Ghee Vs Chapati: చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానుకోవడం బెటర్‌..

వెన్న, నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాదు జీర్ణ సమస్యలను కూడా తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మంచిది. ఇందులో విటమిన్లు ఎ, డి, ఇ, కె వంటి పోషకాలు ఉంటాయి. అయితే చపాతీలో కలిపి నెయ్యి తీసుకోవడం..

Ghee Vs Chapati: చపాతీని నెయ్యితో కలిపి తినే అలవాటు మీకూ ఉందా? వెంటనే మానుకోవడం బెటర్‌..
Ghee On Chapatis

Updated on: Jul 10, 2025 | 12:21 PM

కొంతమంది ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో వెన్న, నెయ్యి ఆహారంలో తీసుకుంటూ ఉంటారు. వీటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. అంతేకాదు జీర్ణ సమస్యలను కూడా తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. నెయ్యిని క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మంచిది. ఇందులో విటమిన్లు ఎ, డి, ఇ, కె వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వెన్న, నెయ్యి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నూనెకు బదులుగా నెయ్యిని వంటకాల్లో ఉపయోగించడం చాలా మంచిదట. అందుకే వంటలలో నెయ్యిని కలుపుతానే చాలా మంది. నెయ్యిని ఇష్టపడేవారు ఇడ్లీ, దోస వంటి స్నాక్స్‌ కూడా దీనిని ఉపయోగిస్తారు. మరికొందరు చపాతీ చేసేటప్పుడు కూడా నెయ్యిని వినియోగిస్తుంటారు. దానిపై నెయ్యిని పూస్తారు. ఇది చపాతీ రుచిని పెంచుతుంది. అయితే ఈ రకమైన అలవాటు అంత మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎందుకో ఇక్కడ తెలుసుకుందాం..

నెయ్యి ఆరోగ్య ప్రయోజనాలు

నెయ్యి సేవించడం మనకు లభించిన గొప్ప వరం. దీనిని వంటలో మాత్రమే కాకుండా అందాన్ని పెంచడానికి కూడా ఉపయోగిస్తారు. అనేక ప్రయోజనాలను కలిగిన నెయ్యిని వివిధ ఆరోగ్య సమస్యలకు ఔషధంగా కూడా ఉపయోగిస్తుంటాం. దీనిని సేవించడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఎముకలను బలపరుస్తుంది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. నెయ్యిని బరువును నిర్వహించడానికి, దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించడానికి, ఇంకా కీళ్ల సమస్యలను తగ్గించడానికి కూడా ఉపయోగిస్తారు. అంతే కాదు ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి, నొప్పి నివారిణిగా కూడా పనిచేస్తుంది.

చపాతీపై వెన్న ఎందుకు రాయకూడదంటే..?

కొంతమంది ఆహారంలో అన్నంతో పాటు చపాతీ కూడా తినడం అలవాటు. సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు రోటీ, చపాతీలను ఎక్కువగా తింటారు. అయితే, కొంతమంది చపాతీల రుచిని పెంచడానికి వాటిపై కొద్దిగా వెన్న లేదా నెయ్యిని వినియోగిస్తారు. పతంజలి యోగపీఠ్ చీఫ్ ఆచార్య బాలకృష్ణ ఈ అలవాటు అంత మంచిది కాదని అంటున్నారు. చపాతీ ఆరోగ్యానికి మంచిదే. కానీ చపాతీని నెయ్యి, వెన్నతో కలిపి తినడం మంచిది కాదని ఆయన అన్నారు. రోటీపై వెన్న పూయడం వల్ల ఒక పొర ఏర్పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ కష్టమవుతుంది. ఈ పొర ఆహారం సరిగ్గా జీర్ణం కావడానికి అనుమతించదు. ఫలితంగా ఇది గ్యాస్, అజీర్ణం, కడుపులో భారమైన అనుభూతిని కలిగిస్తుంది. ఈ విధంగా తిన్న రోటీలు త్వరగా జీర్ణం కావు అని ఆయన అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఎలా తినాలి?

రోటీని వెన్నతో తినడానికి బదులు పప్పుతో తీసుకోవచ్చు. దీనివల్ల ఎటువంటి సమస్యలు ఉండవు. జీర్ణ సమస్యలు తలెత్తవు. అంతేకాకుండా రుచి కూడా అలాగే ఉంటుంది. కానీ ఎక్కువగా తినకపోవడమే మంచిది. రోటీలు మృదువుగా ఉండటానికి పిండితో కాస్త నెయ్యిని కలిపి తినవచ్చు. కానీ రోటీ, చపాతీలపై నెయ్యిని పూయడం మాత్రం చేయవద్దని ఆయన హెచ్చరిస్తున్నారు.

మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్‌ చేయండి.