Pomegranate For Skincare: దానిమ్మ తొక్కలతో మచ్చలేని మెరిసే అందం మీ సొంతం.. ఎలా వాడాలంటే?
ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో దానిమ్మ ముందు వరుసలో ఉంటుంది. దీని గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని రెట్టింపు చేయడంలోనూ బలేగా ఉపయోగపడతాయి. ఫేషియల్ స్క్రబ్‌గా ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు. దానిమ్మపండులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి..

దానిమ్మ గింజలు ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందాన్ని రెట్టింపు చేయడంలోనూ బలేగా ఉపయోగపడతాయి. ఫేషియల్ స్క్రబ్‌గా ఉపయోగించడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చని నిపుణులు అంటున్నారు. దానిమ్మపండులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మానికి సహజమైన మెరుపును అందిస్తుంది. దానిమ్మ పండు మాత్రమే కాదు దాని తొక్క, బెరడు, పువ్వులు మొదలైన అన్ని భాగాలు పోషకాలతో పాటు ఔషధ విలువలు నిండుగా ఉంటాయి. వీటిని సరైన పద్ధతుల్లో వాడితే చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా, ముఖంపై ఉన్న మచ్చలు కూడా తగ్గుతాయి. మరి ఈ పండును ఎలా ఉపయోగించాలో. స్క్రబ్ ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా ముఖం మీద నల్లటి మచ్చలు ఉంటే, అవి ముఖం అందాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ముఖాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారు దానిమ్మ తొక్కలను ఉపయోగించి ఇంట్లోనే స్క్రబ్ తయారు చేసుకోవచ్చు. తద్వారా ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు. ఈ స్క్రబ్ ని క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు తగ్గుతాయి. అంతేకాకుండా చర్మం నుంచి మలినాలను తొలగించడంలోనూ సహాయపడుతుంది. ఇలా చేయడం వల్ల నల్లటి మచ్చలు తగ్గి, ముఖం శుభ్రంగా కాంతివంతంగా ఉంటుంది. దానిమ్మ తొక్కతో తయారు చేసిన స్క్రబ్‌ని ముఖానికి అప్లై చేయడం వల్ల మృత చర్మ కణాలు తొలగిపోతాయి. చర్మం మెరుపును కోల్పోవడానికి ఈ మృత కణాలే కారణం. కాబట్టి వాటిని సరిగ్గా తొలగిస్తే, చర్మం తాజాదనంతో మెరుస్తుంది.
దానిమ్మ తొక్కతో స్క్రబ్ ఎలా తయారు చేయాలంటే..
సాయంత్రం ఎండలో దానిమ్మ తొక్కలను బాగా ఎండబెట్టి, వాటిని మెత్తని పొడిగా రుబ్బుకోవాలి. దీనిని సురక్షితంగా నిల్వ చేసుకుని ముఖానికి వినియోగించడం వల్ల మంచి ఫలితాలు పొందొచ్చు. ఒక స్పూన్ దానిమ్మ తొక్కల పొడిని ఒక గిన్నెలో తీసుకుని అందులో టేబుల్ స్పూన్ చక్కెర, ఒక టేబుల్ స్పూన్ తేనె, ఒక టేబుల్ స్పూన్ అవకాడో నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మూడు పదార్థాలు కలిపితే మంచి స్క్రబ్ అవుతుంది. ఈ మిశ్రమాన్ని పేస్ట్ లా చేసి ముఖానికి రాసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. అయితే స్క్రబ్ వేసుకునే ముందు, ముఖాన్ని బాగా కడగాలి. తర్వాత ఈ స్క్రబ్‌ని ముఖం మీద అప్లై చేసి బాగా మసాజ్ చేసుకోవాలి. మసాజ్ చేసి 10-15 నిమిషాలు అలాగే ఉంచి, ఆ తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం మృదువుగా ఉండటమే కాకుండా కాంతివంతంగా కూడా మారుతుంది.
దానిమ్మ తొక్క స్క్రబ్ ఎందుకు మంచిది?
ఈ పండులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్రమం తప్పకుండా ఉపయోగిస్తే వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ముడతలను నివారిస్తుంది. ఈ స్క్రబ్ ఉపయోగించిన ప్రతిసారీ, చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దానిమ్మతో తయారు చేసిన ఈ స్క్రబ్ సహజమైనది కాబట్టి, ఇది దురద, అలెర్జీలు వంటి చర్మ సంబంధిత సమస్యలను కలిగించదు.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.