Raw vs Cooked Onions: రుచిగా ఉంటాయని ఉల్లిని పచ్చిపచ్చిగా తినేస్తున్నారా? చిక్కుల్లో పడతారు..
ప్రతి ఇంటి వంటగదిలో ఉల్లిపాయలు లేకుండా ఏ వంటకం పూర్తి కాదు. రుచికరమైన బిర్యానీ అయినా లేదా సలాడ్ ప్లేట్ అయినా అందులో ఖచ్చితంగా ఉల్లిపాయలు ఉండాల్సిందే. కానీ పచ్చి ఉల్లిపాయలు తినడం ఆరోగ్యకరమైనదా లేదా ఉడికించిన ఉల్లిపాయలు తినడం ఆరోగ్యకరమైనదా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది..

పోషకాహార నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉల్లిపాయల ప్రయోజనాలు,హాని మనం వాటిని తినే విధానంపై ఆధారపడి ఉంటాయి. పచ్చి ఉల్లిపాయలు రుచిగా ఉన్నప్పటికీ వి అందరికీ సురక్షితం కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. ఉల్లిపాయల్లో ఫ్లేవనాయిడ్లు, టానిన్లు, ఆల్కలాయిడ్స్ వంటి భాగాలు ఉంటాయి. ఈ భాగాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తున్నప్పటికీ వాటి అధిక వినియోగం శరీరానికి హానికరం. పచ్చి ఉల్లిపాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరం ఇనుము, కాల్షియంను గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. ఉల్లిపాయల్లో FODMAPలు ఎక్కువగా ఉంటాయి. ఇవి అందరికీ సులభంగా జీర్ణం కావు. దీనివల్ల గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. ఉల్లిపాయలు భూమి లోపల పెరుగుతాయి. కాబట్టి అవి నేల సూక్ష్మజీవులతో కలుషితం కావచ్చు.
పచ్చి ఉల్లిపాయలను సరిగ్గా కడగకుండా తింటే ఈ క్రిములు శరీరంలోకి ప్రవేశించి మెదడును ప్రభావితం చేసే సిస్టిక్ సిర్రోసిస్ వంటి తీవ్రమైన వ్యాధులను ఆహ్వానిస్తాయి. పరిశోధన ప్రకారం పచ్చి ఉల్లిపాయలు ఆరోగ్యకరమైన వ్యక్తులలో కూడా గుండెల్లో మంటను కలిగిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉడికించిన ఉల్లిపాయలు తినడం సురక్షితం, ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం కూడా. ఉల్లిపాయలను ఉడికించడం వల్ల వాటిలోని హానికరమైన సూక్ష్మజీవులు పూర్తిగా నాశనమవుతాయి. ఉడికించిన ఉల్లిపాయలు జీర్ణం కావడానికి చాలా సులభం. ఇది కడుపు, ఛాతీ సమస్యలను నివారిస్తుంది.
వంట చేయడం వల్ల ఉల్లిపాయలలోని ‘యాంటీ-న్యూట్రియెంట్స్’ ప్రభావం తగ్గుతుంది. శరీరం ఇతర పోషకాలు, ఖనిజాలను బాగా గ్రహించడానికి వీలు కల్పిస్తుంది. ఉల్లిపాయలు ఆరోగ్యానికి మంచివే. కానీ మీరు వీటిని తినే విధానం ముఖ్యం. మీరు పచ్చి ఉల్లిపాయలు తినవలసి వస్తే, వాటిని బాగా కడిగి, పరిమిత పరిమాణంలో తినడం మంచిది. అయితే, కడుపు నొప్పిని నివారించడానికి మెరుగైన ఆరోగ్యం కోసం నిపుణులు ఎల్లప్పుడూ వాటిని ఉడికించమనే సిఫార్సు చేస్తారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.




