Papaya Side Effects: ఈ వ్యక్తులు బొప్పాయిని అస్సలు తినకూడదు.. ఎందుకో తప్పనిసరిగా తెలుసుకోండి..

|

Jun 22, 2022 | 6:40 AM

పలు వ్యాధులు, సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు బొప్పాయి పండుకు దూరంగా ఉండాలి. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి వంటి పోషకాలు ఉన్నప్పటికీ ఇది హానికరం అంటున్నారు నిపుణులు

Papaya Side Effects: ఈ వ్యక్తులు బొప్పాయిని అస్సలు తినకూడదు.. ఎందుకో తప్పనిసరిగా తెలుసుకోండి..
Papaya
Follow us on

Side Effects Of Papaya: బొప్పాయిలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. అన్ని సీజన్లలో లభించే బొప్పాయి పండును చాలామంది ఇష్టంగా తింటారు. అయితే.. కొంతమంది బొప్పాయికి దూరంగా ఉండటమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే కొన్ని సమస్యలతో బాధపడేవారు దీనికి దూరంగా ఉండాలంటూ ఆరోగ్య నిపుణులు సిఫార్సు చేస్తారు. అయితే ఇది అధికంగా తీసుకుంటే ప్రయోజనానికి బదులుగా హాని కలిగిస్తుంది. పలు వ్యాధులు, సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు బొప్పాయి పండుకు దూరంగా ఉండాలి. బొప్పాయిలో ఫైబర్, విటమిన్ సి వంటి పుష్కలమైన పోషకాలు ఉన్నప్పటికీ.. ఈ పండు చాలా మందికి హానికరమని నిపుణులు పేర్కొంటున్నారు. ఎలాంటి వారు బొప్పాయిగా దూరంగా ఉండాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఈ వ్యక్తులు బొప్పాయికి దూరంగా ఉండాలి..

కిడ్నీ స్టోన్ రోగులు: బొప్పాయిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకం కాల్షియంతో జతకలిసి సమస్యలను కలిగిస్తుంది. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు ఈ పండును తినకూడదు.

ఇవి కూడా చదవండి

ఈ ఔషధం తీసుకునే వ్యక్తులు దూరంగా ఉండాలి: బ్లడ్ థినర్ ఔషధం తీసుకుంటుంటే బొప్పాయి హానికరం. గుండె జబ్బులతో బాధపడే వారు ఈ ఔషధాన్ని తీసుకుంటారు. తద్వారా రక్త ప్రసరణలో ఎటువంటి సమస్య ఉండదు. అటువంటి రోగులు బొప్పాయిని తింటే సమస్యలు వస్తాయి.

ఆస్తమా రోగులు: శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నట్లయితే బొప్పాయికి దూరంగా ఉండాలి. ఈ పండులో ఉండే ఎంజైమ్‌లు ఆస్తమా రోగులకు హానికరం.

గర్భిణీలు: చాలా మంది ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గర్భిణీలు బొప్పాయిని అస్సలు తినకూడదు. ఎందుకంటే గర్భిణులకు హానికరం.

అలెర్జీలు ఉన్న వ్యక్తులు: అలర్జీ వంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే బొప్పాయిని అస్సలు తినకండి. ఎందుకంటే ఇందులో ఉండే పపైన్ మూలకాలు సమస్యను పెంచుతాయి. చర్మంలో దురద లేదా మంట సమస్య మరింత తీవ్రమవుతుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..