Relationship Tips: ఈ లక్షణాలు మీ స్నేహితులలో కనిపిస్తున్నాయా.. వీరు అత్యంత స్వార్ధపరులు.. వీరికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది

|

Jan 14, 2025 | 12:20 PM

మనుషులు రకరకాల మనసతత్వం ఉన్నవారు ఉంటారు. కొంతమంది మనసు పసిపిల్లల నవ్వులా.. విసించిన పువ్వులా స్వచ్చంగా ఉంటుంది. మరికొందరి మాత్రం మనసులో ఒకలా పైకి ఒకలా ప్రవర్తిస్తూ ఉంటారు. స్వార్ధం తో ఆలోచిస్తూ మంచిగా ఉన్నట్లు నటిస్తూ వెన్నుపోటు పొడవడానికి కూడా రెడీ అవుతారు. ఇలాంటి వారికి దూరంగా ఉండటం మంచిది. కనుక ఈ రోజు స్వార్థపరులను ఎలా గుర్తించాలి? స్వార్ధ పరుల లక్షణాలు ఏమిటో ఈ రోజు తెలుసుకుందాం..

Relationship Tips: ఈ లక్షణాలు మీ స్నేహితులలో కనిపిస్తున్నాయా.. వీరు అత్యంత స్వార్ధపరులు.. వీరికి ఎంత దూరంగా ఉంటే అంతమంచిది
Selfish People
Image Credit source: Shutterstock
Follow us on

జీవితంలో ప్రతి ఒక్కరూ విభిన్న లక్షణాలున్న వ్యక్తులను కలుస్తారు. కొంతమంది మాత్రం జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తులుగా మారతారు. కొన్ని సంబంధాలు పేరుకు మాత్రమే ఉంటాయి. అయితే అందరినీ మన సొంతం చేసుకోవడం కష్టం. కొంతమంది మంచి వ్యక్తులుగా ముసుగు వేసుకుంటారు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు స్వార్థ ప్రయోజనాల కోసం అసలు రంగుని బయటకు తీస్తారు. కాలం గడిచే కొద్దీ ఆ వ్యక్తి స్వార్థం బయటపడుతుంది. కనుక ఎవరిలోనైనా సరే కొన్ని లక్షణాలు కనిపిస్తే ఆ వ్యక్తులు స్వార్థపరులు. అలాంటి వారి నుంచి వీలైనంత దూరంగా ఉండడం మంచిది.

పనులు చేస్తున్నట్లు నటించేవారు
స్వార్థపరులు ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించరు. మనతో ఉంటూ మమ్మల్ని ఉపయోగించుకుని వారి పబ్బం గడుపుకుంటారు. వీరు తెలివిగా మాట్లాడతారు. తమ పనులన్నీ ఇతరులు చేసేలా చేస్తారు. వీరికి తమ స్వార్థం ముఖ్యం.. తమకు ప్రియమైన వారిని కూడా స్వార్ధం కోసం ఉపయోగించుకుంటారు. ఇతరులను పట్టించుకునే గుణం వీరికి ఉండదు.

అబద్దాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్య
స్వార్థపరులు ఇతరులకు సమయం సందర్భం లేకుండా వాగ్దానాలు చేస్తూ బంధిస్తారు. అయితే తాము చేసిన వాగ్దానాలను నెరవేర్చాలనే ఉద్దేశం వీరికి ఉండదు. చాలా సందర్భాల్లో తప్పుడు హామీలు ఇవ్వడం, అబద్ధాలు చెప్పడం వీరి లక్షణం. వాగ్దానాలు ఎలా చేయాలో వీరికి తెలుసు. అయితే వాటిని ఎలా నెరవేర్చాలో తెలియదు, కనుక వీరు నమ్మించి మోసం చేసిన సందర్భాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

ఆపద సమయంలో వదిలేసేది నేచర్
స్వార్థపరులకు ఇతరులను గురించి పట్టించుకునే మనస్తత్వం ఉండదు. వీరిని సాయం అడిగితే హ్యాండ్ ఇస్తారు. ఎదుటి వారి కష్టాల గురించి వినకుండా.. తమ కష్టాల గురించి చెబుతూ ఉంటారు. ఇటువంటి వ్యక్తుల స్నేహానికి దూరంగా ఉండటం మంచిది.

సంబంధాలకు విలువ ఇవ్వరు
అందరితో స్నేహంగా ఉన్నప్పటికీ.. సంబంధాలకు విలువ ఇవ్వరు. తమ చుట్టూ ఉన్న వ్యక్తుల భావోద్వేగాలతో వీరి సంబంధం లేనట్లు ప్రవర్తిస్తారు. తాము కోరుకున్నది మాత్రమే చేయాలనీ అనుకుంటారు. స్వార్థ ప్రయోజనాల కోసం స్నేహాన్ని ఉపయోగిస్తారు. ఇటువంటి వ్యక్తులతో మానసిక అనుబంధం, సాన్నిహిత్యం కోరుకోవడం తప్పు.

అందరితో ఉన్నా.. ఒంటరీగా ఉండే నేచర్
స్వార్థపరులు ఎప్పుడూ ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. చుట్టుపక్కల వారు తన మాట వినాలనే తత్వం ఎక్కువ. జీవితంలో ఎవరికైనా మంచి స్థానానికి చేరుకుంటే సహించరు. ఇతరుల సంతోషాని చూసి అసూయ పడతారు. ఇలాంటి వ్యక్తులు నిజంగా చెడ్డ వ్యక్తులు. ఇతరుల కంటే తమను తాము మెరుగ్గా ఉంచుకునేందుకు స్నేహాన్ని బంధాలను ఉపయోగించుకుంటారు. కనుక మీ స్నేహితుల బృందంలో ఈ లక్షణాలున్న వ్యక్తులు ఉంటే..అటువంటి వ్యక్తులకు దూరం ఉంచండి.

 

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)