Personality Test: మీరు పుట్టిన నెల మీ వ్యక్తిత్వాన్ని.. మీరు కోరుకునే ప్రేమ గురించి వెల్లడిస్తుంది..
ఆప్టికల్ భ్రాంతి చిత్రాలు , శరీర ఆకారాల ద్వారా మీ వ్యక్తిత్వం, పాత్ర, ప్రేమ జీవితాన్ని ఎలా తెలుసుకోవచ్చునో.. అదే విధమా మీరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, పాత్ర, భావోద్వేగ ధోరణులు , ప్రేమ జీవితం ఎలా ఉంటుందో కూడా మీరు తెలుసుకోవచ్చు. కనుక ఈరోజు వ్యక్తిత్వ పరీక్షలో భాగంగా మీరు పుట్టిన నెల ఆధారంగా మీ వ్యక్తిత్వం ఏమిటి? మీరు ఎలాంటి ప్రేమ జీవితాన్ని ఇష్టపడతారో తెలుసుకోండి.

జ్యోతిషశాస్త్రంలో, పుట్టిన సమయం, రాశి, పుట్టిన తేదీ ఆధారంగా ఒక వ్యక్తి ఎలా అభివృద్ధి చెందుతాడు, అతని జీవితం ఎలా ఉంటుంది, అతను ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటాడు, అతను ఏ వయస్సులో వివాహం చేసుకుంటాడు ? అతని భవిష్యత్తులో జరిగే మంచి చెడులను గురించి తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఒక వ్యక్తి పుట్టిన నెల ఆధారంగా అతని వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చు. కనుక పుట్టిన నెల ఆధారంగా మనిషి వ్యక్తిత్వం, ప్రేమ జీవితం ఎలా ఉంటుందో తెలుసుకొండి..
మీ పుట్టిన నెల మీ వ్యక్తిత్వాన్ని, ప్రేమ జీవితాన్ని వెల్లడిస్తుంది:
జనవరి: ఈ నెలలో జన్మించిన వారు ఆశయాలు కలిగి ఉంటారు. వీరు చిన్న వయస్సులోనే వృత్తి లేదా బాధ్యత వైపు ఆకర్షితులవుతారు. క్రమశిక్షణ గల జీవితాన్ని గడుపుతారు. ఏ విషయాని అయినా జాగ్రత్తగా ఆలోచిస్తారు. ఇతరులపై తమ నమ్మకాన్ని తూకం వేస్తారు. ప్రతి నిర్ణయాన్ని ఆలోచనాత్మకంగా తీసుకుంటారు. అయినప్పటికీ వీరి జీవితంలోని ప్రేమ గురించి మనం పరిశీలిస్తే ప్రేమలో ఉన్నప్పుడు మొదట నిశ్చింతగా ఉండవచ్చు. అయితే వీరు తమ భావాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడతారు. వీరు సంబంధాలలో చాలా నమ్మకమైనవారు. విశ్వాసపాత్రులు. ప్రేమ విషయంలో అతను నమ్మదగిన వ్యక్తి కూడా.
ఫిబ్రవరి: ఈ నెలలో జన్మించిన వారు దూరదృష్టి గలవారు. సున్నిత మనస్కులుగా ఉంటారు. స్వేచ్ఛను ప్రేమించే వీరు.. ప్రేమ సంబంధాల్లో బంధించబడటానికి ఇష్టపడరు. అయితే వీరు తమ తాత్విక స్వభావాన్ని అర్థం చేసుకున్న భాగస్వామితో గాఢంగా కనెక్ట్ అవుతారు. తరచుగా తమ సృజనాత్మక లేదా మానవతా దృక్పథాన్ని ఇష్టపడే వ్యక్తులతో ప్రేమలో పడతారు.
మార్చి: ఈ నెలలో జన్మించిన వ్యక్తులు సాధారణంగా సహజమైన, దయగల, కళాత్మకమైన మనస్తత్వం కలిగి ఉంటారు. వీరు భావోద్వేగానికి గురవుతారు. మంచి అవగాహన కలిగి ఉంటారు. తమకంటూ ఓ సొంత ప్రపంచాన్ని సృష్టించుకుని అందులో జీవించడానికి ఇష్టపడతారు. ప్రేమ విషయానికి వస్తే.. వీరు సున్నితమైన మనస్కులు. కరుణగల ప్రేమికులు. ఆధ్యాత్మిక , భావోద్వేగ సాన్నిహిత్యాన్ని విలువైనదిగా భావిస్తారు. స్వభావరీత్యా ఎక్కువ శృంగారభరితంగా ఉంటారు.
ఏప్రిల్: ఏప్రిల్ నెలలో జన్మించిన వారు ధైర్యవంతులు, నిర్భయులు, నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. ఈ నెలలో జన్మించిన వారు చొరవ తీసుకోవడానికి ఇష్టపడతారు. తరచుగా వీరి ప్రేమ సంబంధాలలో ఉత్సాహాన్ని తెస్తారు. తమ శక్తితో అందరి దృష్టిని సులభంగా ఆకర్షిస్తారు. ప్రేమ విషయంలో చాలా మక్కువ కలిగి ఉంటారు. అయినా ముక్కుసూటిగా ఉంటారు. వీరు తరచుగా ప్రేమ గురించి ఆందోళన చెందుతారు. . ఎటువంటి పరిస్థితి ఎదురైనా తమ భాగస్వాముల పట్ల నమ్మకంగా, నిజాయితీగా ఉంటారు.
