AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Potatoes: బంగాళదుంప అంటే ఇష్టమని కూర, చిప్స్, సమోసాలు, పరాటాలు తినేస్తున్నారా.. ఇలాంటి వారు జాగ్రత్త సుమా..

కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపలో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

Potatoes: బంగాళదుంప అంటే ఇష్టమని కూర, చిప్స్, సమోసాలు, పరాటాలు తినేస్తున్నారా.. ఇలాంటి వారు జాగ్రత్త సుమా..
Potatoes Side Effects
Surya Kala
|

Updated on: Jul 29, 2024 | 10:29 AM

Share

భారతీయులు భోజన ప్రియులు. చాలా రకరకాల ఆహార పదార్ధాలను తయరు చేస్తారు. అంతేకాదు కొత్త వంటకాలను సృష్టిస్తారు. రకరకాల కూరగాయలున్నా.. బంగాళాదుంపలు మాత్రం వెరీ వెరీ స్పెషల్. బంగాళాదుంపలు పిలల్లు పెద్దలు అత్యంత ఇష్టంగా తినే కూరగాయలలో ఒకటి. వీటితో కొత్త వంటకాన్ని సృష్టిస్తారు. బంగాళాదుంప పరాటాల నుండి మసాలా కూర వరకు చాలా ఇష్టపడతారు. బంగాళాదుంపతో చేసే రకరకాల పదార్ధాలను తింటున్నా.. బంగాళాదుంపలంటే ఇష్టం అంటూ ఎక్కువగా తింటున్నట్లు అయితే కొంతమంది జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపలో విటమిన్ ఎ, పొటాషియం, మెగ్నీషియం, భాస్వరం, ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు గ్లూకోజ్, కార్బోహైడ్రేట్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతానికి ఏ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు బంగాళదుంపలకు దూరంగా ఉండాలో తెలుసుకుందాం..

మధుమేహ వ్యాధిగ్రస్తులు: బంగాళాదుంపలో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్ల పరిమాణం రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతుంది. కనుక షుగర్ లెవెల్ ను పెంచే బంగాళాదుంపలను మధుమేహ వ్యాధిగ్రస్తులు తినకూడదు.

ఇవి కూడా చదవండి

స్థూలకాయులు: బంగాళాదుంపల అధిక వినియోగం బరువు పెరగడానికి దారితీస్తుంది. ముఖ్యంగా బంగాళాదుంపలతో తయారు చేసే చిప్స్, సమోసాలు, పరాటాలు వంటి వాటిని తినడం ఇష్టపడేవారు.. బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో చాలా కొవ్వు ఉంటుంది. ఇది గుండెకు హానికరం.

ఎసిడిటీ సమస్య ఉన్నవారు: బంగాళదుంపలు తిన్న తర్వాత కొంతమందికి ఎసిడిటీ సమస్య కూడా వస్తుంది. అసిడేటి సమస్య ఉన్నవారు బంగాళాదుంప కూర తినడం మానేయాలి. ఎసిడిటీ తరచుగా వస్తుంటే బంగాళదుంపలు తక్కువగా తినాలి. బంగాళదుంపలు ఎక్కువగా తినడం వల్ల ఎసిడిటీతో పాటు కడుపు ఉబ్బరం కూడా వస్తుంది. ముఖ్యంగా బంగాళదుంప కూరలో మసాలా ఎక్కువగా ఉంటె జీర్ణ సంబధిత సమస్యలు ఎక్కువగా ఉంటాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)