Pineapple Effects: పైనాపిల్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరు మాత్రం అస్సలు తినకూడదు!

పైనాపిల్ పండు అంటే చాలా మందికి ఇష్టం. ఇది పుల్లని, తీపి రుచితో ఉంటుంది. పైనాపిల్‌తో జ్యూసులు, సలాడ్లు, కబాబ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంది వేసవిలో ఎక్కువగా ఈ పండు తింటారు. వేసవి నుంచి ఎంతో ఉపశమనం ఇస్తుంది పైనాపిల్. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. పైనాపిల్‌లో విటమిన్లు ఎ, సి, మాంగనీస్, ఐరన్, ఫైబర్..

Pineapple Effects: పైనాపిల్ ఆరోగ్యానికి మంచిదే.. కానీ వీరు మాత్రం అస్సలు తినకూడదు!
Pineapple

Updated on: Jun 13, 2024 | 1:35 PM

పైనాపిల్ పండు అంటే చాలా మందికి ఇష్టం. ఇది పుల్లని, తీపి రుచితో ఉంటుంది. పైనాపిల్‌తో జ్యూసులు, సలాడ్లు, కబాబ్స్ కూడా తయారు చేసుకోవచ్చు. చాలా మంది వేసవిలో ఎక్కువగా ఈ పండు తింటారు. వేసవి నుంచి ఎంతో ఉపశమనం ఇస్తుంది పైనాపిల్. పైనాపిల్ జ్యూస్ తాగడం వల్ల ఎన్నో రకాల దీర్ఘకాలిక సమస్యలు, అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. పైనాపిల్‌లో విటమిన్లు ఎ, సి, మాంగనీస్, ఐరన్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. పైనాపిల్ వల్ల ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ.. కొంత మందికి హానికరం కూడా కావచ్చు. కొన్ని కొన్ని రకాల ఫుడ్స్ కొందరికి పడవు. అలాగే పైనిపిల్ తినడం వల్ల ఈ సమస్యలు ఉన్నవారికి అలర్జీ సమస్యలు రావచ్చు. మరి ఎలాంటి సమస్యలు ఉన్నవారు పైనాపిల్ తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

అలర్జీ సమస్య ఉన్నవారు:

పైనాపిల్ తింటే కొంత మందికి అలర్జీ సమస్యలు కూడా రావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, ఎర్ర బడటం, శ్వాసలో ఇబ్బందులు, వాంతులు, విరేచనాలు, కడుపులో నొప్పి సమస్యలు ఉన్నవారు పైనాపిల్‌కు దూరంగా ఉండటం మంచిది.

జీర్ణ సమస్యలు:

జీర్ణ సమస్యలు ఉన్నవారు ఎవరైనా సరే పైనాపిల్‌కు దూరంగా ఉండాలి. ఎందుంటే పైనాపిల్‌లో బ్రోమెలైన్ అనే జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. దీని వల్ల గ్యాస్, ఉబ్బరం, విరేచనాలు, అజీర్తి వంటి సమస్యలు తలెత్తుతాయి.

ఇవి కూడా చదవండి

ఈ మందులు వాడితే:

రక్తం గడ్డ కట్టడానికి మందులు వాడుతూ ఉండేవారు పైనాపిల్ తినకపోవడం మంచిది. దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు:

మూత్ర పిండాలకు సంబంధించిన సమస్యలు ఉన్నారు కూడా పైనాపిల్ తినకపోవడం మంచిది. ఎందుకంటే ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీలపై ప్రభావం కలుగుతుంది.

ప్రెగ్నెంట్ లేడీస్:

ప్రెగ్నెంట్ లేడీస్, బాలింతలు పైనాపిల్ తినకూడదు. ఒక వేల తిన్నా చిన్న ముక్కతో వదిలి పెట్టేయాలి. లేదంటే చాలా సమస్యలు వస్తాయి. దురద, వాపు సమస్యలు కూడా వస్తాయి.

చర్మ సమస్యలు:

చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు కూడా పైనాపిల్ తినకూడదు. ఇది తినడం వల్ల ఆ సమస్యలు మరింత ఎక్కువ అవ్వచ్చు. కాబట్టి వైద్యుల్ని సంప్రదించి తీసుకోవడం మంచిది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..