AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BP: బీపీతో బాధపడుతున్నారా.? రోజూ ఈ పనులు చేయండి చాలు..

రక్తపోటు బారిన పడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీసుకునే ఆహారం, జీవనశైలిలో మార్పుల కారణంగా రక్తపోటు సమస్య పెరుగుతోంది. అయితే కొన్ని రకాల చిట్కాలను పాటించడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

BP: బీపీతో బాధపడుతున్నారా.? రోజూ ఈ పనులు చేయండి చాలు..
Bp
Narender Vaitla
|

Updated on: Nov 23, 2024 | 12:30 PM

Share

ప్రస్తుతం ఎక్కువ మందిని వేధిస్తోన్న సమస్యల్లో రక్తపోటు ప్రధానమైంది. చిన్న వయసు వారు కూడా బీపీ బారిన పడుతున్నారు. గుండె జబ్బుల మొదలు ఎన్నో రకాల సమస్యలకు బీపీ ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా రక్తపోటు ఎక్కువవుతోంది. గుండె సంబంధిత సమస్యలకు కూడా బీపీ ప్రధాన కారణంగా నిలుస్తోంది. అయితే రక్తపోటును అదుపులో ఉంచుకోవాలంటే జీవన విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* బీపీ కంట్రోల్‌లో ఉండాలంటే నీటిని ఎక్కువగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. శరీరం డీహైడ్రేషన్‌ను గురికాకుండా చూసుకోవడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందని సూచిస్తున్నారు.

* రక్తపోటును అదుపు చేయడంలో టీ కూడా ఉపయోగపడుతుంది. ఉదయాన్నే రోజూ ఒక కప్పు టీని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్‌లో ప్రచురించిన వివరాల ప్రకారం.. టీ రక్తనాళాలను సడలించడంలో ఉపయోగపడుతుంది. ఇది రక్తపోటును మెరుగుపరుస్తుందని పేర్కొన్నారు. 12 వారాల అధ్యయనం తర్వాత ఈ విషయాలు వెల్లడయ్యాయి.

* తీసుకునే ఆహారంలో పెరుగు ఉంటే రక్తపోటు దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్లోరిడా స్టేట్‌ యూనివర్సిటీ నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. పెరుగులో బ్లూబెర్రీస్‌ కలుపుకొని తీసుకోవడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది.

* రక్తపోటును అదుపులో ఉండాలంటే ఉప్పును తక్కువగా తీసుకోవాలని చెబుతున్నారు. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల రక్తనాళాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిరోజూ 6 గ్రాముల ఉప్పు కంటే ఎక్కువ తినకూడదని సూచిస్సుతన్నారు. రోజుకు ఒకటిన్న టీస్పూన్‌ కంటే ఎక్కువ ఉప్పు తీసుకుంటే బీపీ వచ్చే అవకాశం ఉంటుంది.

* వ్యాయామం చేయడం ద్వారా కూడా బీపీ అదుపులో ఉంటుంది. ప్రతీరోజూ వ్యాయామం చేయడం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుంది. ఆరోగ్యకరమైన బరువు ఉంటే గుండె పనీతరు మెరుగ్గా ఉంటుంది.

* మద్యం సేవించడాన్ని పూర్తిగా మానేయాలి. బీపీకి ప్రధాన కారణం మద్యపానం అని చెబుతున్నారు. బోస్టన్‌ యూనీవర్సిటీకి చెందిన పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

* రక్తపోటును అదుపు చేయడంలో మంచి నిద్ర కూడా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ కచ్చితంగా 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు. తక్కువ నిద్రపోయే వారిలో రక్తపోటు వచ్చే అవకాశం 11 శాతం పెరుగుతుందని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
అయ్యప్ప భక్తి గీతంపై పేరడీ.. భగ్గు మన్న కేరళా సర్కార్!
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
ప్రపంచ రికార్డులకే దడ పుట్టించిన టీమిండియా దిగ్గజం.. ఎవరంటే?
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
అగ్గిపెట్టలో అద్భుతం.. యాదాద్రీశుడికి బంగారు పట్టుచీర సమర్పణ
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్.. ముగ్గురు మావోయిస్టులు మృతి
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
ఆ యువకుడు దారుణ హత్యకు ఎందుకు గురయ్యాడంటే..?
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
పరస్పర అంగీకార విడాకులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
ఉత్కంఠగా బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే ఓటింగ్.. టైటిల్ విన్నర్ ఫిక్స్!
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.6 లక్షల జీతంతో.. RBIలో ఉద్యోగాలు! రాత పరీక్ష లేకుండానే ఎంపిక
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
రూ.40 లక్షలు దోచుకున్నాక మళ్ళీ అదే బెదిరింపు.. కట్ చేస్తే..
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?
ఏంటీ.. ధురంధర్ సినిమా డైరెక్టర్ భార్య తెలుగులో హీరోయినా.. ?