AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lord Shiva: శివుడికి త్రిపురారి అనే పేరు ఎందుకు వచ్చింది? పురాణ కథ ఏమిటంటే..!

శివపురాణంలో వర్ణించబడిన ఒక ముఖ్యమైన కథ ఉంది. ఇందులో తారకాసురుడు అనే రాక్షసుడి ముగ్గురు కుమారుల గురించి చెప్పబడింది. ఈ ముగ్గురు కుమారుల పేర్లు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. ఈ ముగ్గురు చాలా ధైర్యవంతులు. తారకాసురుడి దురాగతాల కారణంగా శివుడి కుమారుడు కార్తికేయుడు తారకాసురుడిని సంహరించినప్పుడు తండ్రి మరణంతో తనయులు తీవ్రంగా దుఃఖించారు. దుఃఖంతో తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు.

Lord Shiva: శివుడికి త్రిపురారి అనే పేరు ఎందుకు వచ్చింది? పురాణ కథ ఏమిటంటే..!
Shiva As Tripurantaka
Surya Kala
|

Updated on: Jul 29, 2024 | 10:09 AM

Share

హిందూ మతంలో శివుడికి ప్రత్యేక స్థానం ఉంది. సోమవారం శివుడికి అంకితం చేయబడింది. అందుకే సోమవారం ఉపవాసం ఉంటారు. ఈ రోజున ఉపవాసం ఉండడం వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయని విశ్వాసం. శివుడికి భోలాశంకరుడు, లయకారుడు, త్రినేత్రుడు, పరమేశ్వరుడు, శంకరుడు వంటి పేర్లతో పాటు త్రిపురారి అనే పేరు కూడా ఉంది. దీని వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకుందాం.

పురాణశాస్త్రం ప్రకారం శివుడిని త్రిపురారి అని పిలుస్తారు

శివపురాణంలో వర్ణించబడిన ఒక ముఖ్యమైన కథ ఉంది. ఇందులో తారకాసురుడు అనే రాక్షసుడి ముగ్గురు కుమారుల గురించి చెప్పబడింది. ఈ ముగ్గురు కుమారుల పేర్లు విద్యున్మాలి, తారకాక్షుడు, కమలాక్షుడు. ఈ ముగ్గురు చాలా ధైర్యవంతులు. తారకాసురుడి దురాగతాల కారణంగా శివుడి కుమారుడు కార్తికేయుడు తారకాసురుడిని సంహరించినప్పుడు తండ్రి మరణంతో తనయులు తీవ్రంగా దుఃఖించారు. దుఃఖంతో తమ తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించారు.

ఇవి కూడా చదవండి

రాక్షసులకు అపూర్వమైన వరం ఇచ్చిన బ్రహ్మదేవుడు

తారకాసురుడి కుమారులు ముగ్గురు కఠోర తపస్సు చేసి బ్రహ్మదేవుడిని సంతోషపెట్టి వరంగా ఎగిరే నగరాలను నిర్మించుకున్నారు. ముగ్గురు రాక్షసులు మూడు ఎగిరే నగరాలను నిర్మించుకున్నారు.

మూడు అద్భుతమైన నగరాలను నిర్మించడం

బ్రహ్మదేవుని ఆదేశానుసారం మాయ అనే రాక్షసుడు ముగ్గురు రాక్షసుల కోసం మూడు అద్భుతమైన నగరాలను నిర్మించాడు. తారకాక్షుడికి బంగారు నగరం, కమలాక్షుడికి వెండి నగరం, విద్యున్మాలి కోసం ఇనుప నగరం నిర్మించబడ్డాయి. ఈ మూడు నగరాలను సమిష్టిగా త్రిపుర అని పిలుస్తారు. ఈ మూడు నగరాలు ఆకాశంలో వేర్వేరు దిశల్లో ఎగురుతూనే ఉండేవి. ముగ్గురు రాక్షసులు దేవతలను, ప్రజలను, మునులను నానా ఇబ్బంది పెట్టేవారు. మళ్ళీ ఎగిరే నగరాలకు వెళ్ళిపోయేవారు. అయితే ఈ మూడు నగరాలను చేయలరు.. అలా చేసిన దేవుడు చేతిలోనే ఈ ముగ్గురు రాక్షసుల మరణం అనే బ్రహ్మ దేవుడు వరం ఇచ్చాడు.

