Health Tips: రోజూ రాత్రి గ్లాస్ పసుపు పాలను తాగితే ఇన్ని ప్రయోజనాలా?.. అస్సలు మిస్సవ్వకండి!
మన వంటిట్లో దొరికే పసుపును మనం వంటల్లోనే కాకుండా కొన్ని సార్లు ఔషదంగా కూడా వాడుతూ ఉంటాం. పసుపులో ఉండే మూలకాలు మనకు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తాయంటారు. అందుకే మనకు ఎప్పుడైనా దెబ్బలు తగిలితే మన పెద్దవాళ్లు పసుపు రాస్తూ ఉంటారు. ఇవే కాకుండా పసుపులో ఇంకెన్నో లాభాలు ఉన్నాయి. ఈ పసుపును రాత్రి పడుకునే ముందు పాలల్లో కలుపుకొని తాగితే అనేక ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే అవేంటో తెలుసుకుందాం పదండి.
Updated on: Aug 12, 2025 | 11:22 PM

పసుపు కేవలం వంటకాల్లో రుచిని అందించడమే కాకుండా మన శరీరానికి ఔషదంగా కూడా పనిచేస్తుంది. మనకు ఏవైనా గాయాలు తగిలినప్పుడు పసుపును రాసుకోవడం వల్ల దానిలో ఉండే యాంటీ బయోటిక్స్ గాయాన్ని త్వరగా నయం చేస్తాయి.

ఈ పసుపును రాత్రి పడుకునే ముందు పాలల్లో కలుపుకొని తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పసుపు కలిపిన పాలను గోల్డెన్ మిల్క్ అని కూడా పిలుస్తారట. ఇలా కలుపుకొని తాగితే పసుపు, పాలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు మన శరీరంలోని వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతాయట.

ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది ఎంతగానో మేలు చేస్తుందట. పసుపు పాలను తాగడం వల్ల మన శరీరంలోపల ఏర్పడే అంతర్గత వాపులు కూడా తగ్గుతాయట. అంతేకాకుండా రోజూ ఇలా పసుపు పాలను తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారి మృదువుగా ఉంటుంది.

పసుపు కలిపిన పాలలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి దోహదపడుతాయి. దీని వల్ల మన శరీరం సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉంటుంది. పసుపు పాలు మన జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు గొంతు నొప్పి, ఇతర శ్వాసకోశ సమస్యలను కూడా తగ్గిస్తాయి.

పాలు అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో సహాయపడతాయి. ఇది మాత్రమే కాదు పసుపు కలిపిన పాలు తాగడం వల్ల మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.




