AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fridge: సమ్మర్‌లో ఈ తప్పులు చేయకండి.. ఇవి పెడితే ఫ్రిడ్జ్ పేలిపోవడం ఖాయం..

వేసవిలో ఫ్రిడ్జ్ పేలిపోకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.? ఫ్రిడ్జ్ లో ఏ వస్తువులు పెట్టకూడదు.? కూలింగ్ తగ్గకుండా ఉండాలంటే ఏం చేయాలి.? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఇక్కడ తెలుసుకోండి. ఆ వివరాలు ఏంటో ఈ స్టోరీలో చూసేయండి. ఓ లుక్కేయండి.

Fridge: సమ్మర్‌లో ఈ తప్పులు చేయకండి.. ఇవి పెడితే ఫ్రిడ్జ్ పేలిపోవడం ఖాయం..
Fridge
Ravi Kiran
|

Updated on: Apr 29, 2026 | 10:13 AM

Share

వేసవి కాలం రాగానే మన ఇంట్లో ఫ్రిడ్జ్ పనితీరు చాలా కీలకంగా మారుతుంది. అయితే ఈ మధ్య కాలంలో సిలిండర్ల తరహాలోనే ఫ్రిడ్జ్‌లు కూడా పేలిపోతున్న వార్తలు మనం వింటున్నాం. దీనికి ప్రధాన కారణం ఫ్రిడ్జ్‌ను సరైన ప్రదేశంలో ఉంచకపోవడం, మితిమీరిన వాడకం. ఫ్రిడ్జ్ వెనుక ఉండే కంప్రెసర్ వేడెక్కినప్పుడు దానికి గాలి తగలకపోతే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన జాగ్రత్తలు:

సరైన దూరం:

ఫ్రిడ్జ్‌ను గోడకు ఆనించి పెట్టకూడదు. గోడకు, ఫ్రిడ్జ్‌కు మధ్య కనీసం 6 ఇంచుల గ్యాప్ ఉండాలి. దీనివల్ల ఎయిర్ సర్క్యులేషన్ జరిగి కంప్రెసర్ చల్లబడుతుంది.

అతిగా నింపకూడదు:

ఫ్రిడ్జ్‌లో వస్తువులను కిక్కిరిసి ఉంచకూడదు. గాలి ఆడేలా ఖాళీ ఉంచినప్పుడే కూలింగ్ మొత్తం సమానంగా అందుతుంది. లేదంటే కూలింగ్ తగ్గి ఆహార పదార్థాలు పాడవుతాయి.

ఉరుములు, మెరుపుల సమయంలో:

వర్షం పడుతున్నప్పుడు లేదా ఉరుములు వస్తున్నప్పుడు పవర్ ఫ్లక్చువేషన్స్ వల్ల బోర్డులు కాలిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు ఫ్రిడ్జ్ స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసేయడం అత్యంత సురక్షితం.

ఐస్ తొలగించేటప్పుడు జాగ్రత్త:

ఫ్రీజర్‌లో ఐస్ ఎక్కువగా గడ్డకట్టినప్పుడు చాకు లేదా స్క్రూ డ్రైవర్‌తో పొడవకూడదు. దీనివల్ల గ్యాస్ పైపులు లీక్ అయి ఫ్రిడ్జ్ పాడవుతుంది. కేవలం డీఫ్రాస్ట్ బటన్ నొక్కి ఐస్ కరిగే వరకు వేచి చూడాలి.

ఏవి పెట్టకూడదు?:

పచ్చళ్లు, చింతపండు లాంటి వస్తువులను ఫ్రిడ్జ్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. వీటివల్ల ఫ్రిడ్జ్ లో బ్యాడ్ స్మెల్ రావడమే కాకుండా ఖాళీ కూడా వృధా అవుతుంది.

ఇది చదవండి: కరివేపాకు మొక్క పెరగడం లేదా.? ఇవి ఇచ్చారంటే పచ్చగా, వద్దన్నా గుబురుగా పెరుగుతుంది..

Follow Us