మూడు లోకాలలోనూ విధ్వంసం

ఈ మూడు నగరాల రాక్షసులు తమ శక్తిని, వరాలను దుర్వినియోగం చేసి మూడు లోకాలలో విధ్వంసం సృష్టించడం ప్రారంభించారు. వీరి దురాగతాలకు విసిగిపోయిన దేవతలు సహాయం కోసం బ్రహ్మ, విష్ణు , శివుడిని ప్రార్థించారు. బ్రహ్మ తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలికి వరం ఇచ్చినందున ఈ సమస్యను తాను పరిష్కరించలేనని దేవతలకు చెప్పాడు. దీని తరువాత దేవతలందరూ శివుని వద్దకు వెళ్లి అతని సహాయం కోసం ప్రార్థించారు.

త్రిపుర నాశనము కొరకు శివుని ప్రార్ధన

శివుడు దేవతల ప్రార్థనలను సంతసించిన త్రిపురను నాశనం చేస్తానని వారికి హామీ ఇచ్చాడు. అయితే మూడు నగరాలు ఒకే వరుసలో వచ్చినప్పుడే త్రిపుర విధ్వంసం సాధ్యమవుతుందని కూడా ఆయన అన్నారు. ఈ పని చాలా కష్టం, ఎందుకంటే మూడు నగరాలు నిరంతరం ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి. ఒకే వరుసలో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది.

సంవత్సరాల తరువాత మూడు నగరాలు లైన్‌లోకి రాబోతున్నప్పుడు ఒక ప్రత్యేక క్షణం రాబోతోంది. ఈ అపూర్వ క్షణాన్ని ఉపయోగించి విశ్వకర్మ శివుని కోసం ఒక దివ్యమైన రథాన్ని నిర్మించాడు. చంద్రుడు, సూర్యుడు దాని చక్రాలు, ఇంద్రుడు, వరుణుడు, యమ , కుబేరుడు వంటి వారు ఆ రథానికి గుర్రాలు అయ్యారు. హిమాలయం విల్లుగా మారింది. శేష నాగుడు తీగగా మారాడు. విష్ణువు స్వయంగా బాణంగా మారాడు. అగ్నిదేవ్ దాని కొనగా మారాడు. వాయు దేవుడు దానిని కదిలించింది. దేవతలందరి సమ్మిళిత శక్తితో చేసిన ఈ బాణం అత్యంత శక్తివంతమైనది.

శివుడిని త్రిపురారి అంటారు

త్రిపురను సంహరించడానికి పరమశివుడు దివ్యమైన రథాన్ని అధిరోహించినప్పుడు రాక్షసుల మధ్య అలజడి రేగింది. అప్పుడు దేవతలు, రాక్షసుల మధ్య భీకర యుద్ధం జరిగింది. త్రిపురలోని మూడు నగరాలు సరళ రేఖలో వచ్చిన వెంటనే శివుడు వెంటనే దివ్య బాణం ప్రయోగించి వాటిని నాశనం చేశాడు. త్రిపుర నాశనమైన వెంటనే, దేవతలందరూ శివుడిని స్తుతించడం ప్రారంభించారు. ఆ విధంగా శివుడు త్రిపురను నాశనం చేశాడు . ఈ సంహారం తర్వాతనే శివుడికి త్రిపురారి అనే పేరు వచ్చింది. అంటే “త్రిపుర నాశనం” అని అర్థం.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: పైన పేర్కొన్న అంశాలను మత గ్రంథాల ఆధారంగా ప్రజల సాధారణ ఆసక్తులను దృష్టిలో ఉంచుకుని ఇవ్వడం జరిగింది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించడం లేదు