
కొంతమందికి పజిల్స్ పరిష్కరించడం చాలా సులభమైన పని. మరికొందరికి అలాంటి పజిల్స్ ను చేధించడం అసాధ్యంగా భావిస్తారు. వాటి వైపు తిరిగి చూడరు. అయితే వాస్తవానికి ఇలాంటి పజిల్ గేమ్స్ మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. మీరు ఎంత తెలివైనవారైనా.. మీ చూపులో పదును ఎంత అని తెలియజేస్తాయి. వాస్తవంగా పజిల్స్ మీ కళ్ళను మోసం చేస్తాయి… కానీ మీ మెదడుకు పదును పెడతాయి. ఇప్పుడు ఒక గమ్మత్తైన ఆప్టికల్ భ్రమ చిత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరు దానిని చూసిన వెంటనే.. గడ్డంతో ఉన్న ఒక వృద్ధుడి కనిపిస్తాడు. అయితే ఈ మనిషి ముఖం మధ్య ఒక పెంపుడు కుక్క దాగి ఉంది. మీరు పది సెకన్లలోపు ఈ జంతువును కనుగొనగలిగితే.. మీరు చాలా చురుకైనవారని సక్సెస్ కు మీరే కేరాఫ్ అడ్రస్ స్పష్టమవుతుంది.
ఈ చిత్రంలో ఏముందో చూడండి.
ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఇమేజ్ ని @fortbendmd ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసారు. ఇది చూడడానికి చాలా గమ్మత్తైనది. మొదటి చూపులో ఈ చిత్రంలో గడ్డం ఉన్న వ్యక్తి కనిపిస్తాడు. అది కూడా ఈ వ్యక్తి కళ్ళు మూసుకుని.. ఆలోచనలో మునిగి ఉన్నట్లు కనిపిస్తాడు. అయితే ఇక్కడ సవాలు ఏమిటంటే, గడ్డం ఉన్న వ్యక్తి ముఖంలో ఒక కుక్క దాక్కుని ఉంది. ఈ చిత్రంలో దాగి ఉన్న కుక్కను మీరు పది సెకన్లలోపు గుర్తించాలి. ఈ చిత్రాన్ని నిశితంగా పరిశీలించి సమాధానం చెప్పడానికి ప్రయత్నించండి.
గడ్డం ఉన్న వ్యక్తి ముఖం మధ్య దాగి ఉన్న కుక్కను గుర్తించడానికి మీరు మీ ఆలోచనా తీరుని మార్చుకోవాలి. ఈ చిత్రంలోని ప్రతి భాగాన్ని జూమ్ చేయడం ద్వారా సమాధానం కనుగొనడానికి ప్రయత్నించండి. దగ్గరగా చూసిన తర్వాత కూడా మీకు కుక్క కనిపించలేదా? అలా అయితే, మీ మొబైల్ ఫోన్‌ను తలక్రిందులుగా తిప్పండి.. మీకు ఎముకని చేతిలో పట్టుకుని ఉన్న కుక్క కనిపిస్తుంది.
Optical Illusion 1
మరిన్ని వైరల్ వార్తలను చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి