ప్రస్తుత రోజుల్లో చాలా మందిని వేధించే సమస్యల్లో అధిక బరువు, బెట్టీ ప్యాట్ కూడా ఒకటి. వీటికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు, మారిన లైఫ్ స్టైల్ అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం తినక పోవడం, సమయానికి తినకపోవడం వల్ల.. చాలా మంది ఈ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ప్రతి రోజూ వ్యాయామం చేయడం, మంచి డైట్ ఫాలో అయితే ఈజీగా వెయిట్ లాస్ అవ్వొచ్చు. కానీ బెల్లీ ఫ్యాట్‌ని మాత్రం అంత త్వరగా తగ్గించలేం. ఇందుకు చాలా శ్రమ పడాల్సి ఉంటుంది. నెలల తరబడి వ్యాయామం చేస్తూ.. డైట్ ఫాలో అయినా మంచి రిజల్ట్ సాధించడం కష్టం అనే చెప్పొచ్చు. కానీ వ్యాయామం చేయకుండా.. డైట్ ఫాలో అవ్వకుండా కూడా మీరు బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
మీరు తినే ఆహారం త్వారా మార్పులు చేయవచ్చు. చాలా మంది ఎప్పుడు పడితే అప్పుడు తింటూ ఉంటారు. దీంతో జీర్ణ వ్యవస్థ అస్థవ్యస్థం అవుతుంది. సమయం అనేది కేవలం మనకే కాదు.. శరీరంలోని భాగాలు కూడా చాలా ముఖ్యం. సరైన సమయానికి తింటే.. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణమవుతుంది. కాబట్టి మీరు తిండి అనేది సరైన వేళలకు తినడం వల్ల మంచి ఫలితం ఉంటంది.
చాలా మంది మూడు పూటలా ఆహారం తీసుకున్నా.. చిరు తిండిని మాత్రం వదిలి పెట్టరు. ఏవో ఒకటి తింటూనే ఉంటారు. దీంతో తిన్నదంతా పొట్టలో పేరుకుపోయి.. సరిగా జీర్ణం కాదు. కాబట్టి ముందు మీరు బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే.. చిరు తిండికి బ్రేక్ వేయండి.
మీరు ఎంత తింటున్నారు అనే దాని కంటే.. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. బెల్లీ ఫ్యాట్ ఉన్నారు పిండి పదార్థాలకు దూరంగా ఉండాలి. మీ భోజనంలో లీన్ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. అలాగే కూరగాయలు, సలాడ్లు తీసుకోవాలి. వీటిని ఫాలో అవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్‌తో పాటు బరువు కూడా తగ్గొచ్చు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..