Lifestyle: పదే పదే తలనొప్పి సమస్య వేధిస్తోందా.? ఇలా చిటికెలో పరార్.. వంటింటి చిట్కాలు
ఎండాకాలంలో తరచూ చాలామందికి తలనొప్పి సమస్య వేధిస్తూ ఉంటుంది. ఈ తలనొప్పి నివారణకు చాలామంది మందులు వాడుతుంటారు. అయితే మందులతో కాకుండా నేచురల్ టిప్స్ ద్వారా ఇలా చెక్ పెట్టొచ్చు. మరి ఆ నేచురల్ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందామా మరి.?

చాలామందికి ఎండాకాలంలో తరచుగా తలనొప్పి వస్తుంటుంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. వేడి, డీహైడ్రేషన్, సూర్యరశ్మి వల్ల కొందరికి తలనొప్పి రావడం సర్వసాధారణం. అయితే వీటిని మందులతో కంటే.. నేచురల్ టిప్స్‌తో ఈజీగా తగ్గించుకోవచ్చు. మొదటిగా మీరు తలనొప్పిని తగ్గించుకోవాలంటే.. నీళ్లు ఎక్కువగా తాగాలి. తలనొప్పికి ప్రధాన కారణం డీహైడ్రేషన్ కావచ్చు. ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గిపోతుంది. రోజుకి కనీసం 2-3 లీటర్ల నీళ్లు తాగాలి. బయటకు వెళ్తే కచ్చితంగా మీతో ఓ వాటర్ బాటిల్ తీసుకెళ్లడం మర్చిపోవద్దు. ఆ నీళ్లలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి తాగితే ఇంకా మంచిది.
ఇది చదవండి: సంతృప్తి కోసం ప్రైవేట్ పార్టులోకి.. నొప్పితో పరుగు పరుగున ఆస్పత్రికి.. ఎక్స్‌రే తీయగా
అటు ఎండ నుంచి ఇంటికి వచ్చిన వెంటనే తలనొప్పి మొదలు కావచ్చు. అందుకే చల్లటి నీళ్లలో ఓ గుడ్డను ముంచి నుదుటిపై లేదా తలపై పెట్టుకోవాలి. ఇది మీ శరీరంలోని వేడిని తగ్గించి, తలనొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. 10-15 నిమిషాలు ఇలా చేస్తే చాలు మీకు తలనొప్పి పరార్. ఇక కొబ్బరి నీళ్లు శరీరాన్ని తేమగా ఉంచడమే కాకుండా, ఎలక్ట్రోలైట్స్‌ని సమతుల్యం చేస్తాయి. ఎండలో తిరిగిన తర్వాత ఒక గ్లాసు కొబ్బరి నీళ్లు తాగితే తలనొప్పి రాకుండా చూసుకోవచ్చు. ఎనర్జీని కూడా ఇస్తుంది.
మరోవైపు ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల తలనొప్పి వస్తే వెంటనే చల్లని ప్రదేశంలో కూర్చోవాలి. కళ్లు మూసుకుని 10-15 నిమిషాలు రిలాక్స్ అవ్వాలి. ఎక్కువ వేడి వల్ల మెదడు ఒత్తిడికి గురవుతుంది. అందుకే విశ్రాంతి చాలా ముఖ్యం. అలాగే తలనొప్పి తగ్గాలంటే కొబ్బరి నూనె లేదా బాదం నూనెతో తలకు మసాజ్ చేయాలి. రెండు వేళ్లతో నెమ్మదిగా నుదురు, తల భాగాలను మర్దన చేస్తే రక్త ప్రసరణ మెరుగై, నొప్పి తగ్గుతుంది.
ఇది చదవండి: ఏపీ, తెలంగాణల్లో స్కూళ్లకు వేసవి సెలవులు ఎన్ని రోజులంటే.?
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి