Rose Water: మంచిదని రోజ్ వాటర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. స్కిన్‌కి ఈ సమస్యలు తప్పవు..

చర్మం అందంగా, మృదువుగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే రకరకాల క్రీమ్స్ ను సహజ పదార్ధాలను ఉపయోగిస్తారు. చర్మం శుభ్రంగా ఉంచడానికి రోజ్ వాటర్ కూడా సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది చర్మ సమస్యలను దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రోజ్ వాటర్ ను నేరుగా స్కిన్ అప్లై చేస్తే కొన్ని ఇబ్బంది తప్పవు అవి ఏమిటంటే..

Rose Water: మంచిదని రోజ్ వాటర్‌ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. స్కిన్‌కి ఈ సమస్యలు తప్పవు..
Rose Water
Image Credit source: pexel

Updated on: Mar 18, 2025 | 8:45 AM

రోజ్ వాటర్ ఒక సహజ టోనర్. ఇది చర్మానికి చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. దీనిలో చర్మానికి తాజాదనం, తేమను అందించే సహజ అంశాలు పుష్కలంగా ఉన్నాయి. రోజ్ వాటర్ చర్మాన్ని రిఫ్రెష్ చేయడానికి.. శోథ నిరోధక లక్షణాల కారణంగా చర్మం మీద మంటను తగ్గించడానికి మొటిమలకు చికిత్స చేయడానికి కూడా ఉపయోగించబడుతుంది. అయితే మీరు రోజ్ వాటర్‌ను ఎక్కువ మొత్తంలో ఉపయోగించినా చర్మానికి హానిని కలిగిస్తుంది. రోజ్ వాటర్ ని ఎక్కువగా ఉపయోగిస్తే చర్మానికి ఎలాంటి దుష్ప్రభావాలు కలుగుతాయో తెలుసుకుందాం..

పొడి బారే చర్మం

రోజ్ వాటర్ తేలికపాటి ఆస్ట్రిజెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మంలోని సహజ నూనెను తగ్గిస్తుంది. రోజ్ వాటర్ చర్మం నుంచి అదనపు మురికిని, నూనెను తొలగించడంలో సహాయపడతాయి. అయితే రోజ్ వాటర్‌ను ఎక్కువగా ఉపయోగిస్తే.. అది చర్మాన్ని చాలా పొడిగా చేస్తుంది. పొడి చర్మం వల్ల దురద, చికాకు వంటి ఇబ్బందులు కలగవచ్చు.

అలెర్జీ సమస్య

రోజ్ వాటర్ సహజం టోనర్. అయితే దీనిని ఎక్కువగా ఉపయోగిస్తే స్కిన్ అలెర్జీలకు కారణమవుతుంది. అలెర్జీ లక్షణాలలో చర్మంపై ఎరుపు, దద్దుర్లు, దురద, మంటలు ఉండవచ్చు. కనుక ఎవరైనా మొదటిసారి రోజ్ వాటర్ ఉపయోగిస్తుంటే.. చర్మంలోని ఒక చిన్న భాగంలో అప్లై చేసి ఏదైనా అలెర్జీ లేదా ప్రతిచర్య ఉందో లేదో తెలుసుకోవాలి.

ఇవి కూడా చదవండి

చర్మం pH స్థాయిలో మార్పు

రోజ్ వాటర్ ను ఎక్కువగా ఉపయోగిస్తే.. అది చర్మం pH స్థాయిని పాడు చేస్తుంది. దీని కారణంగా చర్మంపై చికాకు, దురద లేదా దద్దుర్లు సంభవించవచ్చు. సున్నితమైన చర్మం ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి.

ఎలా ఉపయోగించాలంటే

అయితే రోజ్ వాటర్ ని ఉదయం, రాత్రి సమయంలో దూది సహాయంతో ముఖానికి అప్లై చేసుకోవచ్చు. అంతేకాదు రోజ్ వాటర్ ను కలబంద జెల్ తో కలిపి కూడా అప్లై చేయవచ్చు. అయితే దీన్ని రోజుకు రెండుసార్లు మాత్రమే ఉపయోగించడం మంచిది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)