Plants Planting: ఈ మొక్కలను నాటితే కనక వర్షమే.. ఆర్థిక సమస్యలు దూరం..

|

Oct 14, 2024 | 3:21 PM

ప్రస్తుత కాలంలో చాలా మంది మొక్కలను పెంచేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో, ఆఫీస్‌లో మొక్కలతో నింపేస్తున్నారు. ఇంకొంత మంది మిద్దె గార్డెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచిది. మనకు ఉపయోగపడే నాలుగు మొక్కలు పెంచుకున్నా చాలు. మొక్కలు పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రంలో కూడా మొక్కలకు మంచి ప్రాముఖ్యత ఉంది. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం..

Plants Planting: ఈ మొక్కలను నాటితే కనక వర్షమే.. ఆర్థిక సమస్యలు దూరం..
Plant Planting
Follow us on

ప్రస్తుత కాలంలో చాలా మంది మొక్కలను పెంచేందుకు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో, ఆఫీస్‌లో మొక్కలతో నింపేస్తున్నారు. ఇంకొంత మంది మిద్దె గార్డెన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల చాలా మంచిది. మనకు ఉపయోగపడే నాలుగు మొక్కలు పెంచుకున్నా చాలు. మొక్కలు పెంచుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. జ్యోతిష్య శాస్త్రంలో కూడా మొక్కలకు మంచి ప్రాముఖ్యత ఉంది. కొన్ని రకాల మొక్కలు ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిది. అన్ని మొక్కల కంటే.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మొక్కలు వేరు. అవే విష్ణు కమలం, లక్ష్మీ కమలం. ఇవి రెండూ వేరు వేరు మొక్కలే అయినా.. కలిపి నాటితే చాలా మంచిదట. ఇవి పర్వాతలు ఉండే ప్రదేశంలో దొరుకుతాయి. లక్ష్మీ కమలం ఆకు పచ్చలో ఉండగా.. విష్ణు కమలం మాత్రం రంగు మారుతూ ఉంటాయి.

ఆర్థిక సమస్యలు మాయం అవుతాయి..

ఈ రెండు మొక్కలను ఇంట్లో పెట్టుకోవడం వల్ల చాలా మంచిదని జ్యోతిష్య నిపుణులు కూడా చెబుతున్నారు. ఎలాంటి ఆర్థిక సమస్యలు ఉన్నా.. అవన్నీ తీరతాయట. వీటిని ఇంట్లో పెట్టుకుంటే ఆర్థిక సమస్యలు తొలగి.. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని అంటున్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా అధిగమించవచ్చని చెబుతారు. కాబట్టి ఈ మొక్కలు మీకు ఎక్కడ కనిపించినా విడిచి పెట్టకుండా తెచ్చుకోండి.

మోదుగ చెట్లు నాటితే కనకం వర్షం..

అప్పుల ఊబిలో కూరుకుపోయి.. అనేక కష్టాలు పడుతున్నవారు.. ఆర్థికంగా పైకి రావాలి అనుకునేవారు.. ఐదు మోదుగ చెట్లను నాటితే చాలా మంచిది. ఈ చెట్లను నాటడం వల్ల సంక్షోభం నుంచి బయట పడొచ్చు. ఈ చెట్లు నాటితే కనక వర్షం కురుస్తుందని చెబతారు. వీటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంట్లో కానీ ఇంటి చుట్టు పక్కల కానీ నాటకూడదు. బయట ప్రదేశాల్లో లేదంటే మీ పొలం గట్ల మీద అయినా నాటవచ్చు. ఈ చెట్లను నాటడం వల్ల 10 రెట్లు అధికంగా పుణ్యాన్ని పొందుతాయని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..