AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rose Water Side Effects: రోజ్ వాటర్ తో జాగ్రత్త..! ఈ తప్పులు అస్సలు చేయకండి..!

రోజ్ వాటర్ రోజా పువ్వుల నుండి తయారయ్యే సువాసనభరితమైన ద్రవం. దీన్ని చాలా మంది తమ చర్మ సంరక్షణలో భాగంగా వాడుతుంటారు. ముఖ్యంగా ముఖాన్ని శుభ్రంగా ఉంచడానికి తాజాగా కనిపించేందుకు ఇది బాగా ఉపయోగపడుతుందని భావిస్తారు. అయితే ఇది అందరికీ అనుకూలం కాదనే విషయం చాలా మందికి తెలియదు. కొన్ని సందర్భాల్లో దీని వాడకం వల్ల చర్మ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది.

Rose Water Side Effects: రోజ్ వాటర్ తో జాగ్రత్త..! ఈ తప్పులు అస్సలు చేయకండి..!
Rose Water
Prashanthi V
|

Updated on: May 30, 2025 | 6:37 PM

Share

రోజ్ వాటర్ సాధారణంగా సురక్షితమైనదే అయినప్పటికీ.. సున్నితమైన చర్మం కలవారు దీన్ని వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమందికి ఇందులోని సహజ పదార్థాలు చర్మంపై చెడు ప్రభావాన్ని చూపవచ్చు. ముఖ్యంగా అలర్జీలకు అలవాటు ఉన్నవారిలో ఎరుపుదనం, చర్మం ఎర్రబడడం, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇది చాలా సార్లు చర్మానికి ఒక రకమైన చికాకును కలిగించవచ్చు.

రోజ్ వాటర్ తయారీలో ఉపయోగించే రోజా పువ్వు లేదా ఇతర సహజ సమ్మేళనాలు కొన్ని వ్యక్తుల చర్మంపై ప్రతికూలంగా పనిచేయవచ్చు. ఈ పదార్థాలు కొన్ని రకాల చర్మాలకు సరిపోకపోవచ్చు. ఫలితంగా చర్మంపై దద్దుర్లు, ర్యాషెస్ లేదా అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ఎప్పుడైతే ఈ లక్షణాలు కనిపిస్తాయో వెంటనే రోజ్ వాటర్ వాడకాన్ని ఆపేయడం ఉత్తమం.

చర్మంపై మొటిమలు, పింపుల్స్ లాంటి సమస్యలు ఉన్నవారు రోజ్ వాటర్ వాడే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో రోజ్ వాటర్‌ లో ఉండే తేమ చర్మ రంధ్రాలను మూసివేయడం వల్ల మొటిమలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది చర్మంలోని నూనె గ్రంథులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే మొటిమలు ఉన్నవారు చర్మ వైద్యుడి సలహా తీసుకుని మాత్రమే దీనిని వాడాలి.

పరిశుభ్రంగా నిల్వ చేయని రోజ్ వాటర్ వాడటం వల్ల ఫంగల్ లేదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బాటిల్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ చేస్తే దానిలో సూక్ష్మజీవులు పెరగవచ్చు. అలాంటి రోజ్ వాటర్‌ ను ముఖానికి వాడటం వల్ల చర్మంపై ఇన్ఫెక్షన్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. అందుకే తాజాగా ఉన్న రోజ్ వాటర్‌ ను మాత్రమే వాడటం అవసరం.

రోజ్ వాటర్ వాడే ముందు ముఖానికి నేరుగా అప్లై చేయకుండా చేతి వెనుక భాగంలో లేదా చెవి వెనుక భాగంలో చిన్నగా రాసి ప్యాచ్ టెస్ట్ చేయడం చాలా ముఖ్యం. దీని వల్ల దాని ప్రభావం మీ చర్మానికి ఎలా ఉంటుందో ముందుగానే తెలుసుకోవచ్చు. కళ్ళ దగ్గర వాడే ముందు అయితే మరింత జాగ్రత్త అవసరం. ఎందుకంటే ఆ భాగం చాలా సున్నితమైనది.

రోజ్ వాటర్ చర్మానికి చల్లదనం ఇచ్చే సహజ టోనర్ అయినప్పటికీ.. ప్రతి ఒక్కరికీ ఇది అనుకూలం అనే నిబంధన లేదు. మీ చర్మం ఎలాంటి రకం అనేది తెలుసుకుని అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూ వాడితేనే దీని ప్రయోజనాలను పొందవచ్చు. అజాగ్రత్తగా వాడితే చిన్న సమస్య పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది.