దీన్ని నిమ్మకాయలో వేసి మీ ఇంటి తలుపు దగ్గర ఉంచండి… ఒక్క దోమ కూడా లోపలికి రాదు!

దోమలను తరిమికొట్టడానికి చాలా మంది దోమల నివారణలు, ద్రవాలు వంటి రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కానీ వంటగదిలోని కొన్ని వస్తువులు దోమలను తరిమికొట్టడంలో రామబాణంలా పనిచేస్తాయి. అందులో ఒకటి నిమ్మకాయ. అదేలాగో ఇక్కడ చూద్దాం...

దీన్ని నిమ్మకాయలో వేసి మీ ఇంటి తలుపు దగ్గర ఉంచండి... ఒక్క దోమ కూడా లోపలికి రాదు!
Mosquito Repellent

Updated on: Nov 02, 2025 | 6:05 PM

ఒక్క చిన్న దోమ మనిషి ప్రాణం తీస్తోంది. అవును..టైఫాయిడ్‌, మలేరియా వంటి విష జ్వరాలు, డెంగీ, ఫైలేరియా, చికెన్‌గున్యా వంటి ఎన్నో రకాల వ్యాధులు దోమ కాటుతో వస్తాయి. దోమ కాటు వేసిందా ఎంతటి వారైనా మంచాన పడాల్సిందే. పరిస్థితి విషమించిందంటే ఒక్కోసారి ప్రాణాల మీదకు కూడా వస్తుంది. దోమలను తరిమికొట్టడానికి చాలా మంది దోమల నివారణలు, ద్రవాలు వంటి రసాయన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కానీ వంటగదిలోని కొన్ని వస్తువులు దోమలను తరిమికొట్టడంలో రామబాణంలా పనిచేస్తాయి. అందులో ఒకటి నిమ్మకాయ. అదేలాగో ఇక్కడ చూద్దాం…

సాయంత్రం వేళల్లో మీ కిటికీలు, తలుపులు మూసివేయకపోతే దోమలు మీ ఇంట్లోకి రాకుండా నిరోధించడం అసాధ్యం. దోమ కాటును నివారించడానికి ఇకపై మీరు ఎప్పుడూ మీ తలుపులు, కిటికీలు మూసివేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. దోమ కాటు నుండి బయటపడటానికి కొన్ని ఇంటి నివారణలు ఉన్నాయి. వాటిలో ఒకటి నిమ్మకాయ నివారణ.

సాయంత్రం అయ్యేసరికి దోమల దండు ఇంట్లోకి ప్రవేశిస్తుంది. మీరు 2 నిమిషాలు తలుపు తెరవగానే వందలాది దోమలు ఇంట్లోకి దూసుకు వస్తాయి. దోమలను వదిలించుకోవడానికి మీరు నిమ్మకాయను ఉపయోగించవచ్చు. నిమ్మకాయ సహాయంతో దోమలను ఈజీగా తరిమికొట్టవచ్చు.

ఇవి కూడా చదవండి

ఇందుకోసం ఒక నిమ్మకాయ ముక్క తీసుకుని అందులో 5-6 లవంగాలు గుచ్చాలి. ఈ నిమ్మకాయను ఇంటి మూలలో, ఇంటి తలుపు దగ్గర ఉంచండి. దీని వాసన దోమల రాకను అడ్డుకుంటుంది. లవంగం నూనెను ఒంటికి రాసుకోవటం వల్ల కూడా దోమల కాటు నుండి బయటపడటానికి సమర్థవంతమైన మార్గం.

మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..