Milk: పాలను రోజుకి ఎన్నిసార్లు మరిగిస్తున్నారు? ఈ పొరబాట్లు చేశారో అసలుకే ఎసరు..
మార్కెట్ నుండి తెచ్చిన పాలు లేదా పెరట్లో ఉండే ఆవు ఇచ్చే పాలను వేడి చేసి చాలా మంది తాగుతారు. అయితే ఈ పాలను మరిగించే సరైన పద్ధతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ప్యాక్ చేసిన పాలు లేదా మార్కెట్ నుంచి తెచ్చిన పాలను బాగా వేడి చేసిన తర్వాత తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమంది పాలను రోజు మొత్తంలో ఎన్నోసార్లు పదే పదే వేడి చేస్తుంటారు..
Updated on: Mar 10, 2025 | 8:26 PM

పాలు పోషకమైనవి. అందుకే పాలను రోజువారీ ఆహారంలో భాగంగా అందరూ వినియోగిస్తారు. ఇందులో ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు, కొవ్వు ఆమ్లాలు వంటి వివిధ రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలు క్రమం తప్పకుండా తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఈ పాలను ఎలా వేడి చేయాలో? ఎంత సేపు వేడి చేయాలో మీరెప్పుడైనా ఆలోచించారా?

మార్కెట్ నుండి తెచ్చిన పాలు లేదా పెరట్లో ఉండే ఆవు ఇచ్చే పాలను వేడి చేసి చాలా మంది తాగుతారు. అయితే ఈ పాలను మరిగించే సరైన పద్ధతి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

ప్యాక్ చేసిన పాలు లేదా మార్కెట్ నుంచి తెచ్చిన పాలను బాగా వేడి చేసిన తర్వాత తాగడం ఆరోగ్యానికి మంచిది. కానీ కొంతమంది పాలను రోజు మొత్తంలో ఎన్నోసార్లు పదే పదే వేడి చేస్తుంటారు.

పాలను మరిగించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. కానీ 10 నిమిషాల కంటే ఎక్కువ సేపు పాలను మరిగించకూడదు. ఎందుకంటే ఇలా చేయడం వల్ల పోషకాలను కోల్పోతుంది. పాలను ఐదు నుంచి పది నిమిషాలు మీడియం మంట మీద మాత్రమే మరిగించాలి.

పాలను మరిగించే ముందు 1/4 భాగాన్ని శుభ్రమైన నీటిలో కలపాలి. నీటిని జోడించడం వల్ల పాల పోషక విలువలను కాపాడుకోవచ్చు. అలాగే, స్టవ్ మీద పాలు మరిగించేటప్పుడు నిరంతరం చెంచాతో పాలను కదిలిస్తూ ఉండాలి. పాలను వేడి చేసిన తర్వాత బహిరంగ ప్రదేశంలో నిల్వ చేయకూడదు. ఫ్రిజ్‌లో ఉంచాలి. అలాగే పాశ్చరైజ్డ్ పాలను ఖచ్చితంగా మరిగించే తాగాలి. పచ్చివి ఎట్టిపరిస్థితుల్లోనూ తాగకూడదు.





























