
ఆల్కహాల్ ఆరోగ్యానికి హానికరమన్న సంగతి తెలిసిందే. దీనిని ఏ రూపంలో తీసుకున్న ప్రమాదమే. అది షాంపైన్ అయినా, వైన్ అయినా..! కానీ చాలా మంది ఈ రెండింటిని ఒకటే అని పొరబడుతుంటారు. నిజానికి వీటి మధ్య చాలా తేడా ఉంది. చాలా మంది రెండు రకాలు ఒకటే అని అనుకుంటారు. కానీ ఒక తేడా ఉంది. వైన్ నిపుణుల అభిప్రాయం ప్రకారం షాంపైన్ ఒక రకమైన వైన్. కానీ ప్రతి షాంపైన్ వైన్ కాదు. రెండింటి మధ్య తేడా ఉంది. స్పార్క్లింగ్ వైన్, షాంపైన్ మధ్య దాని తయారు చేసే ప్రదేశాన్ని బట్టి ఉంటుంది. ఫ్రాన్స్‌లోని షాంపైన్ నగరంలో దీనిని తయారు చేస్తే, దానిని షాంపైన్ అంటారు. మీరు షాంపైన్ కొనుగోలు చేస్తే దాని లేబుల్‌పై అది ఫ్రాన్స్ నగరంలో తయారు చేసినట్లు ఉంటుంది. అయితే ఇతర ప్రదేశాలలో తయారైన వైన్‌ను షాంపైన్ అని పిలవకూడదు. వీటిని స్పార్క్లింగ్ వైన్ అని అంటారు.
వైన్, షాంపైన్ రెండింటి తయారీకి ద్రాక్ష ఉపయోగిస్తారు. కానీ ఒక తేడా ఉంది. ఫ్రాన్స్‌లోని షాంపైన్‌లో పండించే ద్రాక్షను షాంపైన్ కోసం ఉపయోగిస్తారు. ముఖ్యంగా దీని తయారీకి చార్డోన్నే, పినోట్ నోయిర్ అనే ద్రాక్ష రకాలను మాత్రమే వినియోగిస్తారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ రకమైన ద్రాక్షనైనా వైన్ తయారీకి ఉపయోగిస్తారు. ఈ ద్రాక్షను ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో వైన్ తయారీకి ఉపయోగిస్తారు. కానీ షాంపైన్ నగరంలో తయారు చేసే వైన్‌కు ఆ వెసులుబాటు లేదు. అంతేకాదు వైన్, షాంపైన్ తయారు చేసే పద్ధతి కూడా భిన్నంగా ఉంటుంది.
షాంపైన్ తయారు చేయడానికి ద్రాక్షను ఒక పెద్ద ట్యాంక్‌లో ఉంచి కిణ్వ ప్రక్రియకు గురి చేస్తారు. ఈ ప్రక్రియను సీసాలో పునరావృతం చేస్తారు. దీనిని 15 నెలలు అలాగే నిల్వ ఉంచుతారు. తరువాత కొన్ని పదార్ధాలను అందులో కలుపుతారు. ఆ తర్వాత మరికొన్ని నెలలు నిల్వ చేసిన తర్వాత దానిని అమ్ముతారు. వైన్‌ను నిల్వ చేసి మూడుసార్లు చల్లబరుస్తారు. తరువాత ఈస్ట్, చక్కెర అందులో కలుపుతారు. షాంపైన్‌తో పోలిస్తే, వైన్ తీపిగా, ఫ్రూటీగా ఉంటుంది. డ్రై వైన్ తాగే వ్యక్తులు షాంపైన్‌ను ఇష్టపడతారు. కానీ ద్రాక్షతో తయారు చేసినప్పటికీ ఏ రూపంలోనైనా ఆల్కహాల్ శరీరానికి హానికరమేనన్న విషయం గుర్తుపెట్టుకోవాలి.
మరిన్ని లైఫ్‌స్టైల్ కథనాల కోసం క్లిక్ చేయండి.