Christmas Gift Ideas: బహుమతులతో మతి పొగొట్టండి..అదిరిపోయే క్రిస్మస్ గిఫ్ట్ ఐడియాలు
క్రిస్మస్ సమయంలో దేవుని స్తుతించి ఆరాధించడం ఎంత ముఖ్యమో? అదే సమయంలో బహుమతులను పంచి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే అందరు ఇచ్చే గిఫ్ట్స్ మనమూ ఇస్తే తేడా ఏం ఉంటుంది. ఎవరూ ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి మన సొంత వాళ్లను ఆశ్చర్యపర్చాలని అనుకుంటాం.
దేశంలో క్రిస్మస్ సందడి మొదలైంది. చర్చిలన్నీ విద్యుత్ దీపాలంకరణలతో సందడిగా ఉన్నాయి. ఈ రోజు రాత్రి నుంచే చర్చిల్లో క్రిస్మస్ ఆరాధన మొదలెడతారు. క్రిస్మస్ సమయంలో దేవుని స్తుతించి ఆరాధించడం ఎంత ముఖ్యమో? అదే సమయంలో బహుమతులను పంచి క్రిస్మస్ ఆనందాన్ని పంచుకోవడం కూడా అంతే ముఖ్యం. అయితే అందరు ఇచ్చే గిఫ్ట్స్ మనమూ ఇస్తే తేడా ఏం ఉంటుంది. ఎవరూ ఊహించని గిఫ్ట్స్ ఇచ్చి మన సొంత వాళ్లను ఆశ్చర్యపర్చాలని అనుకుంటాం. సో మీ కోసమే క్రిస్మస్ ప్రత్యేక బహుమతులను షార్ట్ లిస్ట్ చేశాం మీరు ఓ లుక్కెయ్యండి..
- నార్మల్ టీవీని ఆండ్రాయిడ్ టీవీలా మార్చి మీ సొంతవాళ్లను అబ్బురపరిచే ప్రత్యేక గిఫ్ట్ ఇది. అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ రూ.2999 కు అమెజాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. టీవీను పూర్తి హెచ్ డీ టీవీ గా మార్చడంతో పాటు అలెక్సా వాయిస్ రిమోట్ లైట్ తో వాయిస్ నావిగేషన్ సౌకర్యం కూడా ఉంది.
- సోనీ డబ్ల్యూఎఫ్-సీ500 ఇయర్ బడ్స్ రూ.4999 తో అమెజాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది. ఇది తేలికైన కాంపాక్ట్ హెడ్ ఫోన్. ఇది ఎలాంటి వారి చెవులకైనా సరిగ్గా సరిపోతుంది. గూగుల్ ఫాస్ట్ పెయిర్ వేగంగా కనెక్ట్ అవుతుంది. ఈ హెడ్ ఫోన్స్ సోని 360 రియాల్టీ ఆడియోకు సపోర్ట్ చేస్తాయి.
- జాబ్రా ఎలైట్ 3 తక్కువ ధరకు రిచ్ సౌండ్ ఇచ్చే ఇయర్ బడ్స్.. ఇవి. 6 మిమి స్పీకర్లతో, 4- మైక్రోకాల్ ఫీచర్ తో వస్తుంది. ఈ ఇయర్ బడ్స్ అత్యుత్తమ నాయిస్ క్యాన్సిలేషన్ తో వస్తాయి. అలాగే ఏడు గంట బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఇది రూ.3999కు అమెజాన్ వెబ్ సైట్ లో అందుబాటులో ఉంది.
- UBON హల్క్ SP-180 వైర్‌లెస్ స్పీకర్లు అవుటర్ పార్టీ ప్రియులకు పర్ ఫెక్ట్ క్రిస్మస్ బహుమతి. 1800 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే దీని ధర రూ.2499. ప్రస్తుతం ఇది కంపెనీ వెబ్ సైట్ లో మాత్రమే అందుబాటులో ఉంది. ఈ వైర్లెస్ స్పీకర్‌లో అంతర్నిర్మిత మైక్రోఫోన్ పోర్ట్, USB ఛార్జింగ్ మరియు 4 గంటల నిరంతర ప్లేబ్యాక్ ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా, స్పీకర్ USB పోర్ట్, మైక్రో TF/SD కార్డ్ మరియు AUXతో వస్తుంది.
- మీరు క్రిస్మస్ గిఫ్ట్ కింద స్మార్ట్ ఫోన్ ఇవ్వాలనుకుంటే మీరు రెడ్ మీ కె50ఐ 5 జీ ను ఓ సారి చెక్ చేయండి. ఈ మొబైల్ ఫ్లిప్ కార్ట్ లో రూ.22,790కు అందుబాటులో ఉంది. 6.67 అంగుళా డిస్ ప్లే పాటు 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
- అలాగే వివో వై 75 5 జీ ఫోన్ కూడా ఓ లుక్కెయ్యండి. ఈ మొబైల్ రూ.21999కు అందుబాటులో ఉంది. అలాగే ఈ మొబైల్ ను ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొంటే మరో రూ.1000 అదనంగా తగ్గుతుంది. 18 W ఫాస్ట్ చార్జింగ్ ఈ మొబైల్ సొంతం.
- ఐక్యూ జెడ్ 6 లైట్ మొబైల్ 6.8 అంగుళాల డిస్ ప్లే యూజర్లను ఆకట్టుకుంటుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ క్రిస్మస్ గిఫ్ట్ గా కరెక్ట్ గా సూటవుతుంది. ఈ మొబైల్ రూ.13999కు అమెజాన్ వెబ్ సైట్ లో ఉంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..