AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nita Ambani: 61 ఏళ్ల వయసులోనూ హెల్తీగా.. నీతా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..

వయసు అనేది కేవలం ఒక అంకె మాత్రమే అని నిరూపించే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు. ముఖ్యంగా ఆరు పదుల వయసు దాటిన తర్వాత చాలామంది శారీరక శ్రమకు దూరంగా ఉంటూ విశ్రాంతి కోరుకుంటారు. కానీ ఆ మహిళ మాత్రం ఇందుకు పూర్తి భిన్నం.

Nita Ambani: 61 ఏళ్ల వయసులోనూ హెల్తీగా.. నీతా అంబానీ ఫిట్‌నెస్ సీక్రెట్ ఇదే..
Nita Ambani
Nikhil
|

Updated on: Jan 27, 2026 | 8:40 PM

Share

61 ఏళ్ల వయసులోనూ ఒక యువతికి ఉండే ఉత్సాహంతో, ఎంతో హుందాగా, శక్తివంతంగా కనిపిస్తారు. వ్యాపార సామ్రాజ్యాన్ని శాసిస్తూనే, తన ఆరోగ్యం కోసం ఆమె కేటాయించే సమయం ప్రతి మహిళకు ఒక పాఠం లాంటిది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె తన ఫిట్‌నెస్ ప్రయాణంలోని రహస్యాలను బయటపెట్టారు. “నేను 61 ఏళ్ల వయసులో చేయగలిగినప్పుడు, మీరు ఎందుకు చేయలేరు?” అంటూ ఆమె విసిరిన ఛాలెంజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ నీతా అంబానీని అంత ఫిట్‌గా ఉంచుతున్న ఆ ‘స్ట్రాంగ్ హర్’ మంత్రం ఏంటో వివరంగా తెలుసుకుందాం..

నిరంతర చలనం..

నీతా అంబానీ ఫిట్‌నెస్ ప్రయాణం ఈరోజో నిన్నో మొదలైంది కాదు. ఆమెకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే భరతనాట్యం అంటే ప్రాణం. నేటికీ ఆమె తన వారంలో కొన్ని రోజులను కనీసం గంట పాటు డ్యాన్స్ చేయడానికి కేటాయిస్తారు. నృత్యం అనేది కేవలం ఒక కళ మాత్రమే కాదు, అది శరీరానికి పూర్తిస్థాయి వ్యాయామాన్ని, మనసుకు ప్రశాంతతను ఇస్తుందని ఆమె నమ్ముతారు. ఈ క్రమశిక్షణే ఆమెను ఇన్నేళ్లుగా ఎనర్జిటిక్‌గా ఉంచుతోంది. కేవలం ఒకే రకమైన వ్యాయామానికి పరిమితం కాకుండా, నీతా అంబానీ తన వర్కవుట్ రొటీన్ లో వైవిధ్యాన్ని పాటిస్తారు. ఆమె వీక్లీ ప్లాన్ లో ఇవి భాగంగా ఉంటాయి

కండరాల దృఢత్వం కోసం లెగ్ వర్కవుట్స్, అప్పర్ బాడీ వ్యాయామాలు చేస్తారు. శరీర సమతుల్యత, ఫ్లెక్సిబిలిటీ కోసం యోగాసనాలు, కోర్ ఎక్సర్‌సైజులు తప్పనిసరి. స్విమ్మింగ్ తో పాటు ఆక్వా వ్యాయామాలు చేస్తూ కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా జిమ్ కు వెళ్లడం కుదరనప్పుడు 5,000 నుండి 7,000 అడుగులు నడవడం ఆమెకు అలవాటు.

డైట్ ప్లాన్​..

