డైట్ అవసరం లేదు… షుగర్ కంట్రోల్ కావాలంటే ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు…!

డయాబెటిస్ ఒక దీర్ఘకాలిక వ్యాధి. ఒక్కసారి వచ్చిందంటే బాధితులు జీవితాంతం చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకునే ప్రయత్నాలు చేయాలి. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ అనేది అతి పెద్ద ముప్పుగా మారింది. డయాబెటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా చాలామంది ఈ షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. కానీ, జీవన శైలి మార్పులు, చిన్నపాటి ఆహారపు అలవాట్లు పాటిస్తే డయాబెటిస్‌ బారిన పడకుండా ఉంటారని వైద్యులు సూచిస్తున్నారు.

డైట్ అవసరం లేదు... షుగర్ కంట్రోల్ కావాలంటే ఇలాంటి సింపుల్ టిప్స్ పాటిస్తే చాలు...!
Minimum walking for diabetes

Updated on: May 21, 2025 | 4:35 PM

మధుమేహం ఉన్నవారు తమ ఆహారం, పానీయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. చాలా మంది వైద్యులు సూచించిన మందులు తీసుకోవాలని తెలిసినప్పటికీ, పండుగలు వేడుకల పేరుతో తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు.. మధుమేహం ఉన్నవారికి మందులు, ఆహారం కాకుండా నడక ఉత్తమ ఔషధంగా వైద్యులు చెబుతున్నారు. షుగర్‌ బాధితులు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం నడిస్తే మీ చక్కెర స్థాయి ఎప్పటికీ పెరగదు. మధుమేహం ఉన్నవారికి వాకింగ్‌ సర్వరోగ నివారిణిగా చెబుతున్నార. మధుమేహం ఉన్నవారికి వాకింగ్‌ వల్ల కలిగే ప్రయోజనాల గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇక్కడ తెలుసుకుందాం…

ప్రతిరోజూ కొంచెం నడవడం అలవాటు చేసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి దీనికంటే మంచి ఔషధం లేదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాకింగ్‌ అనేది గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. బరువు నిర్వహణను పెంచుతుంది. గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ వంటి దీర్ఘకాలిక వ్యాధులను నివారిస్తుంది.

మధుమేహం ఉన్నవారికి కూడా వాకింగ్ ఒక అద్భుత నివారణ. క్రమం తప్పకుండా నడవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. ప్రతిరోజూ ఒక గంట పాటు నడవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడుతుంది. ఇది కండరాలలో గ్లూకోజ్ తీసుకోవడం పెరగడానికి దారితీస్తుంది. మెరుగైన గ్లైసెమిక్ నియంత్రణకు దారితీస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడం, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడం ద్వారా శరీరంలో చక్కెర పెరుగుదలను నివారించడంలో నడక అనేది ప్రభావవంతంగా పనిచేస్తుంది. వాకింగ్‌తో చక్కెరను నియంత్రించడంలో మాత్రమే కాకుండా రక్తపోటును నిర్వహించడంలో, అధిక రక్తపోటును నియంత్రించడంలో కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇది హృదయ సంబంధ ప్రమాదాలను తగ్గిస్తుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..