AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ladakh Tour: బైక్‌పై లడఖ్ వెళ్తారా? ఇలా చేస్తే సేఫ్ జర్నీ..

మోటార్ సైకిల్‌పై లడఖ్ వెళ్లడం అనేది చాలా మందికి ఇష్టమైన కల. అక్కడి ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. వాటిని చూడటానికి పర్యాటకులు ఎన్నిఇబ్బందులు ఎదురైనా వెళ్లడానికి సాహసిస్తారు. లడఖ్‌ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశంలో ఉండే మంచు ఎడారి. ఇక్కడ బైక్ పై ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది.

Ladakh Tour: బైక్‌పై లడఖ్ వెళ్తారా? ఇలా చేస్తే సేఫ్ జర్నీ..
Ladakh Bike Tour
Madhu
|

Updated on: Apr 09, 2024 | 4:23 PM

Share

పర్యాటక ప్రదేశాలను చుట్టిరావడం, అక్కడి వింతలు, వాతావరణం, ప్రకృతి సుందర దృశ్యాలను చూడడం చాలామందికి ఇష్టమైన హాబీ. కుటుంబ సమేతంగానో, స్నేహితులతో కలిసో టూర్లు ప్లాన్ చేసుకుంటారు. దేశంలోని ​ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలలో లడఖ్‌ ఒకటి. ప్రస్తుతం చాలా మంది పర్యాటకులు అక్కడకు వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నారు. అది కూడా మోటారు సైకిల్‌పై అక్కడ పర్యటించడానికి ఇష్టపడుతున్నారు. అయితే అక్కడి వాతావరణం చాలా వేరుగా ఉంటుంది. కొండలు, రోడ్లు, నీటి ప్రవాహాలను దాటేటప్పుడు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది.

లడఖ్ కు పర్యాటకుల క్యూ..

మోటార్ సైకిల్‌పై లడఖ్ వెళ్లడం అనేది చాలా మందికి ఇష్టమైన కల. అక్కడి ప్రకృతి దృశ్యాలు ఎంతో ఆకట్టుకుంటాయి. వాటిని చూడటానికి పర్యాటకులు ఎన్నిఇబ్బందులు ఎదురైనా వెళ్లడానికి సాహసిస్తారు. లడఖ్‌ గురించి ఒక్కమాటలో చెప్పాలంటే ఎత్తయిన ప్రదేశంలో ఉండే మంచు ఎడారి. ఇక్కడ బైక్ పై ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రాంతంలో ఆక్సిజన్ చాలా తక్కువగా, చలి విపరీతంగా ఉంటుంది.

డ్రైవింగ్ నైపుణ్యం అవసరం..

లడఖ్ రోడ్లపై వాహనాన్ని నడపాలంటే చాలా నైపుణ్యం అవసరం. ఒకవైపు మంచు కొండలు, మరో వైపు కఠినమైన రోడ్లు, వాటిపై నీటి ప్రవాహాలు ప్రయాణికులను ఇబ్బంది పెడతాయి. ముఖ్యంగా కొండల మీద మంచు కరిగి, నీరుగా మారి రోడ్లపై ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడి నుంచి పల్లపు ప్రాంతానికి వెళుతుంది. వాటిని దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న ప్రవాహాలే అనుకుని ముందుకు వెళితే వాహనం జారిపోయే ప్రమాదం ఉంది. అలా జరిగితే పక్కనే ఉండే రాళ్లపై పడి గాయాలపాలయ్యే అవకాశం కూడా ఉంది. ఇటీవల ఒక వ్యక్తి తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌పై నీటి ప్రవాహాన్ని దాటడానికి ప్రయత్నిస్తూ ప్రమాదం అంచు వరకూ వెళ్లి, బయటపడిన వీడియో వైరల్‌ అయ్యింది.

ఇవి కూడా చదవండి

తప్పిన ప్రమాదం..

ఆ వీడియోలో ఒక వ్యక్తి బుల్లెట్‌పై నీటి ప్రవాహాన్ని దాటుతున్నాడు. అక్కడ నీరు చాలా తక్కువగా ఉంటుందని భావించాడు. కానీ వాహనం నీటిలోని వెళ్లగానే జారిపోబోయింది. వెంటనే రోడ్డు అంచున నిలిపేశాడు. బుల్లెట్‌ జారిపోయే పరిస్థితి రావడంతో వెంటనే బ్రేక్‌ వేసి, బ్యాలన్స్‌ చేశాడు. సమీపంలోని ప్రజలు వెంటనే అక్కడకు చేరుకుని బుల్లెట్‌ను వెనుకకు లాగారు. దీంతో ప్రమాదం తప్పింది. లడఖ్ ప్రాంతంలో రోడ్లపై నీటి ప్రవాహాలు పైకి మామూలుగా కనిపించినా ప్రమాదకరంగా ఉంటాయి. ఏమాత్రం ఏమరు పాటుగా ఉన్నా బైక్‌ తో సహా రాళ్లపై పడి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది.

జాగ్రత్తగా వ్యవహరించాలి..

ఇలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం అనుమానంగా ఉన్నా ముందుకు వెళ్లకుండా ఆగిపోవాలి. లేకపోతే చుట్టుపక్కల వ్యక్తుల సహాయం తీసుకోవాలి. అది కూాడా కుదరకపోతే అక్కడి ఆగిపోయే వేరే పెద్ద వాహనం వచ్చేవరకూ వేచి చూడాలి. ఉదాహరణకు కారు లేదా ట్రక్ ఆ దారిలో వెళ్లినప్పుడు నీటి ప్రవాహం లోతును అంచానా వేయడానికి వీలుంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..