వ్యాయామంతో పాటు ఆహారం విషయంలోనూ ఆమె ఎంతో కచ్చితంగా ఉంటారు. నీతా అంబానీ పూర్తి శాకాహారి. ప్రకృతి సిద్ధంగా లభించే ఆహారానికే ఆమె ప్రాధాన్యత ఇస్తారు. వైట్ షుగర్ లేదా కృత్రిమ స్వీటెనర్లను ఆమె అస్సలు ముట్టరు. కండరాలు బలంగా ఉండటానికి తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకుంటారు. “ఇది కేవలం బరువులు ఎత్తడం గురించి కాదు, మన దైనందిన జీవితాన్ని ఉత్సాహంగా గడపడానికి కావాల్సిన స్టామినాను సంపాదించుకోవడం” అని చెబుతోంది నీతా అంబానీ.

స్ట్రాంగ్ హర్ మూవ్‌మెంట్

మహిళలు ఎప్పుడూ కుటుంబ బాధ్యతలు, పిల్లల పెంపకంలో పడి తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారని నీతా అంబానీ అభిప్రాయపడ్డారు. దీనిని మార్చడానికే ఆమె ‘స్ట్రాంగ్ హర్’ (#StrongHERMovement) ఉద్యమాన్ని ప్రారంభించారు. “మీరు బలంగా ఉంటేనే, ఏదైనా సాధించగలరు. వారానికి నాలుగు రోజులు, రోజుకు కేవలం 30 నిమిషాలు మీ కోసం మీరు కేటాయించుకోండి” అని ఆమె మహిళలకు పిలుపునిచ్చారు. నీతా అంబానీ ఫిట్‌నెస్ ప్రయాణం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మనం బలహీనపడకూడదు, మరింత దృఢంగా తయారవ్వాలి. తన మనవలతో ఆడుకోవడానికి, జీవితంలోని ప్రతి క్షణాన్ని ఆస్వాదించడానికి ఆమె పడుతున్న శ్రమ నిజంగా అభినందనీయం.

డ్యాన్స్, యోగాతో వయసును వెనక్కి నెట్టేస్తున్న అంబానీ కోడలు
డ్యాన్స్, యోగాతో వయసును వెనక్కి నెట్టేస్తున్న అంబానీ కోడలు
వామ్మో.. బాత్రూమ్‌లో అద్దం ఈ దిశలో ఉంటే కోటీశ్వరులు కూడా రోడ్డున
వామ్మో.. బాత్రూమ్‌లో అద్దం ఈ దిశలో ఉంటే కోటీశ్వరులు కూడా రోడ్డున
Team India: టీ20 ప్రపంచకప్ నుంచి తోపు ప్లేయర్ ఔట్..?
Team India: టీ20 ప్రపంచకప్ నుంచి తోపు ప్లేయర్ ఔట్..?
సినిమాలకు దూరంగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
సినిమాలకు దూరంగా ఉన్న ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టుకుంటే మీ అదృష్టం,డబ్బుకు లోటు ఉండదు..!
ఇంట్లో ఒంటె విగ్రహం పెట్టుకుంటే మీ అదృష్టం,డబ్బుకు లోటు ఉండదు..!
ఒక్కసారి ఈ చట్నీ రుచి చూస్తే కొబ్బరి చట్నీని మర్చిపోతారు!
ఒక్కసారి ఈ చట్నీ రుచి చూస్తే కొబ్బరి చట్నీని మర్చిపోతారు!
5 రోజుల్లో 16 మ్యాచ్‌లు.. రంగంలోకి 2 భారత జట్లు.. షెడ్యూల్ ఇదిగో
5 రోజుల్లో 16 మ్యాచ్‌లు.. రంగంలోకి 2 భారత జట్లు.. షెడ్యూల్ ఇదిగో
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7673 పోస్టుల..
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. ఆర్టీసీలో 7673 పోస్టుల..
కూరగాయలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచుతున్నారా? ఇది తెలుసుకోండి..
కూరగాయలను ప్లాస్టిక్ కవర్లలో ఉంచుతున్నారా? ఇది తెలుసుకోండి..
ఈ నటికి ఇంత పెద్ద కూతుర్లు ఉన్నారా? హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు
ఈ నటికి ఇంత పెద్ద కూతుర్లు ఉన్నారా? హీరోయిన్లకు ఏ మాత్రం తీసిపోరు