AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సబ్బులు, సర్ఫ్ లేకుండానే..ఇంట్లోని ఈ సహజ పదార్థాలతో బట్టలను మెరిపించండి!

సాధారణంగా బట్టలు ఉతకాలంటే డిటర్జెంట్ పౌడర్ లేదా సబ్బు తప్పనిసరి. అయితే కొన్నిసార్లు డిటర్జెంట్ హఠాత్తుగా అయిపోవడం లేదా కెమికల్స్ ఉన్న సబ్బుల వల్ల చర్మ అలర్జీలు రావడం జరుగుతుంటుంది. అటువంటి సమయంలో కంగారు పడకుండా మన వంటింట్లో లభించే సహజ పదార్థాలతోనే దుస్తులను శుభ్రంగా, సువాసనాభరితంగా ఉతుక్కోవచ్చు. డిటర్జెంట్ లేకుండా బట్టలను ఎలా ఉతుకోవాలో చూద్దాం.

సబ్బులు, సర్ఫ్ లేకుండానే..ఇంట్లోని ఈ సహజ పదార్థాలతో బట్టలను మెరిపించండి!
Natural Laundry Detergent
Jyothi Gadda
|

Updated on: Sep 19, 2026 | 12:25 PM

Share

వాషింగ్ డిటర్జెంట్ అందుబాటులో లేనప్పుడు లేదా రసాయన సబ్బులకు దూరంగా ఉండాలనుకున్నప్పుడు ఇంట్లోని సహజ సిద్ధమైన పదార్థాలతో దుస్తులను సులభంగా ఉతుక్కోవచ్చు. ఈ సహజ ప్రత్యామ్నాయాలు పర్యావరణానికి, చర్మానికి ఎంతో సురక్షితమైనవి. ఆయా పదార్థాలు, సులువైన పద్ధతులు ఏంటో తెలుసుకుందాం..

బేకింగ్ సోడా, తెల్ల వినెగర్

బేకింగ్ సోడా, తెల్ల వినెగర్ కలయిక బట్టలను శుభ్రం చేయడంలో అద్భుతంగా పనిచేస్తుంది. బేకింగ్ సోడా దుస్తులలోని దుర్వాసనను తొలగించడమే కాకుండా, వినెగర్ బట్టలకు సహజమైన సాఫ్ట్‌నర్‌లా పనిచేసి మరకలను తొలగిస్తుంది. దీనికోసం నీటిలో అర కప్పు బేకింగ్ సోడా, పావు కప్పు తెల్ల వినెగర్ కలిపి బట్టలను నానబెట్టి ఉతికితే బట్టలు తెల్లగా, కొత్తవాటిలా మెరుస్తాయి.

నిమ్మరసం:

నిమ్మకాయలోని సహజ ఆమ్ల గుణాలు బట్టలపై పడిన జిడ్డు మరకలను, పసుపు మరకలను తొలగించడంలో సహాయపడతాయి. తెల్లటి దుస్తులపై ఉన్న మరకలపై నేరుగా నిమ్మరసం పిండి, కాసేపు ఎండలో ఉంచి ఆ తర్వాత ఉతికితే మరకలు మాయమవుతాయి.

ఇవి కూడా చదవండి

కుంకుడుకాయలు:

రసాయనాలు లేని పద్ధతిలో బట్టలు ఉతకడానికి పూర్వకాలం నుండి కుంకుడుకాయలను ఉపయోగిస్తున్నారు. కొద్దిగా కుంకుడుకాయలను వేడి నీటిలో నానబెట్టి, ఆ రసాన్ని బట్టల ఉతికే నీటిలో కలపాలి. ఇది సహజమైన నురుగును ఇచ్చి దుస్తులను మృదువుగా ఉంచుతుంది.

ఉప్పు :

బట్టల రంగులు వెలిసిపోకుండా ఉండటానికి ఉప్పు బాగా ఉపయోగపడుతుంది. కొత్త బట్టలు ఉతికేటప్పుడు నీటిలో కొద్దిగా ఉప్పు వేస్తే రంగు పోకుండా ఉంటుంది. అలాగే రక్తం లేదా చెమట మరకలను తొలగించడంలోనూ ఉప్పు నీరు సహాయపడుతుంది.ఈ సహజ సిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల డిటర్జెంట్ ఖర్చు తగ్గడమే కాకుండా, బట్టల నాణ్యత దెబ్బతినకుండా ఉంటుంది!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us