Forehead Wrinkles: నుదుటిపై ముడతలు పోవాలంటే.. వీటితో ఇలా చేస్తే మ్యాజిక్ చేసినట్లు మాయం..!

| Edited By: Janardhan Veluru

May 16, 2024 | 7:05 PM

అందం అనేది దేవుడు ఇచ్చిన వరం. ఆ అందాన్ని సరిగ్గా కాపాడుకునే టెక్నిక్స్ మీకు తెలిస్తే.. ఖచ్చితంగా మీ అందం అనేది రెట్టింపు అవ్వడం ఖాయం. చాలా మంది తమ అందాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. నేచురల్‌గా అందం ఎక్కువ కాలం నిలవాలంటే.. అందుకు సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం మేలు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పుల వల్ల కూడా ముఖంపై గీతలు, ముడతలు, మొటిమలు..

Forehead Wrinkles: నుదుటిపై ముడతలు పోవాలంటే.. వీటితో ఇలా చేస్తే మ్యాజిక్ చేసినట్లు మాయం..!
Forehead Wrinkles
Follow us on

అందం అనేది దేవుడు ఇచ్చిన వరం. ఆ అందాన్ని సరిగ్గా కాపాడుకునే టెక్నిక్స్ మీకు తెలిస్తే.. ఖచ్చితంగా మీ అందం అనేది రెట్టింపు అవ్వడం ఖాయం. చాలా మంది తమ అందాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. నేచురల్‌గా అందం ఎక్కువ కాలం నిలవాలంటే.. అందుకు సహజ సిద్ధమైన పదార్థాలను ఉపయోగించడం మేలు. సాధారణంగా వయసు పెరిగే కొద్దీ ముఖంపై అనేక మార్పులు కనిపిస్తాయి. ఈ మార్పుల వల్ల కూడా ముఖంపై గీతలు, ముడతలు, మొటిమలు అనేవి వస్తాయి. వీటిల్లో ఎక్కువగా నుదిటిపై ఫైన్స్ లైన్స్ ఏర్పడుతున్నాయి. అంటే నుదటిపై గీతలు ఉండటం మీరు గమనించే ఉంటారు. వీటిని పోగొట్టుకోవడానికి చాలా మంది వేలకు వేలు ఖర్చుపెట్టి కాస్మోటిక్ ప్రోడెక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటికి బదులు ఇంట్లోని ఉండే కొన్ని రకాల టిప్స్ ఉపయోగించవచ్చు. ఈ నేచురల్ ప్యాక్స్ వల్ల.. మీ ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.

ఎగ్ వైట్ – లెమన్ జ్యూస్:

గుడ్డులోని తెల్ల సొనలో ప్రోటీన్ అనేది మెండుగా ఉంటుంది. దీన్ని ఉపయోగించడం వల్ల మీ నుదిటిపై ఉండే గీతలు తగ్గి.. చర్మం బిగుతుగా మారుతుంది. అంతే కాదు చర్మం కూడా మెరిచేలా చేస్తుంది. ఒక బౌల్‌లో కొద్దిగా ఎగ్ వైట్, నిమ్మరసం కొద్దిగా వేసుకోవాలి. ఈ రెండింటిని బాగా మిక్స్ చేసి.. ముఖానికి పట్టించాలి. ఓ పావు గంట తర్వాత గోరు వెచ్చటి నీటితో ముఖాన్ని రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి.

క్యారెట్ – బాదం ఆయిల్ ఫేస్ ప్యాక్:

క్యారెట్, బాదం ఆయిల్.. రెండూ చర్మానికి మంచి పోషణను అందిస్తాయి. ముఖాన్ని తేమగా ఉంచి క్లియర్‌గా చేస్తుంది. ముందుగా ఒక చిన్న క్యారెట్ తీసుకుని.. మెత్తగా ఉడికించాలి. దీన్ని స్మాష్ చేసుకుని ఇందులో బాదం ఆయిల్ కలిపి.. ఓ పది నిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచి తీసి.. ఓ పావు గంట తర్వాత ముఖానికి బాగా పట్టించాలి. ఓ 15 నిమిషాల తర్వాత ముఖాన్ని క్లీన్ చేసుకోవడమే. ఇలా చేయడం వల్ల నుదిటిపై ఫైన్ లైన్స్ తొలగి.. ముఖం కాంతివంతం అవుతుంది.

ఇవి కూడా చదవండి

బొప్పాయి:

బొప్పాయి తిన్నా, ఫేస్ ప్యాక్ వేసుకున్నా చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయిలో అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇవి చర్మంపై ఉండే డెడ్ స్కిన్ సెల్స్‌ని తొలగించి.. క్లియర్‌గా ఉంచుతుంది. బాగా పండిన బొప్పాయిని తీసుకుని.. మెత్తని పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖాన్ని ఓ పావు గంట సేపు పట్టించండి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని రుద్దుతూ తొలగించాలి. ఇలా చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..