మీ ముఖం ఎంత అందంగా ఉన్నా, మంగుమచ్చలు, పిగ్మెంటేషన్ మీ ముఖం అందాన్ని పాడు చేస్తుంది. సడెన్‌గా ముఖంపై వచ్చే మంగుమచ్చల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కొందరు మానసికంగా కూడా కుంగిపోతుంటారు. శరీరంలో మెలనిన్ కంటెంట్ ఎక్కువగా, ఐరన్ కంటెంట్ తక్కువగా ఉన్నప్పుడు పిగ్మెంటేషన్ ఏర్పడుతుంది. కొందరికి వంశపారంపర్యంగా ఈ సమస్య ఉంటే, మరికొందరికి సూర్యకిరణాల వల్ల పిగ్మెంటేషన్ సమస్య రావచ్చు. సాధారణంగా కొందరికి బుగ్గలపై, కొందరికి ముక్కుపై, మరికొందరికి ముఖం అంతా పిగ్మెంటేషన్ ఉంటుంది. దీని కోసం ఇక్కడ బెస్ట్, సింపుల్ హోం రెమెడీస్ ఉన్నాయి. మీరు ఇంట్లో ఉండే కొన్ని సాధారణ పదార్థాలను ఉపయోగించడం ద్వారా మీరు మంగు మచ్చల సమస్యలను సులభంగా పరిష్కరించవచ్చు. పిగ్మెంటేషన్ సమస్యలకు కారణాలు ఏమిటి..? దీనికి పరిష్కారాలు ఏమిటో తెలుసుకుందాం…
మంగు మచ్చలకు పచ్చిపాలు:
సాధారణంగా ప్రతి ఒక్కరి ఇళ్లలో పాలు వాడుతుంటారు. పాలలో లాక్టిక్ యాసిడ్ ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌ను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. ఒక చిన్న గిన్నెలో పాలు పోసి కాటన్ బాల్‌ను నానబెట్టండి. పాలలో నానబెట్టిన దూదిని రోజుకు రెండుసార్లు ముఖంపై నల్లటి మచ్చల మీద రాయండి. ఇలా రోజూ చేయడం వల్ల మీ ముఖం మృదువుగా, మచ్చలు లేకుండా మెరుస్తూ కనబడుతుంది.
మంగుమచ్చలకు కలబంద:
ముఖ సౌందర్యాన్ని పెంచే సహజ ఔషధంగా కలబందను చెప్పుకోవచ్చు. మొటిమల సమస్య ఉన్నవారు ఈ కలబందను ముఖానికి పట్టిస్తే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఒక అధ్యయనం ప్రకారం, కలబంద హైపర్పిగ్మెంటేషన్‌కు సమర్థవంతమైన చికిత్సగా కనుగొనబడింది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు మంగుమచ్చలు ఉన్న చోట స్వచ్ఛమైన అలోవెరా జెల్‌ను అప్లై చేయండి. ఉదయాన్నే గోరువెచ్చని నీటితో కడగాలి. ఇలా రోజూ చేయడం వల్ల త్వరలో మంచి ఫలితాలు వస్తాయి.
మంగుమచ్చలకు బొప్పాయి:
బొప్పాయి పండులో పాపైన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది పిగ్మెంటేషన్‌కు మంచి ఇంటి నివారణగా పని చేస్తుంది. తురిమిన బొప్పాయి రసాన్ని రోజూ ముఖానికి పట్టించి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. తర్వాత గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కోవాలి. ఇలా రోజూ చేస్తే మచ్చలు లేని ముఖం మీ సొంతం అవుతుంది.
మంగు మచ్చలకు బంగాళదుంపలు:
బంగాళదుంపలలో కాటెకోలేస్ ఉంటుంది. ఇది ముఖాన్ని శుభ్రపరుస్తుంది. బంగాళాదుంప రసాన్ని ఉపయోగించడం వల్ల మొటిమలు, నల్ల మచ్చలు వంటి అనేక చర్మ సమస్యలను నయం చేయవచ్చు. బంగాళదుంప రసాన్ని తీసి ముఖానికి రాసుకోవాలి. తర్వాత 15 నిమిషాలు అలాగే ఉంచి ముఖం కడుక్కోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే నల్ల మచ్చలు పోయి ముఖ సౌందర్యం పెరుగుతుంది.
రాత్రి పడుకునే ముందు అలోవెరా జెల్, విటమిన్ ఇ క్యాప్సూల్‌తో మిక్స్ చేసి ముఖానికి స్మూత్‌గా మర్థన చేయటం వల్ల కూడా స్పష్టమైన చర్మాన్ని పొందవచ్చు.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి