Parenting Tips: పడుకునే ముందు మీ పిల్లలతో ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి..

అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా చాలా మంది పేరెంట్స్ చిన్నారులతో గడిపే సమయం తగ్గిపోయింది. కేవలం వారాంతాల్లోనే చిన్నారులకు సమయం కేటాయించే రోజులు వచ్చేశాయ్‌. దీంతో చిన్నారులు ఒంటరిగా ఫీలవుతుంటారు. స్మార్ట్‌ ఫోన్‌లకు బానిసలుగా మారుతుంటారు. కాబట్టి పేరెంట్స్‌ ఎంత బిజీగా ఉన్నా...

Parenting Tips: పడుకునే ముందు మీ పిల్లలతో ఈ విషయాలు అస్సలు మాట్లాడకండి..
Parenting Tips
Follow us

|

Updated on: Jul 09, 2024 | 12:54 PM

పిల్లల్ని పెంచడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఇది ఎన్నో సవాళ్లతో కూడుకున్న అంశం. భావోద్వేగాలతో కూడిన ప్రత్యేక అనుబంధం. వారి ఇష్టాలను తీరుస్తూ, అలాగనీ అడిగిన ప్రతీది ఇవ్వకుండా, వారికి ఏదో అవసరమో అదే ఇస్తూ, వారికి స్వేచ్ఛను హరించకుండా.. అలా అని విపరీతమైన స్వేఛ్చను ఇవ్వకుండా. ఇలా పిల్లల్ని పెంచడంలో ఎన్నో విషయాలు ముడిపడి ఉంటాయి.

అయితే ప్రస్తుతం మారిన జీవన విధానం, ఒత్తిడితో కూడుకున్న జీవితం కారణంగా చాలా మంది పేరెంట్స్ చిన్నారులతో గడిపే సమయం తగ్గిపోయింది. కేవలం వారాంతాల్లోనే చిన్నారులకు సమయం కేటాయించే రోజులు వచ్చేశాయ్‌. దీంతో చిన్నారులు ఒంటరిగా ఫీలవుతుంటారు. స్మార్ట్‌ ఫోన్‌లకు బానిసలుగా మారుతుంటారు. కాబట్టి పేరెంట్స్‌ ఎంత బిజీగా ఉన్నా రాత్రి పడుకునే ముందు మాత్రం చిన్నారులతో కచ్చితంగా కాసేపు మాట్లాడాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ సమయంలో వారితో కొన్ని విషయాలు అస్సలు పంచుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇతరులతో పోల్చకండి..

నిద్రపోయే ముందు చిన్నారులతో మాట్లాడే సమయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పోల్చకండి. మీ ఫ్రెండ్‌కి అన్ని మార్కులు వచ్చాయి, నీకు రాలేవు అనే విధంగా మాట్లాడకండి. దీనివల్ల వారిలో ప్రతికూల ప్రభావం పడుతుంది. రాత్రంతా వాళ్లు అదే భావనతో పడుకుంటారు. ఇతరులతో పోల్చకుండా వారి ప్రతిభను ప్రశసించండి.

పాజిటివ్‌ అంశాలు..

వీలైనంత వరకు చిన్నారులతో పాజిటివ్‌ అంశాలను మాట్లాడే ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా చిన్నారుల్లో ఉన్న నెగిటివ్‌ అంశాల గురించి చర్చించకండి. ఇది వారిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది.

తప్పుడు వాగ్దానాలు చేయకండి..

చాలా మంది పేరెంట్స్ తమ పిల్లల్ని అప్పటి వరకు సంతృప్తి పరచడానికి కొన్ని వాగ్దానాలు చేస్తుంటారు. అయితే కచ్చితంగా నెరవేర్చేట్లు ఉంటేనే వాగ్దానాలను చేయాలని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే వారు కూడా అదే అనుకరించే ప్రమాదం ఉంటుంది.

భవిష్యత్తు గురించి..

ఇక చిన్నారులు పడుకునే ముందు భవిష్యత్తుపై ఆందోళ కలిగించే సంభాషణ అస్సలు చేయకూడదు. దీనివల్ల వారిలో ఆందోళన పెరుగుతుంది. ఇది వారిలో నిద్రలేమి సమస్యకు కూడా దారి తీసే అవకాశం ఉంటుంది.

శిక్షించడం మానుకోండి..

రాత్రి చిన్నారులు పడుకోకముందే చాలా మంది శిక్షించడం లేదా వారితో కఠినంగా ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల కూడా వారిలో ప్రతికూల భావనలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి వీలైనంత వరకు అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేయాలి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. పిల్లల పెంపకానికి సంబంధించి సంబంధిత మానసిక నిపుణులను సంప్రదిస్తే మరింత మెరుగైన సమాచారాన్ని అందిస్తారు.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..