Skin Care Routine: ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే పడుకునే ముందు ఈ చిట్కాలు పాటించండి..

|

Jun 18, 2024 | 3:30 PM

చర్మాన్ని యవ్వనంగా కాపాడుకోవడానికి రాత్రి సమయంలో కూడా చర్మ సంరక్షణ పట్ల శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం. మెరిసే, యవ్వనమైన చర్మం పొందడానికి రాత్రి పడుకునే ముందు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

Skin Care Routine: ఎప్పటికీ యవ్వనంగా కనిపించాలంటే పడుకునే ముందు ఈ చిట్కాలు పాటించండి..
Skin Care Routine
Follow us on

మీరు యవ్వనంగా మెరిసే అందమైన చర్మం కావాలంటే ప్రతిరోజూ పడుకునే ముందు మీ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. సాధారణంగా మనం ఉదయం పూట చర్మ సంరక్షణపై ఎక్కువ దృష్టి పెడుతుంటాం. కానీ, రాత్రిపూట పట్టించుకోం. కానీ, కలుషితమైన గాలి, ఎండ, వర్షం, దుమ్మూదూళి నుండి మీ చర్మాన్ని రక్షించుకోవడానికి, అందమైన, మృదువైన చర్మాన్ని కలిగి ఉండటానికి, చర్మాన్ని యవ్వనంగా కాపాడుకోవడానికి రాత్రి సమయంలో కూడా చర్మ సంరక్షణ పట్ల శ్రద్ధ వహించటం చాలా ముఖ్యం. మెరిసే, యవ్వనమైన చర్మం పొందడానికి రాత్రి పడుకునే ముందు అనుసరించాల్సిన కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

* మేకప్ తొలగించండి:

మీకు మేకప్‌ వేసుకునే అలవాటు ఉంటే గనుక.. రాత్రి పడుకునే ముందు మంచి క్లెన్సింగ్ మిల్క్‌తో మేకప్ తొలగించండి. ఇది చర్మం శ్వాస తీసుకోవడానికి సహాయపడుతుంది.

ఇవి కూడా చదవండి

* ఫేస్ వాష్:

రాత్రి పడుకునే ముందు శుభ్రమైన నీటితో ముఖాన్ని కడగాలి. వేడి నీళ్లకు బదులు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవడం వల్ల చాలా మేలు జరుగుతుంది.

* రోజ్ వాటర్:

రోజ్ వాటర్‌లో గ్లిజరిన్ మిక్స్ చేసి పడుకునే ముందు ముఖానికి రాసుకుంటే చర్మంపై ఉండే మొటిమలు, మచ్చలు తగ్గుముకం పడుతుంటాయి.

* మాయిశ్చరైజర్:

పగటిపూట సూర్యుడి హానికరమైన కిరణాల నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌ని ఉపయోగించినట్లే రాత్రిపూట మాయిశ్చరైజర్‌ను అప్లై చేయడం చాలా ముఖ్యం.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..