Lifestyle: టిఫిన్ ఏ సమయంలో చేస్తున్నారు.? నిపుణులు ఏమంటున్నారంటే..
ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడాన్ని మనలో కొందరు లైట్ తీసుకుంటుంటారు. ముఖ్యంగా ఉదయం ఆలస్యంగా నిద్ర లేసే వారు నేరుగా లాంచ్ చేస్తుంటారు. అయితే టిఫిన్‌ను స్కిప్ చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతారు. అయితే....

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేయడాన్ని మనలో కొందరు లైట్ తీసుకుంటుంటారు. ముఖ్యంగా ఉదయం ఆలస్యంగా నిద్ర లేసే వారు నేరుగా లాంచ్ చేస్తుంటారు. అయితే టిఫిన్‌ను స్కిప్ చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతూనే ఉంటారు. బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోక తప్పదని చెబుతారు. అయితే బ్రేక్‌ఫాస్ట్ తీసుకోవడం ఎంత ముఖ్యమో, తీసుకునే సమయంలో కూడా అంతే ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు.
ఉదయం 8 గంటలలోపే టిఫిన్ చేయాలని చెబుతున్నారు. 9 గంటల తర్వాత టిఫిన్ చేసే వారితో పోల్చితే 8 గంటలలోపు చేసే వారికి డయాబెటిస్ ముప్పు 59% వరకు తగ్గుతున్నట్టు తేలింది మరి. ఆలస్యంగా టిఫిన్ చేసే వారిలో టైప్ 2 డయాబెటిస్ పెరిగే అవకాశం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహారం తీసుకునే సమయం రక్తంలో గ్లూకోజు, కొలెస్ట్రాల్ మోతాదుల నియంత్రణపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆహార వేళల మధ్య సమయానికి టైప్2 మధుమేహం మధ్య సంబంధాన్ని గుర్తించేందుకు గాను ఐఎస్‌గ్లోబల్ పరిశోధకులు పూనుకున్నారు.
ఇందులో భాగంగా మొత్తం 1,03,312 మంది ఆహార అలవాట్లను విశ్లేషించారు. ఇందులో భాగంగానే ఉదయం ఆలస్యంగా టిఫిన్ చేసే వారిలో మధుమేహం ముప్పు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అయితే కేవలం టిఫిన్ మాత్రమే కాకుండా రాత్రి భోజనం చేసే సమయం కూడా మధుమేహంపై ప్రభావం చూపుతుందని పరిశోధనల్లో తేలింది. రాత్రి 7 నుంచి 8 గంటలలోపే భోజనం చేసే వారిలో డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుందని చెబుతున్నారు. ఉదయం 8 గంటలోపు టిఫిన్, రాత్రి 8 గంటలలోపు డిన్నర్ పూర్తి చేసే వారిలో రొమ్ము, ప్రొస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం సైతం తగ్గుతుందని గతంలో నిర్వహించిన ఓ అధ్యయనంలో వెల్లడైంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..