మే: ఈ నెలలో జన్మించిన వారికి అందం, స్థిరత్వంతో లోతైన సంబంధం ఉంటుంది. వీరు సౌకర్యాలను, లగ్జరీని ఇష్టపడతారు. వీరు ప్రేమలో విశ్వాసపాత్రులు.. నిబద్ధత విషయంలో చాలా గంభీరంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు వీరు మొండితనం ప్రేమలో ఉద్రిక్తతకు కారణమవుతుంది. ఎవరినైనా ప్రేమించడం మొదలు పెడితే.. తమను తాము పూర్తిగా అంకితం చేసుకుంటారు.
జూన్: ఈ నెలలో జన్మించిన వారికి బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు, భావోద్వేగ అవగాహన ఉంటుంది. వీరు తమ ఆలోచనలను వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. వీరు ఏపని చేసినా ప్రతిఫలాన్ని ఆశిస్తారు. ప్రేమలో వీరికి భావోద్వేగ సంబంధం చాలా అవసరం. తమ భాగస్వామిని చాలా ప్రేమిస్తారు. చాలా రొమాంటిక్ గా కూడా ఉంటారు. అయితే వీరు అతిగా ఆలోచించడం వలన సంబంధాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.
జూలై: జూలైలో జన్మించిన వారు భావోద్వేగభరితమైన వ్యక్తులు. అత్యంత కరుణామయులు. వీరు నమ్మకం.. భావోద్వేగ విధేయతపై ఆధారపడిన సురక్షితమైన, స్థిరమైన సంబంధాలను కోరుకుంటారు. మొదట తమ భావాలను దాచుకున్నప్పటికీ.. అర్థవంతమైన ప్రేమ సంబంధాన్ని కోరుకుంటారు. వీరు భావోద్వేగపరంగా, సంబంధాలలో చాలా విశ్వాసపాత్రంగా ఉంటారు.
ఆగస్టు: ఆగస్టులో జన్మించిన వ్యక్తులు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు తమ సంబంధాలకు విశ్వాసం ,ఆకర్షణను తెచ్చే వ్యక్తులు. వీరు తమ భాగస్వామిని ప్రేమగా చూసుకోవడానికి ఇష్టపడతారు. వీరు ఎల్లప్పుడూ తమ అభిరుచి , విధేయతకు సరిపోయే భాగస్వామిని కోరుకుంటారు.
సెప్టెంబర్: ఈ నెలలో జన్మించిన వ్యక్తులు ప్రేమ పట్ల శ్రద్ధపెడతారు. వీరు ఆలోచనాత్మకమైనవారు, ఆచరణాత్మకమైనవారు. వీరు ఉదార దాత స్వభావం కలిగి ఉంటారు. అద్భుతమైన శ్రోతలు. వీరు తమ భాగస్వామికి మద్దతు ఇచ్చే స్వభావాన్ని కలిగి ఉంటారు. మొదట సిగ్గుపడతారు అయితే కాలక్రమేణా తమ భాగస్వామితో లోతైన భావోద్వేగ సంబంధాలను పెంచుకుంటారు. వీరు విశ్లేషణాత్మక స్వభావం కొన్నిసార్లు వీరిని విమర్శలకు గురి చేస్తుంది.
అక్టోబర్: ఈ నెలలో జన్మించిన వారు సాధారణంగా మనోహరమైన వ్యక్తిత్వాలను కలిగి ఉంటారు. సంబంధాలలో సామరస్యాన్ని కోరుకుంటారు. వీరు తరచుగా అందం, కళ, సాంగత్యాన్ని ఆస్వాదిస్తారు. అలాగే ప్రేమలో, వీరు సంఘర్షణను నివారించాలని కోరుకుంటారు. తమ భావాలను వ్యక్తపరచడానికి ఇష్టపడతారు. ఈ నెలలో జన్మించిన వారు ఆప్యాయత, గాంభీర్యం , భావోద్వేగ స్థిరత్వంతో నిండిన దీర్ఘకాలిక ప్రేమను కోరుకుంటారు.
నవంబర్: నవంబర్‌లో జన్మించిన వ్యక్తులు తీవ్రత, అభిరుచి, లోతైన భావోద్వేగ అంతర్దృష్టులు కలిగి ఉంటారు. వీరు ఎవరినైనా నమ్మడం , ప్రేమించడం ప్రారంభించినప్పుడు గొప్ప విధేయతతో.. మనస్పురిగా ప్రేమిస్తారు. వీరు ఎక్కువగా తమ ప్రేమను గోప్యంగా ఉంచడానికి ఇష్టపడతారు. ప్రేమ జీవితంలో విశ్వసనీయత, భావోద్వేగ ధృవీకరణ ముఖ్యమైన అంశాలుగా పరిగణిస్తారు.
డిసెంబర్: ఈ నెలలో జన్మించిన వ్యక్తులు స్వతహాగా సాహసోపేతంగా.. ఆశావాదంగా ఉంటారు. వీరు స్వేచ్ఛకు విలువ ఇస్తారు. సంబంధాలలో సహజత్వాన్ని కోరుకుంటారు. వీరి ఉల్లాసభరితమైన స్వభావం, సానుకూల దృక్పథం అందరినీ ఆకర్షిస్తాయి. వీరు తమ ప్రేమ సంబంధాన్ని సంతోషంగా ఉంచుకోవాలని కోరుకుంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)




