AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mulla vankaya: ముళ్ల వంకాయ ఆకు రసం తీసి రాస్తే.. బట్టతలపై వెంట్రుకలు మొలవాల్సిందే..!

మ‌న‌కు పొలాల్లో, బీడు భూముల్లో, రోడ్ల పక్కన ఎక్కువ‌గా క‌నిపించే మొక్క‌ల‌ల్లో నేల వంగ మొక్క కూడా ఒక‌టి. దీనిలో ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క ఆకుల‌ను ముళ్ల‌తో స‌హా నూరి రసాన్ని తీయాలి. ఈ ర‌సానికి తేనెను క‌లిపి బ‌ట్ట‌త‌ల‌పై రాస్తే ఆ భాగంలో తిరిగి వెంట్రుక‌లు వ‌స్తాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Mulla vankaya: ముళ్ల వంకాయ ఆకు రసం తీసి రాస్తే.. బట్టతలపై వెంట్రుకలు మొలవాల్సిందే..!
Mulla Vankaya
Ram Naramaneni
|

Updated on: Oct 26, 2024 | 1:32 PM

Share

వంకాయని ఇష్టంగా తినేవాళ్లు.. ఆహా ఇంతకంటే మంచి కర్రీ ఉంటుందా అంటారు. ఇష్టపడనివారు ఆ కర్రీ కనిపిస్తే.. వామ్మె అని ముఖం, నొసలు చిట్లిస్తారు. అయితే వంకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయ్.. రెగ్యులర్ నల్ల వంకాయలతో పాటు.. గుత్తి వంకాయలు మనికి బాగా తెలుసు. తెల్ల వంకాయలు, పోలవరం వంకాయలు అని చాలా రకాలు ఉన్నాయిలెండి. అయితే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అందించే..  ముళ్ల వంకాయ గురించి తెలుసా..? ఇది పల్లెటూర్లలో ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉంటుంది..పొద నుండా ముళ్లు ఉంటాయి. అందరూ పిచ్చి చెట్టు అనుకుంటారు దీన్ని. బాగా తెలిసినవారు, పెద్దలకు అది ముళ్ల వంగ అని తెల్సు.  ఈ చెట్టు కాయలే కాదు.. ఆకులు, వేర్లు ఇలా ప్రతి దాంట్లో మెడిసిన్ వాల్యూస్ ఉంటాయట. ఈ మొక్కలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తుంటారు. రామ ములక, కంటకారి, నేల ములక, నేల వాకుడు అనే పేర్లు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం…  ముళ్ల వంగ ఎన్నో వ్యాధులకు చెక్ పెడుతుందట. వాత, కఫం వాటి సమస్యలు ఉన్నవారు ఈ ముల్ల వంకాయ కూర తింటే చాలా మంచిదట.

అయితే ప్రస్తుతం మిలియన్ల కొద్దీ మగవాళ్లను మానసికంగా వేధిస్తోన్న సమస్య హెయిర్ ఫాల్ అండ్ బట్టతల. ఒత్తైన జుట్టు ఊడిపోతుంటే ఆ బాధ వర్ణణాతీతం. జుట్టు రాలకుండా చాలామంది రకారకాల ఆయిల్స్, షాంపూలు.. కొందరైతే మెడిసిన్ కడా వాడతారు. కానీ ఫలితాలు ఆశాజనకంగా ఉండవు. కానీ ఈ ముళ్ల వంగతో బట్టతల సమస్యను అరికట్టవచ్చని చెబుతున్నారు. ముళ్ల వంగ ఆకులు తీసుకుని.. వాటిని రసం తీసి, కొద్దిగా తేనె కలిపి.. హెయిల్ ఫాల్ అవుతున్న ప్రాంతంలో రాస్తే వెంట్రుకలు రాలిపోవడం ఆగిపోతాయట. అలాగే.. ఈ కాయ గింజలను తీసేసి.. రసం చేసుకుని, మందార పువ్వుల రసంతో కలిపి మసాజ్ చేసినా మంచి రిజల్ట్ ఉంటుందట. కేవలం జుట్టు రాలే సమస్యకు చెక్ పెట్టడమే కాదు.. చుండ్రు, పేను కొరుకుడు వంటి సమస్యలకు కూడా ఈ విధానాలు సమర్థవంతంగా పని చేస్తాయట. అలాగే గాల్ బ్లాడర్‌లో రాళ్లను కరిగించే శక్తి కూడా ఈ మొక్కకు ఉందట. ఈ మొక్క వేర్ల‌ను ఎండ‌బెట్టి పొడి చేసుకుని ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్ పౌడర్… పెరుగుతో కలిపి తీసుకుంటే.. రాళ్ల సమస్యను విముక్తి ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

పిప్పి ప‌న్ను సమస్య ఉన్నవారు పండిన ముళ్ల‌ వంగ కాయ‌ల‌ను తెచ్చి.. వాటిని కాల్చ‌గా వ‌చ్చిన పొగ‌ను నోటితో పీల్చ‌డం వ‌ల్ల పిప్పిప‌న్ను వల్ల క‌లిగే పెయిన్ నుంచి రిలీఫ్ వస్తుందట. ఇంతేనా శ్వాస సంబంధిత సమస్యలు, కాలేయ వ్యాధులు, జ్వరం, దగ్గు,బీపీ వంటి అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుందట.

(ఇది కేవలం నిపుణులు నుంచి సేకరించిన సమాచారం కోసం మాత్రమే… ఈ ప్రయోజనాలను టీవీ9 నిర్ధారించలేదు. మీరు దీన్ని ఏ రకంగా అయినా వినియోగించేముందు దయచేసి డాక్టర్లను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి