AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీకు ఈ 5 సమస్యలు ఉన్నాయా?.. దానిమ్మ జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే, తిప్పలు తప్పవు!

దానిమ్మ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అందుకే వైద్యుడు కూడా తరచూ వీటిని తనమని చెప్తూ ఉంటారు. అయితే వీటిని తినడం అందరికీ మంచిదికాదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అవును, కొన్ని వ్యాధులతో బాధపడేవారు, వ్యాధుల నివారణకు మందులు వాడేవారు దానిమ్మ తినడం వల్ల అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే చాన్స్‌ ఉందని చెబుతున్నారు. ఇంతు ఎవరు వీటిని తినాలి, ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం పదండి.

మీకు ఈ 5 సమస్యలు ఉన్నాయా?.. దానిమ్మ జోలికి అస్సలు వెళ్లకండి.. లేదంటే, తిప్పలు తప్పవు!
అలెర్జీలకు గురయ్యే వ్యక్తులు కూడా దానిమ్మ తిన కూడదు. చాలా అరుదు అయినప్పటికీ కొంతమందికి దానిమ్మ కూడా అలెర్జీ ఉండవచ్చు. తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మ తినకూడదు. దానిమ్మ రక్తపోటును మరింత తగ్గిస్తుంది. కాబట్టి తక్కువ రక్తపోటు ఉన్నవారు దానిమ్మ వైద్యుల సలహా మేరకు మాత్రమే తీసుకోవాలి.
Anand T
|

Updated on: Aug 31, 2025 | 6:47 PM

Share

దానిమ్మ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల దీనిని సూపర్ ఫుడ్‌ అని కూడా అంటారు. ఇది మన గుండె ఆరోగ్యానికి, రక్త ప్రసరణను మెరుగుపరచడానికి, మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అందుకే వైద్యులు కూడా దానిమ్మపండు తినాలని సిఫార్సు చేస్తూ ఉంటారు. కానీ కొన్ని వ్యాధులతో బాధపడేవారు వీటిని తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ఈ పండును ఎవరు తినకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

దానిమ్మ పండును ఎవరు తినకూడదు, ఎందుకు?

తక్కువ రక్తపోటు ఉన్న వ్యక్తులు

దానిమ్మలో పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి రక్త నాళాలను సడలించి రక్తపోటును తగ్గించేందుకు సహాయపడతాయి. అందుకే ఇది అధిక రక్తపోటు ఉన్నవారికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. కానీ తక్కువ రక్తపోటు (హైపోటెన్షన్) వంటి సమస్యతో బాధపడేవారు దానిమ్మను ఎక్కువగా తినడం హానికరమని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతుంటే.. దానిమ్మను తినడం వారిలో రక్తపోటును మరింత తగ్గిస్తుంది. దీని వల్ల దృష్టిలోపం, మూర్ఛపోవడం వంటి సమస్యలు రావచ్చు.

ఎదైనా శస్త్రచికిత్స చేయించుకునే ముందు వీటిన తినడం తగ్గించాలి

చాలా మంది వైద్యులు మీకు ఏదైనా ఆపరేషన్ చేయాల్సి ఉంటే.. కనీసం రెండు వారాల ముందు నుంచే రోగులను దానిమ్మపండు తినకూడదని చెప్పతారు. ఎందుకంటే దానిమ్మ రక్తం గడ్డకట్టే ప్రక్రియను ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా ఆపరేషన్ సమయంలో అధిక రక్తస్రావం వంటి సమస్యలు ఏర్పడవచ్చు.

జీర్ణ సమస్యలు ఉన్న వ్యక్తులు

దానిమ్మలో ఫైబర్ అధికంగా ఉంటుంది, ఇది జీర్ణక్రియకు మంచిది, కానీ కడుపు సమస్యలు ఉన్నవారు దీనిని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇందులో ఉండే టానిన్లు కడుపు నొప్పి, గ్యాస్, ఉబ్బరం లేదా విరేచనాలు వంటి సమస్యలను కలిగిస్తాయి. అందుకే జీర్ణసమస్యలు ఉన్నవారు. ఈ పండ్లను ఎక్కువగా తింటున్నట్టుయితే ఒకసారి వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం

కొన్ని రకాల మందులు తీసుకుంటున్న వ్యక్తులు

ACE ఇన్హిబిటర్లు, స్టాటిన్స్, బీటా-బ్లాకర్స్, బ్లడ్ థిన్నర్స్ వంటి మందులు వాడుతున్న వ్యక్తులు దానిమ్మను తినడం తగ్గించాలి. ఎందుకంటే దానిమ్మలో ఉండే కొన్ని సమ్మేళనాలు మందుల పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపవచ్చు. దీంతో మీరు మరికొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనే అవకాశలున్నాయని నిపుణులు చెబుతున్నారు.

అలెర్జీ ఉన్న వ్యక్తులు

కొందరు వ్యక్తులకు దాని పండు తింటే అలర్జీ కలుగుతుంది. వీరు ఒకవేళ దానిమ్మ పండును తింటే ముఖం, గొంతులో వాపు, దురద, చర్మంపై దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అనాఫిలాక్సిస్ వంటి సమస్యలు రావచ్చు. శరీర రోగనిరోధక వ్యవస్థ దానిమ్మలో ఉండే కొన్ని ప్రోటీన్లకు ఎక్కువగా స్పందించడం వల్ల ఈ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. దానిమ్మపండు తిన్నా లేదా దాని జ్యూస్ తాగినా మీకు చికాకు, దురద లేదా ఏదైనా చర్మ సమస్య ఉంటే మీరు వెంటనే దానిని తినడం మానేసి వైద్యుడిని సంప్రదించం ఉత్తమం.

(Note: ఈ వ్యాసం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారం ఆధారంగా రూపొందించబడింది. కాబట్టి వీటి గురించి మీకు ఏవైనా సందేహాలు ఉంటే తప్పకుండా వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.