధుమేహం ఉన్నవారికి అంత మంచిది కాదు

డయాబెటిస్ ఉన్నవారు జాక్‌ఫ్రూట్‌ను ఎక్కువగా తినకూడదు. ఇందులో సహజ చక్కెర అధికంగా ఉంటుంది. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెరిగే ప్రమాదం ఉంది. కాబట్టి మధుమేహం ఉన్నవారు ఈ పండును తినకూడదు.

శస్త్రచికిత్స చేయించుకున్న వారికి మంచిది కాదు

కొన్ని రకాల శస్త్రచికిత్సలు చేయించుకున్న వ్యక్తులు పనస తొనలు తినకూడదు. దీనివల్ల జీర్ణ సమస్యలు పెరుగుతాయని నిపుణులు అంటున్నారు. ఇది ముఖ్యంగా కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి, వైద్యుల సలహా మేరకు దీన్ని తీసుకోవడం మంచిది.

గర్భిణీ, పాలిచ్చే తల్లులకు మంచిది కాదు

సాధారణంగా గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు పనస ఎక్కువగా తినకూడదు. దీనివల్ల కొంతమందిలో జీర్ణ సమస్యలు రావచ్చు. హార్మోన్ల అసమతుల్యతకు కారణం కావచ్చు. అందువల్ల దీనిని తీసుకునే ముందు వైద్య సలహా తీసుకోవడం మంచిది.

పనస పండు రుచికరంగా ఉండటమే కాకుండా శరీరానికి అవసరమైన పోషకాలను కూడా అందిస్తుంది. కానీ ఈ విధమైనా ఆరోగ్య సమస్యలున్నవారికి ఇది హానికరం. పైన పేర్కొన్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనస తినేముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

గమనిక: ఈ కంటెంట్ సాధారణ సమాచారం కోసం మాత్రమే అందిస్తుంది. మరింత సమాచారం కోసం నిపుణుడిని లేదా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పదోన్నతులు..
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
శ్రీరామనవమి రోజున ఈ ఒక్క పని చేయండి.. పెళ్లి యోగం ఖాయం!
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
ఏపీ హైకోర్టు భారీ జాబ్ నోటిఫికేషన్.. పూర్తి వివరాలు తెలుసుకోండి
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
మంగళవారం సిరిసంపద సీక్రెట్స్: ఏం చేయాలి, ఏం చేయకూడదు
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
కుప్పకూలిన భారీ సైనిక విమానం.. 100 మందికిపైగా మృతి
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
హైదరాబాద్ నగరాన్ని కమ్మేస్తున్న హుక్కా స్మెల్.. యాక్షన్‌లో పోలీసు
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
తెలంగాణలో పెరుగుతున్న టైప్-2 మధుమేహం.. దానికి ఫాస్ట్ ఫుడ్ కారణమా?
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
సినిమా-పాలిటిక్స్..తమిళనాట పార్టీ పెట్టని నటుడే లేడు! అలా అయితేనే
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆ విషయంలో కాంగ్రెస్‌ను విమర్శించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..?
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..
ఆలయం హుండీ లెక్కింపు జరుగుతుండగా కనిపించిన చిత్తు కాగితాలు..